టీఎంసీ కార్యాలయంలో కాల్పులు | Unidentified gunmen open fire inside Trinamool Congress office in Kharagpur | Sakshi
Sakshi News home page

టీఎంసీ కార్యాలయంలో కాల్పులు

Published Wed, Jan 11 2017 5:29 PM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM

టీఎంసీ కార్యాలయంలో కాల్పులు

టీఎంసీ కార్యాలయంలో కాల్పులు

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా మరో ముగ్గురు గాయపడినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌ పూర్‌లోగల టీఎంసీ కార్యాలయంలో గుర్తు తెలియని సాయుధులు ఈ కాల్పులకు తెగబడినట్లు సమాచారం. నిందితులను గుర్తించాల్సి ఉంది.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి, బీజేపీకి మధ్య తీవ్ర స్థాయిలో బెంగాల్‌లో కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఇరు వర్గాలపై పరస్పరం దాడులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో బీజేపీ నేత ఇంటిపై టీఎంసీకి చెందిన వ్యక్తులు బాంబు దాడులకు దిగడంతోపాటు పరస్పర ఘర్షణలకు దిగి గాయపరుచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా టీఎంసీ కార్యాలయంలో కాల్పులు జరగడం కలకలాన్ని రేపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement