బెంగాల్ న్యాయవ్యవస్థనే శంకిస్తారా
సీబీఐకి సుప్రీంకోర్టు ఆక్షింతలు
న్యూఢిల్లీ: బెంగాల్ న్యాయవ్యవస్థ మీద అపవాదులు మోపడం సరికాదంటూ సుప్రీంకోర్టు శుక్రవారం సీబీఐని మందలించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల అనంతర హింస కేసులను బెంగాల్ బయటికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టును సీబీఐ గత డిసెంబరులో కోరింది. ‘‘లేదంటే సాక్షులను భయపెట్టే అవకాశముంది. బెంగాల్ కోర్టులలో శత్రుత్వభావంతో కూడిన వాతావరణం నెలకొంది’’ అని పేర్కొంది. దీనిపై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘‘కేసుల బదిలీకి ఇదేం ప్రాతిపదిక? మొత్తం న్యాయవ్యవస్థపైనే అపవాదు వేస్తారా? బెంగాల్ కోర్టులన్నింటిలోనూ విరో«ధభావం నెలకొందన్నట్లుగా చూపుతున్నారు. ఒక రాష్ట్రంలోని న్యాయమూర్తులను సీబీఐ అధికారులు ఇష్టపడనంత మాత్రాన మొత్తం న్యాయవ్యవస్థే పనిచేయడం లేదనకండి.
జిల్లా జడ్జిలు, సివిల్ జడ్జిలు, సెషన్స్ జడ్జిలు తమను తాము సమరి్థంచుకోవడానికి సుప్రీంకోర్టు దాకా రాలేరు’’ అని సీబీఐ తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజును ఉద్దేశించి పేర్కొంది. పిటిషన్‌లో వాడిన పదజాలాన్ని ఆయన సమరి్థంచుకోనే ప్రయత్నం చేశారు. కోర్టులపై అపవాదు వేసే ఉద్దేశం తమకు లేదని పేర్కొంటూ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment