పరిగి, పూడూరు, న్యూస్‌లైన్: తెలంగాణ నవనిర్మాణ బాధ్యత కాంగ్రెస్‌దేనని మాజీ హోంమంత్రి సబితారెడ్డి తనయుడు, కాంగ్రెస్ యువనాయకుడు కార్తీక్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ నవనిర్మాణ యాత్ర మూడో రోజు పరిగి నియోజకవర్గంలో కొనసాగింది. చిట్టెంపల్లి గేట్ వద్ద నియోజకవర్గంలోకి చేరుకున్న పాదయాత్ర కండ్లపల్లి గేట్ మీదుగా మన్నెగూడ చౌరస్తాకు చేరుకుంది. చిట్టెంపల్లిగేట్‌లో ఇంద్రారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిట్టెంపల్లిగేట్, కండ్లపల్లిగేట్, మన్నెగూడలో పీసీసీ కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గ ప్రజలు ఘన స్వాగతం పలి కారు.
మన్నెగూడ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ.. 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, నాన్న ఇంద్రారెడ్డి కల ఎట్టకేలకు సోనియాగాంధీ సాకారం చేసిందని పేర్కొన్నారు. నాడు తెలంగాణ వస్తుందని నాన్న చెప్పా రు.. నేడు ఆకలను కాంగ్రెస్ సాకారం చేసిందన్నారు. మ ళ్లీ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఆర్థిక, సామాజిక, విద్యా, వైద్యరంగాల్లో తెలంగాణ అన్ని రాష్ట్రా ల కంటే మందుకు దూసుకుపోతుందన్నారు. ఎంతో మంది బలిదానాల వల్ల తెలంగాణ ఏర్పాటైందన్నారు.సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పటానికే ఈ యాత్ర చేపట్టానని ఆయన తెలిపారు.
విద్యార్థులపై కేసులు పెట్టించిన ఘనత హరీశ్వర్‌రెడ్డిదే: టీఆర్‌ఆర్
టీడీపీలో ఉండగా ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి జెతైలంగాణ అన్న విద్యార్థులు, యువకులు, జేఏసీ నాయకులపై కేసు లు పెట్టించారని పీసీసీ కార్యదర్శి టీ. రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు.బంధుమిత్రులతో కలిసి దళితులు, గిరిజ నుల భూములు గుంజుకున్న ఘనత హరీశ్వర్‌రెడ్డికే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, పునర్నిర్మాణం పై ఉన్న చిత్తశుద్ధే కాంగ్రెస్‌ను గెలిపిస్తుందన్నారు. కార్యక్రమంలో టీటీడీ మాజీ సభ్యుడు కాలేయాదయ్య, డీసీసీబీ వైస్ చైర్మన్ బీ.బీంరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీ. నారాయణ్‌రెడ్డి, పూడూరు మండల అధ్యక్షుడు సుబానయ్య, దోమ అధ్యక్షుడు రాములు, కుల్కచర్ల అధ్యక్షుడు వెంకటయ్య, గండేడ్ అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి, నాయకులు నర్సింహారావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మేఘమాల, మహిళా విభాగం అధ్యక్షురాలు సురేఖారెడ్డి తదితరులు పాల్గొన్నారు.