పండ్లు, కాయగూరల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లతో ఆరోగ్యానికి మేలన్నది అందరికీ తెలుసుగానీ.. దీని వెనుక ఉన్న రహస్యమేమిటన్నది మాత్రం అంతగా తెలియదు. యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు ఈ లోటు భర్తీ అయింది. అంతేకాకుండా మార్కెట్‌లో లభ్యమయ్యే యాంటీ ఆక్సిడెంట్స్ మన రక్తనాళాలు విశాలంగా మారేందుకు సాయపడతాయని... తద్వారా వాటి వయసు 20 ఏళ్లు తగ్గినట్లు అవుతుందని కూడా గుర్తించారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో ఈ మార్పు జరిగితే గుండెజబ్బుల నుంచి రక్షణ లభిస్తుందన్నది తెలిసిందే. కొంతమంది 60 – 69 ఏళ్ల మధ్యవయసున్న కార్యకర్తలకు ఈ యాంటీ ఆక్సిడెంట్లను రోజుకు 20 మిల్లీగ్రాములు, ఇంకొంతమందికి ఉత్తుత్తి మందు అందించినప్పుడు వారి ఎండోథీలియం (రక్తనాళపు లోపలిగోడలు) చాలా చక్కగా పనిచేయడం మొదలుపెట్టాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు చెప్పారు.
వరుసగా ఆరువారాలపాటు ఈ యాంటీ ఆక్సిడెంట్లను వాడిన తరువాత రెండు వారాల విరామమిచ్చి యాంటీ ఆక్సిడెంట్లను ఉత్తుత్తి మందులను మార్చి ఇచ్చామని అప్పుడు కూడా దాదాపు సగంమందిలో రక్తనాళాలు విశాలంగా మారాయని చెప్పారు. ఆహారం జీర్ణమైపోగా మిగిలిపోయే ఫ్రీరాడికల్స్ సమస్య తక్కువ కావడం వల్ల ఈ మార్పు చోటు చేసుకుంటున్నట్లు తాము అంచనా వేస్తున్నామని మరిన్ని పరిశోధనలు చేపట్టడం ద్వారా ఫలితాలను నిర్ధారించుకుంటామని చెప్పారు. పరిశోధన వివరాలు హైపర్‌టెన్షన్ మ్యాగజైన్‌లో ప్రచురితమయ్యాయి.
యాంటీ ఆక్సిడెంట్లతో 20 ఏళ్లు వెనక్కు...
Published Thu, Apr 26 2018 1:42 AM | Last Updated on Thu, May 24 2018 3:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment