
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవలి ఐపీఎస్‌ల బదిలీల్లో జరిగిన ఓ పరిణామం తాజాగా వెలుగులోకి వచ్చింది. రోడ్ సేఫ్టీ, రైల్వే డీజీగా పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ కృష్ణప్రసాద్‌ను రోడ్ సేఫ్టీ అథారిటీ డీజీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. రాష్ట్రంలో ఈ పోస్టు ఇప్పటివరకు లేదని సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) అధికారులు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ పోస్టు ఉండేదని, అది కూడా ఏపీకి అలాట్ అయ్యిందన్నారు. లేని పోస్టులోకి సీనియర్ అధికారిని నియమించడంపై ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జీఏడీ కింద పనిచేసే దీనికి ఉమ్మడి రాష్ట్రంలో సచివాలయంలోనే కార్యాలయం ఉండేది.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో ఈ పోస్టు, ఆఫీస్ లేకపోవడంతో డీజీ కృష్ణప్రసాద్ తన పాత చాంబర్‌లోనే కొనసాగుతున్నారు. మరోవైపు కృష్ణప్రసాద్ స్థానంలో అదనపు డీజీపీ సందీప్ శాండిల్యను ప్రభుత్వం నియమించింది. అయితే కృష్ణప్రసాద్‌కు పోస్టు, ఆఫీస్ కేటాయిస్తేగానీ సందీప్ శాండిల్య జాయిన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment