దావ వసంత, అరుణ, పుట్ట మధుకర్, సందీప్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో కారు టాప్ గేరులో దూసుకెళ్లింది. అత్యధిక సీట్లు గెలుచుకొని దాదాపు అన్ని మండల ప్రజాపరిషత్(ఎంపీపీ) అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించగా.. జిల్లా పరిషత్‌లోనూ అదే జోరును కొనసాగిస్తోంది. ఈనెల 4న పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడగా.. 32 జిల్లాల్లోనూ జెడ్పీ చైర్మన్ పీఠాలు కైవసం చేసుకునే రీతిలో టీఆర్‌ఎస్ విజయ దుందుభి మోగించింది. రాష్ట్ర వ్యాప్తంగా 538 జెడ్పీటీసీలకు గానూ.. టీఆర్ఎస్ 449 స్థానాలను దక్కించుకుంది. కరీంనగర్, గద్వాల, మహబూబ్‌నగర్, జనగామ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల పరిధిలో టీఆర్‌ఎస్ అన్ని జెడ్పీటీసీ స్థానాలను క్లీన్‌స్వీప్ చేసింది. ఆసిఫాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, వనపర్తి, నారాయణపేట, సిద్దిపేట, మేడ్చల్, ములుగు జిల్లాల్లో కాంగ్రెస్ కేవలం ఒక్కో జెడ్పీటీసీ స్థానంలో మాత్రమే గెలుపొందగా, మిగిలిన స్థానాలన్నీ టీఆర్‌ఎస్ ఖాతాలో చేరాయి.
- నల్గొండ జెడ్పీ చైర్మన్‌గా బండా నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా స్వర్ణ సుధాకర్ రెడ్డి, వైఎస్ చైర్మన్‌గా యాదయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- సిద్దిపేట జడ్పీ చైర్ పర్సన్ గా వేలేటి రోజా శర్మ, వైఎస్ చైర్మన్ గా రాయిరెడ్డి రాజారెడ్డి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
- సంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌గా ముంజు శ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కో-ఆప్షన్ మెంబర్లు గా ముస్తఫా, మహ్మద్ అలీ ఏకగ్రీవం.
- నల్గొండ జడ్పీచైర్మన్ గా బండా నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ గా పాగాల సంపత్ రెడ్డి, వైస్ చైర్ పర్సన్ గా గిరబోయిన భాగ్యలక్ష్మి ఎన్నికైనట్లు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రకటించారు. కోఆప్షన్ సభ్యులు గా టిఆర్ఎస్ కు చెందిన ఎండీ గౌస్ పాష మరియు మదర్ ఏకగ్రీవం ఎన్నికయ్యారు.
జెడ్పీగా ఎన్నికైన పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తి రెడ్డి తదితరులు
- మెదక్ జెడ్పీ ఛైర్ పర్సన్‌గా హేమలత శేఖర్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
- జోగులంబ గద్వాల జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ గా సరితా, వైస్ ఛైర్పర్సన్ గా సరోజమ్మ ను ఏకగ్రీవం
- నాగర్ కర్నూల్ జడ్పీ చైర్మన్ గా పద్మావతి, వైస్ చైర్మన్ గా బాలాజీ సింగ్ ఎన్నికయ్యారు
- రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా కోనారావుపేట జెడ్పీటీసీ న్యాలకొండ అరుణ, వైస్ చైర్మన్ గా ఇల్లంతకుంట జడ్పీటీసీ సిద్దం వేణు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌ను అభినందిస్తున్న ఎమ్మెల్యే రమెష్ బాబు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ - నిజామాబాద్ నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్‌గా దాదన్నగారి విఠల్ రావ్, వైస్ చైర్మన్‌గా రజిత యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావ్ ప్రకటించారు.
- కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా కనుమల్ల విజయ ఇల్లందకుంట, వైస్ చైర్మన్ గా పేరాల గోపాల్ రావు సైదాపూర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కనుమల్ల విజయ - ఆసిఫాబాద్ జడ్పీ చైర్మన్ గా కోవ లక్ష్మీ ,వైస్ చైర్మన్ గా కోనేరు కృష్ణారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- మంచిర్యాల జిల్లా పరిషత్ ఛైర్మెన్ గా నల్లాల బాగ్య లక్ష్మీ, వైస్ చైర్మన్ గా సత్యనారాయణ ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా ఎన్నికల అధికాని భారతి హోళీకెరీ ప్రకటించారు. బాణా సంచా పేల్చుతూ సంబరాలు జరుపుకుంటున్న తెరాస శ్రేణులుఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ గా జనార్దన్ రాథోడ్ ,వైస్ చైర్మన్ గా ఆరె రాజన్న లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా కోవ.లక్ష్మి, జడ్పీ వైస్ చైర్ పర్సన్ గా కోనేరు కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తెరాస శ్రేణుల భారీ ర్యాలీ నిర్వహించారు.
- పెద్దపల్లి జడ్పీ చైర్మన్ గా పుట్ట మధుకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్‌గా తీగల అనితా హరినాథ్ రెడ్డి , వైస్ ఛైర్మన్ గా ఈటె గణేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా సునీత మహేందర్ రెడ్డి. వైస్ చైర్మన్ గా విజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకూ జిల్లా చైర్ పర్సన్ గా సునీతా మహేందర్ రెడ్డి మూడు సార్లు ఎన్నికయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండు సార్లు వికారాబాద్ జిల్లా పరిషత్ మొట్టమొదటి చైర్ పర్సన్ గా సునీత మహేందర్రెడ్డి ఎన్నికయ్యారు.
- సూర్యపేట జడ్పీ చైర్మన్ గా గుజ్జదీపిక యుగేందర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- యాదాద్రి భువనగిరి జడ్పీచైర్మన్ గా ఏలిమినేటి సందీప్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- కామారెడ్డి జడ్పీ చైర్మన్ గా దఫెదార్ శోభ, వైస్ చైర్మన్ గా పరికి ప్రేమ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- ములుగు జడ్పీ చైర్ పర్సన్ కుసుమ జగదీశ్, వైస్ చైర్ పర్సన్ బడే నాగ జ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- పెద్దపల్లి జడ్పీ చైర్మన్ గా పుట్ట మధుకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- వరంగల్ అర్బన్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా మరేపల్లి సుధీర్, వైస్ చైర్మన్ గా శ్రీ రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
- వరంగల్ రురల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా గండ్ర జ్యోతి , వైస్ చైర్మన్ గా ఆకుల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.
-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ గా కోరం కనకయ్య, వైస్ చైర్మన్ గా కంచర్ల చంద్రశేఖర్ ఎన్నికయ్యారు.
-
జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment