sandeep shandalya
-
లేని పోస్టులోకి సీనియర్ ఐపీఎస్ బదిలీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవలి ఐపీఎస్‌ల బదిలీల్లో జరిగిన ఓ పరిణామం తాజాగా వెలుగులోకి వచ్చింది. రోడ్ సేఫ్టీ, రైల్వే డీజీగా పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ కృష్ణప్రసాద్‌ను రోడ్ సేఫ్టీ అథారిటీ డీజీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. రాష్ట్రంలో ఈ పోస్టు ఇప్పటివరకు లేదని సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) అధికారులు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ పోస్టు ఉండేదని, అది కూడా ఏపీకి అలాట్ అయ్యిందన్నారు. లేని పోస్టులోకి సీనియర్ అధికారిని నియమించడంపై ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జీఏడీ కింద పనిచేసే దీనికి ఉమ్మడి రాష్ట్రంలో సచివాలయంలోనే కార్యాలయం ఉండేది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో ఈ పోస్టు, ఆఫీస్ లేకపోవడంతో డీజీ కృష్ణప్రసాద్ తన పాత చాంబర్లోనే కొనసాగుతున్నారు. మరోవైపు కృష్ణప్రసాద్ స్థానంలో అదనపు డీజీపీ సందీప్ శాండిల్యను ప్రభుత్వం నియమించింది. అయితే కృష్ణప్రసాద్‌కు పోస్టు, ఆఫీస్ కేటాయిస్తేగానీ సందీప్ శాండిల్య జాయిన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. -
సైబర్ నేరాలపై అవగాహన
సాక్షి, హైదరాబాద్: మారుతున్న కాలానికనుగుణంగా పెరుగుతున్న సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు అందరిలో అవగాహన కలిగించేందుకు హైదరాబాద్ లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ)లో ఈ నెల 23న ‘సైబర్ సెక్యూరిటీ కాన్క్లేవ్ 3.0’ను సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) నిర్వహిస్తోంది. మంగళవారం ఈ వివరాలను సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ సందీప్ శాండిల్య.. ఎస్సీఎస్సీ కార్యదర్శి భరణికుమార్‌తో కలసి మీడియాకు వెల్లడించారు. ఐటీ కంపెనీలే కాకుండా ఫార్మా, బ్యాంకింగ్, ఫైనాన్సియల్, హెల్త్ కేర్, రవాణా, ఆతిథ్య రంగాలకు చెందిన ప్రముఖులు ప్రసంగిస్తారన్నారు. ఆధునిక కాలంలో వేగంగా పెరుగుతున్న టెక్నాలజీతో పాటు సైబర్ నేరాలు అదేస్థాయిలో పెరిగా యని అభిప్రాయపడ్డారు. ట్రోజన్లు, ర్యాన్ సమ్ వేర్లు, మాల్వేర్స్, బగ్స్ సాఫ్ట్వేర్ కంపెనీలకు పెను ముప్పుగా మారి సవాల్ విసురుతున్నాయన్నారు. 23న జరగనున్న ‘సైబర్ సెక్యూరిటీ కాన్ క్లేవ్ 3.0’లో వివిధ సంస్థలకు చెందిన ప్రముఖులు, ఇంగ్లండ్, అమెరికా, ఇజ్రాయెల్, మిడిల్ ఈస్ట్ నుంచి దాదాపు 350 మంది డెలిగేట్స్ పాల్గొంటారన్నారు. సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన డెమో వీడియోలను చూపిస్తామన్నారు. కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు www.cyberrecurity.org వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. సైబరాబాద్ జాయింట్ కమిషనర్ షానవాజ్ ఖాసీం మాట్లాడుతూ.. అంతర్జాలంలో డార్క్ నెట్లో డ్రగ్స్, వెపన్స్, ఇతర అసాంఘిక కార్యకలాపాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఐటీ సంస్థలు ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ కావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్సీఎస్సీ సైబర్ సెక్యూరిటీ ఫోరం లీడర్ శ్రీకాంత్ శ్రీనివాసన్, ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ మోహన్ పాల్గొన్నారు. -
నూతన పోలీసు కమిషనర్‌గా సందీప్ శాండిల్య
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ నూతన పోలీసు కమిషనర్‌గా సందీప్ శాండిల్య గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో శనివారం రాత్రి 7 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సందీప్ శాండిల్య మాట్లాడుతూ... శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఎఫెక్టివ్ పోలీసింగ్‌తో ప్రజలకు మరింత చేరువవుతామని తెలి పారు. నేరగాళ్లను వదలబోమని హెచ్చరించారు. శంషాబాద్, మాదాపూర్, బాలానగర్ జోన్లలో కేసులు, పాలనాపరమైన అంశాలపై పూర్తి దృష్టి సారిస్తానని తెలిపారు.