- జెడ్పీ చైర్‌పర్సన్‌గా లాలం భవాని
- వైస్ చైర్మన్‌గా కొట్యాడ అప్పారావు
- నేడు ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
విశాఖ రూరల్ : రెండేళ్ల తరువాత జిల్లా పరిషత్ పీఠంపై పాలకవర్గం కొలువుతీరనుంది. సుదీర్ఘకాలంగా సాగుతున్న ప్రత్యేకాధికారుల పాలనకు తెరపడనుంది. శనివారం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 39 జెడ్పీటీసీ స్థానాలకు ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి.
ఇందులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ 15 స్థానాల్లో విజయం సాధించగా, టీడీపీ 24 జెడ్పీటీసీలను గెలుచుకొని జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. రాంబిల్లి మండలం నుంచి గెలిచిన లాలం భవాని చైర్‌పర్సన్ అభ్యర్థినిగా ఎన్నికలకు ముందే టీడీపీ ప్రకటించింది. వైస్‌చైర్మన్ అభ్యర్థిగా అనంతగిరి మండలం జెడ్పీటీసీ కొట్యాడ అప్పారావు పేరును ఖరారు చేశారు. దీంతో వీరి ఎన్నిక లాంచనం కానుంది.
ఏర్పాట్లు పూర్తి : చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్ ఎన్నికకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా పరిషత్‌సమావేశ మందిరంలో ఈ ఎన్నిక జరగనుంది. దీనికి హాజరుకావాలంటూ జిల్లా కలెక్టర్, ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి సాల్మన్ ఆరోఖ్యరాజ్ గెలిచిన అభ్యర్థులతో పాటు సంబంధిత ఎమ్మెల్యేలు, ఎంపీలకు నోటీసులు జారీ చేశారు.
శనివారం ఉదయం 10 గంటల లోపు కో-ఆప్షన్ సభ్యులుగా బరిలో ఉండే వారు నామినేషన్లు సమర్పించాలి. వీరు తప్పనిసరిగా మైనా ర్టీ ధ్రువపత్రం సమర్పించాలి. ఉదయం 10 నుంచి 12 వరకు నామినేషన్లు పరిశీలన, మధ్యాహ్నం ఒంటి గంటలోపు నామినేషన్ల ఉప సంహరణకు అవకాశముంటుంది. ఒంటిగంటకు కో-ఆప్షన్ సభ్యుల ప్రమా ణ స్వీకరం జరుగుతుంది.
అనంతరం 3 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో 39 జెడ్పీటీసీ సభ్యులతో సమావేశం జరుగుతుంది. ఒక వరుస మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు, మరో వరుస జెడ్పీటీసీ సభ్యులకు ఏర్పాటు చేశారు. చేతులు ఎత్తే విధానంలో ఈ ఎన్నిక మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది. చైర్‌పర్సన్‌గా ఎన్నికైన అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ైవె స్‌చైర్‌పర్సన్ ఎన్నిక ఉంటుంది. ఈ ఎన్నికలకు పార్టీలు విప్‌ను జారీ చేయనున్నాయి.