gunmen open fire
-
డ్రగ్స్ ముఠా కాల్పులు.. మేయర్ సహా 18 మంది మృతి
మెక్సికో సిటీ: మెక్సికోలో మరోసారి తుపాకీ మోతలతో అట్టుడికింది. శాన్ మిగ్యుల్ టోటోలాపాన్ పట్టణంలోని సిటీ హాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో మొత్తం 18 మంది మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో పట్టణ మేయర్ కాన్రాడో మెండోజా, ఆయన తండ్రి జువాన్ కూడా ఉన్నారని స్థానిక మీడియాలు తెలిపాయి. కాల్పుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మేయర్ హత్య కోసమే.. కాల్పులకు పాల్పడి దుండగులు ‘లాస్ టెకిలెరోస్’ డ్రగ్స్ ముఠాకు చెందినవారిగా అధికారులు భావిస్తున్నారు. మేయర్‌ను హతమార్చాలనే లక్ష్యంతోనే వారు భవనం లోపలికి ప్రవేశించి, ముందస్తు ప్రణాళిక ప్రకారం వరుస దాడులు చేసినట్లు పేర్కొన్నారు. భద్రతా బలగాలు నగరంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకుగానూ అంతకుముందే భారీ వాహనాలతో రహదారులను బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. మేయర్ మృతిపై గెరెరో గవర్నర్ ఎవెలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పీఆర్డీ పార్టీ సైతం ఈ ఘటనను ఖండించింది. పిరికిపంద చర్యగా అభివర్ణించింది. మరోవైపు.. నిందితులను పట్టుకునేందుకు మెక్సికో ప్రభుత్వం సైన్యాన్ని దించింది. ఇదీ చదవండి: రష్యాకు షాక్.. విలీన ప్రాంతాలను తిరిగి చేజిక్కించుకుంటున్న ఉక్రెయిన్! -
షాకింగ్ : కోచ్‌లు, మహిళా రెజ్లర్ల దారుణ హత్య
సాక్షి, చండీగఢ్ : హరియాణాలో దారుణం చోటు చేసుకుంది. రోహ్తక్లో రెజ్లింగ్ అకాడెమీలో దుండగులు మారణహోమం సృష్టించారు. సాయుధులైన కొంతమంది కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు రెజర్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఇద్దరు కోచ్‌లు కాగా, మరో ఇద్దరు మహిళా రెజ్లర్లు ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, రెజ్లింగ్ కోచ్‌ల మధ్య వ్యక్తిగత శత్రుత్వమే కాల్పులకు దారితీసినట్టు తెలుస్తోంది. బరోడా గ్రామానికి చెందిన రెజ్లింగ్ కోచ్ సుఖ్వీందర్, మరికొందరు ఈ కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసు నమోదు చేసి, వివరాలను పరిశీలిస్తున్నామని పోలీసుల అధికారులు వెల్లడించారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన రోహతక్ ఎస్పీ రాహుల్ శర్మ మాట్లాడుతూ (మనోజ్, సాక్షి) దంపతుల మూడేళ్ల కుమారుడికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయని తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామనీ, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. మృతులు ఐదుగురిలో కోచ్ దంపతులు సోనిపట్ లోని సరగ్తాలా గ్రామానికి చెందిన మనోజ్ కుమార్, అతని భార్య సాక్షి, ఉత్తరప్రదేశ్ కు చెందిన రెజ్లింగ్ కోచ్ సతీష్ కుమార్, మహిళా రెజ్లర్పూ జా, ప్రదీప్ మాలిక్‌గా గుర్తించారు. 5 people have died & 3 hospitalised. Main accused, a wrestling coach named Sukhwinder, was terminated by one of the deceased after a complaint. Prima facie, anger seems to be the motive. Postmortem & probe underway. Accused carries Rs 1 lakh bounty on him: Rahul Sharma, SP Rohtak https://t.co/wE3cAu1hH8 pic.twitter.com/IzOHAUDVO3 — ANI (@ANI) February 13, 2021 -
టీఎంసీ కార్యాలయంలో కాల్పులు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా మరో ముగ్గురు గాయపడినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్ పూర్‌లోగల టీఎంసీ కార్యాలయంలో గుర్తు తెలియని సాయుధులు ఈ కాల్పులకు తెగబడినట్లు సమాచారం. నిందితులను గుర్తించాల్సి ఉంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి మధ్య తీవ్ర స్థాయిలో బెంగాల్లో కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఇరు వర్గాలపై పరస్పరం దాడులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో బీజేపీ నేత ఇంటిపై టీఎంసీకి చెందిన వ్యక్తులు బాంబు దాడులకు దిగడంతోపాటు పరస్పర ఘర్షణలకు దిగి గాయపరుచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా టీఎంసీ కార్యాలయంలో కాల్పులు జరగడం కలకలాన్ని రేపుతోంది.