ఈ తరానికి జంధ్యాల ప్రేమకథ | 40 days continuous shooting in Nalugu Stambalata movie | Sakshi
Sakshi News home page

ఈ తరానికి జంధ్యాల ప్రేమకథ

Published Wed, May 13 2015 12:00 AM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM

ఈ తరానికి జంధ్యాల ప్రేమకథ

ఈ తరానికి జంధ్యాల ప్రేమకథ

ప్రముఖ దర్శకులు జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన ‘నాలుగు స్థంభాలాట’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని యాపిల్ సినిమా సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘జంధ్యాల రాసిన ప్రేమకథ’. ఇషాంత్ వర్మ సమర్పణలో మనెగుంట కార్తీక్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ జరుగుతోంది. కృష్ణవర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలక్ష్మీ, గాయత్రీ గుప్తా, శేఖర్, దిలీప్ ముఖ్య తారలు. చిత్రవిశేషాలను దర్శకుడు చెబుతూ -‘‘ప్రస్తుత తరానికి తగ్గ కథతో రూపొందిస్తున్న చిత్రం ఇది. జంధ్యాలగారు సినిమాలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయో ఈ చిత్రం అంత బాగుంటుంది. ఇటీవల మలేసియాలో 40 రోజుల పాటు నిరాటంకంగా చిత్రీకరణ జరిపాం. ప్రస్తుతం జరుపుతున్న షెడ్యూల్‌తో సినిమా ముగుస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: కోశిరెడ్డి రవికుమార్, పసుపులేటి సురేష్‌బాబు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement