శారదా స్కామ్ లో మమతాను విచారించాలి: అమిత్
శారదా స్కామ్ లో మమతాను విచారించాలి: అమిత్
Published Sun, Sep 7 2014 5:45 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్, ఆపార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిప్పులు చెరిగారు. శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. బీజేపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టాక కోల్ కతాలో నిర్వహించిన తొలి సభలో అమిత్ షా మాట్లాడుతూ...మమతా బెనర్జీ ప్రభుత్వం వైఫల్యాలపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. మమతా పాలనలో పశ్చిమ బెంగాల్ సమస్యల్లో కూరుకుపోయింది.
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబాటుదారులు ఎక్కువై పోయారు అని అమిత్ అన్నారు. నందిగ్రామ్, సింగూర్ లో భూములు కోల్పోయిన రైతుల కోసం దీక్ష చేపట్టిన మమతా.. శారద కుంభకోణంలో 17 లక్షల మంది రోడ్డున బాధితుల కోసం ఆమె ఎందుకు దీక్ష చేపట్టడం లేదని ఆయన విమర్శించారు. ఈ కుంభకోణంలో సన్నిహితులే ఉండటం కారణంగా మమతా మౌనం వహిస్తోందని అమిత్ షా ఆరోపించారు.
తృణమూల్ పార్టీ నుంచి బహిషృతుడైన ఎంపీ కునాల్ ఘోష్ ను తిరిగి కస్టడీలోకి తీసుకున్న నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శారదా మీడియా ద్వారా లబ్ది పొందిన మమతా బెనర్జీని, ఈ కుంభకోణంలో కీలక పాత్రధారి సుదీప్తా సేన్ ను కూడా ఈ కేసులో విచారించాలని అమిత్ షా డిమాండ్ చేశారు. కునాల్ ఘోష్ నేతృత్వంలోనే శారదా మీడియా నడుస్తోంది.
Advertisement
Advertisement