
పైపులను తీస్తున్న పొక్లెయిన్
ఇల్లందకుంట (హుజూరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకం పనులు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇష్టారాజ్యంగా మారాయి. ఇప్పటి వరకు పట్టణంలో పనులు 60 శాతం కంటే ఎక్కువగా పూర్తి కాలేదు. దీనికి తోడు ఉన్న నిధులు పూర్తికావడంతో సదరు కాంట్రాక్టర్ పనులు చేయకుండా వదిలివేశారు.
ఇదిలా ఉండగా పాత వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఆరు నెలల క్రితం పైపులు వేశారు. శనివారం వేరేచోట పైపులు తక్కువగా ఉన్నాయని ప్రొక్లెయిన్‌తో తీసివేశారు. దాదాపు 300 మీటర్లకుపైగా ఉన్న 30 పైపులను తీసివేశారు. ఆ మార్గంలో ఉన్న కాలనీవాసులు గతంలో వేసుకున్న మంచినీటి పైపులు, డ్రైనేజీ పైపులు ధ్వంసం కావడంతో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment