IPS transferred
-
ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. ఏకంగా 37 మందిని వివిధ జిల్లాలకు, విభాగాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం సాయంత్రం ఉత్వర్వులు జారీ చేసింది. ఇందులో.. బదిలీ అయిన ఐపీఎస్‌ల వివరాలుశ్రీకాకుళం ఎస్పీగా కె వి మహేశ్వర రెడ్డివిజయనగరం ఎస్పీగా వకుల్ జిందాల్అనకాపల్లి ఎస్పీగా ఎం దీపికసత్యసాయి జిల్లా ఎస్పీగా వి రత్నపార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా మాధవరెడ్డికాకినాడ ఎస్పీగా విక్రాంత్ పాటిల్గుంటూరు ఎస్పీగా ఎస్ సతీష్ కుమార్బాపట్ల ఎస్పీగా తుషార్ దూబిఅల్లూరి జిల్లా ఎస్పీగా అమిత్ బర్దర్విశాఖ సిటీ డీసీపీ గా తుహిన్ సిన్హాతూర్పుగోదావరి ఎస్పీగా నరసింహ కిశోరెఅన్నమయ్య జిల్లా ఎస్పీగా విద్యా సాగర్ నాయుడుకోనసీమ జిల్లా ఎస్పీగా బి కృష్ణా రావుకృష్ణా ఎస్పీగా గంగాధర్ రావుపశ్చిమగోదావరి ఎస్పీగా అద్నాన్ నాయిమ్ అస్మివిశాఖపట్నం డీసీపీ గా అజిత వెజెండ్లఏలూరు ఎస్పీగా ప్రతాప్ శివ కిషోర్పల్నాడు ఎస్పీగా కె శ్రీనివాసరావుప్రకాశం ఎస్పీగా ఆ ఆర్ దామోదర్విజయనగరం చింతవలస 5 వ బెటాలియన్ కమాండెంట్ గా మల్లికా గార్గ్కర్నూల్ ఎస్పీగా జి బిందు మాధవ్నెల్లూరు ఎస్పీగా కృష్ణ కాంత్నంద్యాల ఎస్పీగా అధిరాజ్ సింగ్ రాణావై ఎస్సార్ కడప ఎస్పీగా హర్షవర్ధన్ రాజుఅనంతపురం ఎస్పీగా కె వి మురళి కృష్ణఎన్టీఆర్ కమిషనరేట్(విజయవాడ) డీసీపీ గా గౌతమి సాలితిరుపతి ఎస్పీగా ఎల్ సుబ్బారాయుడుఇంటెలిజెన్స్ ఎస్పీగా వి గీతా దేవిబదిలీ అయిన ఐపీఎస్‌లను హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం తన జీవోలో ఆదేశించింది. అలాగే.. ఐపీఎస్‌లు జీఆర్ రాధిక, మేరీ ప్రశాంతి, ఆరిఫ్ హఫీజ్, కె రఘువీరా రెడ్డి, సిద్దార్థ్ కౌశల్, సుమిత్ సునీల్, పి జగదీష్, ఎస్ శ్రీధర్, ఎం సత్తిబాబులను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చెయ్యాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.బదిలీ ఐపీఎస్‌ల జీవో కోసం క్లిక్ చేయండి -
కూతురి నిర్వాకం.. ఐపీఎస్ ట్రాన్స్ఫర్!
తిరువనంతపురం : తమ ఇంటి వద్ద కాపలాగా పనిచేస్తోన్న పోలీసుపై కేరళ అదనపు డీజీపీ సుదేశ్ కుమార్ కూతురు ఈ నెల 14న దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేరళ ప్రభుత్వం సుదేశ్ కుమార్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలిలా... గురువారం ఉదయం సుదేష్ కుమార్ భార్యాబిడ్డలు వాకింగ్‌కు వెళ్లారు. వారిని తిరిగి ఇంటికి తీసుకెళ్లేందుకు డ్రైవర్ గవాస్కర్ కాస్త ఆలస్యంగా రావడంతో ఐపీఎస్ కూతురు అతన్ని బూతులు తిట్టారు. ఆలస్యానికి గల కారణాన్ని చెప్తున్నా వినకుండా ఆమె నానా రభస చేయడంతో.. గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. అనవసరంగా నోరుపారేసుకోవద్దని కోరాడు. దాంతో కోపంతో ఊగిపోయిన ఆ యువతి అతన్ని దాడికి దిగారు. మొబైల్ ఫోన్‌తో అతడి మెడపై బాది గాయం చేశారు. ఈ విషయమై డ్రైవర్ గవాస్కర్ భార్య కేరళ సీఎం పినరయి విజయన్ను కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సుదేశ్ కుమార్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గవాస్కర్ వైద్యం కోసం కేరళ డీజీపీ 50 వేల రూపాయలు అందించారు. సుదేశ్ కుమార్ కూతురుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. కాగా గవాస్కర్ ఘటన తర్వాత కేరళలోని పోలీసు ఉన్నతాధికారుల నివాసాల వద్ద బాధ్యతలు నిర్వహిస్తున్న అనేక మంది కింది స్థాయి సిబ్బంది తమ గోడు వెళ్లగక్కుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో వాళ్ల ఇద్ద చాకిరీ చేయించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కనీస గౌరవం లేకుండా మాట్లాడుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతుండడం వాస్తవమేనన్న డీజీపీ.. కింది స్థాయి ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. -
లేని పోస్టులోకి సీనియర్ ఐపీఎస్ బదిలీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవలి ఐపీఎస్‌ల బదిలీల్లో జరిగిన ఓ పరిణామం తాజాగా వెలుగులోకి వచ్చింది. రోడ్ సేఫ్టీ, రైల్వే డీజీగా పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ కృష్ణప్రసాద్‌ను రోడ్ సేఫ్టీ అథారిటీ డీజీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. రాష్ట్రంలో ఈ పోస్టు ఇప్పటివరకు లేదని సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) అధికారులు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ పోస్టు ఉండేదని, అది కూడా ఏపీకి అలాట్ అయ్యిందన్నారు. లేని పోస్టులోకి సీనియర్ అధికారిని నియమించడంపై ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జీఏడీ కింద పనిచేసే దీనికి ఉమ్మడి రాష్ట్రంలో సచివాలయంలోనే కార్యాలయం ఉండేది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో ఈ పోస్టు, ఆఫీస్ లేకపోవడంతో డీజీ కృష్ణప్రసాద్ తన పాత చాంబర్లోనే కొనసాగుతున్నారు. మరోవైపు కృష్ణప్రసాద్ స్థానంలో అదనపు డీజీపీ సందీప్ శాండిల్యను ప్రభుత్వం నియమించింది. అయితే కృష్ణప్రసాద్‌కు పోస్టు, ఆఫీస్ కేటాయిస్తేగానీ సందీప్ శాండిల్య జాయిన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. -
ఈస్ట్, వెస్ట్‌లకు కొత్త కమిషనర్లు
సైబరాబాద్ వెస్ట్ సీపీగా నవీన్‌చంద్, ఈస్ట్ సీపీగా భగవత్ - రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మంది ఐపీఎస్‌ల బదిలీ - వ్యక్తిగత సెలవుల్లో సీవీ ఆనంద్.. పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన సైబరాబాద్ ఈస్ట్, సైబరాబాద్ వెస్ట్ కమిషనరేట్లను దృష్టిలో పెట్టుకొని తాజా మార్పులు చేసింది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు సీఎస్ రాజీవ్‌శర్మ సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్ ఐపీఎస్‌లు వి.నవీన్‌చంద్‌ను సైబరాబాద్ వెస్ట్ కమిషనర్‌గా, మహేశ్ మురళీధర్ భగవత్‌ను సైబరాబాద్ ఈస్ట్ కమిషనర్‌గా నియమించారు. ప్రస్తుతం నవీన్‌చంద్ వెయిటింగ్లో ఉండగా.. భగవత్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఐజీగా ఉన్నారు. ఇప్పటి వరకు సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్ వ్యక్తిగత సెలవుపై విదేశాలకు వెళ్లనుండటంతో ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. మరోవైపు ప్రస్తుతం గ్రేహౌండ్స్ డీఐజీగా ఉన్న స్టీఫెన్ రవీంద్రను సైబరాబాద్ వెస్ట్ జాయింట్ కమిషనర్‌గా.. ప్రస్తుతం సైబరాబాద్ జాయింట్ సీపీగా పని చేస్తున్న టి.వి.శశిధర్‌రెడ్డి సైబరాబాద్ ఈస్ట్ జాయింట్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో శాంతి భద్రతల విభాగం పర్యవేక్షిస్తున్న ఐజీ ఎంకే సింగ్‌ను పోలీసు అకాడమీ అడిషనల్ డెరైక్టర్‌గా, డి.కల్పనా నాయక్‌ను డీజీపీ కార్యాలయంలో శాంతిభద్రతల విభాగం డీఐజీగా, సీనియర్ అధికారి వీవీ శ్రీనివాసరావును హైదరాబాద్ సిటీ పోలీసు అదనపు కమిషనర్‌గా బదిలీ చేశారు. గతంలో ఈ పోస్టుకు సందీప్ శాండిల్యను నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. ఆయన ప్రస్తుత స్థానంలోనే ఉంటారు. కొత్త పేరు పెడదాం: సీఎం కేసీఆర్ ఈస్ట్, వెస్ట్‌లు వద్దని.. సైబరాబాద్ ఈస్ట్‌కు కొత్త పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. తనను కలసిన పోలీసు ఉన్నతాధికారులతో అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. రాష్ట్ర రాజధాని కేంద్రంగా ఏర్పాటు చేసిన మూడు కమిషనరేట్లలో హైదరాబాద్, సైబరాబాద్ పేర్లను యథాతథంగా ఉంచి, కొత్తగా ఏర్పడ్డ సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్ పేరును మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సంస్కృతి చాటేలా కొత్త పేరు ఉండేలా ఆలోచన చేయాలని సూచించారు.