సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ జెడ్పీచైర్మన్‌గా దాదన్నగారి విఠల్, వైస్ చైర్మన్‌గా రజిత యాదవ్ శుక్రవారం ప్రమాణం చేశారు. కలెక్టర్ ఎం.ఆర్.ఎం రావు స్వయంగా వీరిద్దరి చేత ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమానికి హాజరైన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..సభను హుందాతనంగా నడిపించాలి. అందరూ పోటి పడీ పనిచేయాలని, అర్థవంతమైన చర్చల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో 24 గంటలు పాటు కరెంటు అమలవడం, ఎకరాకు రూ.ఐదు వేలు ఇవ్వడం చూసి ఇతర రాష్ట్రాల నాయకులు ఆశ్చర్యపోతున్నారు. గ్రామాలలో ఏ సమస్యలు ఉన్నా ప్రజా ప్రతినిధులుగా సభా దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందని పోచారం పేర్కొన్నారు.
'స్థానిక సంస్థలకు మరిన్ని అధికారాలు కట్టబెట్టాలని, దానికి తగ్గట్టే నిధులను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నార'ని రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఎస్సారెస్సీ పునరుజ్జీవం ద్వారా త్వరలోనే జిల్లా రైతులకు సాగు, తాగు నీరు అందుతుందని ఆయన స్పష్టం చేశారు. 'నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ప్రజల సమస్యలు తీర్చేందుకు అందరం కలిసికట్టుగా పని చేస్తామని' నూతన జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ తెలిపారు.కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీలు విజి గౌడ్, ఆకుల లలిత తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment