హైదరాబాద్: ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ కు తృటిలో ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జెడ్పీ చైర్ పర్సన్ శోభరాణి గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న ఇన్నోవాను డీసీఎం వ్యాను ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ఉన్న జెడ్పీ చైర్మన్ శోభారాణితో పాటు ఆమె భర్త సత్యనారాయణ గౌడ్ కు స్వల్పగాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆదిలాబాద్ జెడ్పీచైర్మన్ కు తప్పిన ప్రమాదం
Published Tue, Jan 13 2015 1:35 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement