
క్రాంతికిరణ్
శివ్వంపేట(నర్సాపూర్) : బాలుడు అదృశ్యమైన సంఘటన మండల పరిధి కొత్తపేట గ్రామంలో చోటుచేసుకుంది. గంగిరెద్దుల కాలనీలో నివాసం ఉండే మారయ్య కుమారుడు క్రాంతికిరణ్ (9) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతున్నాడు. గత నెల 24న సాయంత్రం ఇంట్లో నుంచి బయటకువెళ్లిన బాలుడు తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. మంగళవారం బాలుడి తండ్రి మారయ్య శివ్వంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు శివ్వంపేట పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్సై లక్ష్మీకాంతరెడ్డి కోరారు.
రాంపూర్ తండాలో..
చేగుంట(తూప్రాన్) : మండలంలోని రాంపూర్ తండాలో తమ కుమారుడు ప్రవీణ్ తప్పిపోయినట్లు తల్లిదండ్రులు యెమ్లీ, వెంకటిలు తెలిపా రు. వారి కుమారుడు ప్రవీణ్ అలియాస్ అచ్చూ శనివారం ఇంటి నుండి వెళ్లిపోయినట్లు తెలిపారు. అదేరోజు రాత్రి నుండి ప్రవీణ్‌కోసం వెతికినా జాడ దొరకలేదని తెలిపారు. మూడు రోజులుగా బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో మంగళవారం చేగుంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదును తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టి బాలుడి ఆచూకీ కనుగొంటామని తెలిపారని చెప్పారు
Comments
Please login to add a commentAdd a comment