వైఎస్సార్‌సీపీకి జెడ్పీ చైర్‌పర్సన్ పద్మశ్రీ వెన్నుపోటు
సర్పంచ్‌గా ఓడిన కుటుంబం నుంచి జెడ్పీటీసీగా అవకాశం
గతేడాది జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవ ఎన్నిక
ఇప్పుడు అధికారం కోసం అడ్డదారులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీకి వైఎస్సార్‌సీపీలో ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. సాధారణ గృహిణిగా ఉన్న ఆమెకు జెడ్పీటీసీగా అవకాశం కల్పించారు. కొంత కాలానికి జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. 2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్‌గా ఓడిపోయిన కుటుంబం నుంచి వచ్చిన మహిళకు జెడ్పీటీసీగా, జెడ్పీ చైర్మన్‌గా అనేక అవకాశాలు ఇచ్చి అందలం ఎక్కిస్తే వెన్నుపోటు పొడిచారు. రాజకీయంగా ఉనికితో పాటు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీని మోగసించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
పద్మశ్రీ, భర్త ప్రసాద్‌కు పారీ్టలో ప్రాధాన్యం
పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త ఘంటా ప్రసాద్ బుధవారం నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్సార్‌సీపీలో మొదటి నుంచి ఘంటా ప్రసాద్ కీలకంగా ఉన్నారు. పార్టీ కూడా అదే స్థాయిలో ప్రాధాన్యతనిచ్చి జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా చేశారు. 2021లో దెందులూరు నియోజకవర్గం పెదపాడు జెడ్పీటీసీగా ఘంటా ప్రసాద్ భార్యకు అవకాశం కలి్పంచారు. అనంతరం జెడ్పీ చైర్మన్‌గా ఉన్న కవురు శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఎన్నికకావడంతో జెడ్పీ చైర్మన్ పదవీ ఖాళీ అయింది. అనేక మంది పదవి కోసం ప్రయత్నాలు చేసినా.. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు పదవి ఇవ్వాలనే కారణంతో పద్మశ్రీకి గతేడాది జెడ్పీ చైర్‌పర్సన్‌గా అవకాశం ఇచ్చారు.
మొదట జనసేన.. ఇప్పుడు టీడీపీ
2026 ఏప్రిల్ వరకు ఆమెకు పదవీ కాలం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓటమి పాలుకావడంతో పదవి కాపాడుకోవడానికి కూటమి వైపు చూశారు. తొలుత జనసేన అని ప్రకటించి చివరికి టీడీపీలో చేరారు. 2013 ఎన్నికల్లో ఘంటా ప్రసాద్ తండ్రి ఘంటా రంగారావు పెదపాడు మండలం సత్యవోలు నుంచి సర్పంచ్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మహిళకు జెడ్పీ చైర్‌పర్సన్‌గా ప్రాధాన్యం ఇచ్చినా వంచనకు పాల్పడి పార్టీకి ద్రోహం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా జెడ్పీటీసీల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తనతో పాటు 15 మంది జెడ్పీటీసీలను తీసుకువెళ్లడానికి అన్ని రకాలుగా ప్రయతి్నంచినా, జెడ్పీటీసీలు ససేమిరా అనడంతో ఒంటరిగా టీడీపీలో చేరారు.
ఘంటా రాకను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలు
ఘంటా ప్రసాద్ ఈ నెల 2న పారీ్టకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదే రోజు సాయంత్రం జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మళ్లీ మూడురోజులు తరువాత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను విశాఖలో కలిసి ఆగమేఘాల మీద ఘంగా ప్రసాద్ టీడీపీ కండువా వేయించుకున్నారు. మళ్లీ బుధవారం అమరావతిలో లోకే‹Ùను కలిసి జెడ్పీ చైర్‌పర్సన్, ఆమె భర్త టీడీపీలో చేరారు. కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు మినహా ఏలూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరూ పాల్గొనలేదు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జెడ్పీ చైర్‌పర్సన్ చేరికను బలంగా వ్యతిరేకించారు.
Comments
Please login to add a commentAdd a comment