
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి కరాటే పోటీల్లో సత్తా చాటుతోన్న నగరానికి చెందిన పి. రష్మిక బ్లాక్‌బెల్ట్‌ను అందుకుంది. స్పార్క్స్ కుంగ్‌ఫు అకాడమీ ఆధ్వర్యంలో మెహదీపట్నంలోని ప్రభు త్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ కుంగ్ ఫు మాస్టర్ జమీల్ ఖాన్ కరాటే క్రీడాకారులకు పురస్కారాలను అందజేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని 50 పతకాలను గెలుచుకున్న 14 ఏళ్ల రష్మికకు బ్లాక్‌బెల్ట్‌తో పాటు ధ్రువపత్రాన్ని అందించారు. రష్మికతో పాటు మాస్టర్ పీఎం మోహిత్ బ్లూ బెల్ట్, అనూష ఠాకూర్ ఆరెంజ్ బెల్ట్, టి. శాశ్వత్ ఆరెంజ్ బెల్ట్‌లను అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment