సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ సాకారం దిశగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాగుతున్న అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ వంతుగా కృషి చేయాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. పాలకవర్గాలు కొలువుదీరిన వెంటనే అభివృద్ధికి పునరంకితమవ్వాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా ప్రజల వద్దకు చేర్చేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాల న్నారు.
కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్‌పర్స న్లు పట్నం సునీతారెడ్డి (వికారాబాద్), స్వర్ణ సుధాకర్ (మహబూబ్‌నగర్), నల్లాల భాగ్యలక్ష్మి (మంచిర్యాల), న్యాలకొండ అరుణ (సిరిసిల్ల), తీగల అనితారెడ్డి (రంగారెడ్డి), మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి (మేడ్చల్) ఆదివారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారిని అభినందించారు. కార్యక్రమం లో మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, పురాణం సతీశ్, ఎమ్మెల్యేలు రమేశ్‌బాబు, నరేందర్‌రెడ్డి, సుమన్, దుర్గం చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment