తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న నాయకులు
పాన్‌గల్: ఎన్నికల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీల అమలు చేయడంలో విఫలమయ్యాయని, ఇందుకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కళావతమ్మ, శ్రీరామ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం, జీఎస్టీ విధించడం, పెద్దనోట్లు రద్దు వంటి వాటితో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూపంపిణీ, కేజీ టూ పీజీ ఉచిత విద్య, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు తదితర హామీలు నెరవేర్చలేదన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగానే ఈ ధర్నాలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిప్రతాన్ని తహసీల్దార్ అలెగ్జాండర్‌కు అందజేశారు. నాయకులు గోపాల్, శివకుమార్, రమణ, పెంటయ్య, నరసింహ్మ, బాలపీరు, కుర్మయ్య, తిరుపతయ్య, చెన్నమ్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment