కాంగ్రెస్‌తోనే తెలంగాణ పునర్నిర్మాణం | telangana development only with congress party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తోనే తెలంగాణ పునర్నిర్మాణం

Published Tue, Apr 22 2014 12:03 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్‌తోనే తెలంగాణ పునర్నిర్మాణం - Sakshi

కాంగ్రెస్‌తోనే తెలంగాణ పునర్నిర్మాణం

మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి

షాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర పునర్నినిర్మాణం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర మాజీ హోంమంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చిన్నసోలీపేట్, మద్దూర్, హైతాబాద్ గ్రామాల్లో సోమవారం రాత్రి ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు.
 
తన కుమారుడు కార్తీక్‌రెడ్డికి, కాలె యాదయ్యకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. అసెంబ్లీ అభ్యర్థి కాలె యాదయ్య, డీసీసీ అద్యక్షుడు పడాల వెంకటస్వామి, సర్దార్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సదాలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నాయకులు జనార్దన్‌రెడ్డి, గోపాల్, లక్ష్మారెడ్డి, అస్మత్‌పాషా, సుధాకర్‌రెడ్డి, రాజు, కుమార్, చంద్రశేఖర్ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement