షాకింగ్ ‌: కోచ్‌లు, మహిళా రెజ్లర్ల దారుణ హత్య | Women wrestlers and coach killed in firing at Rohtka wrestling akhara | Sakshi
Sakshi News home page

షాకింగ్ ‌: కోచ్‌లు, మహిళా రెజ్లర్ల దారుణ హత్య

Published Sat, Feb 13 2021 12:59 PM | Last Updated on Sat, Feb 13 2021 1:44 PM

Women wrestlers and coach killed in firing at Rohtka wrestling akhara - Sakshi

సాక్షి, చండీగఢ్‌ : హరియాణాలో దారుణం చోటు చేసుకుంది. రోహ్‌తక్‌లో రెజ్లింగ్ అకాడెమీలో దుండగులు మారణహోమం సృష్టించారు.  సాయుధులైన కొంతమంది కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు రెజర్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఇద్దరు కోచ్‌లు కాగా, మరో ఇద్దరు మహిళా రెజ్లర్లు ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. 

తాజా సమాచారం ప్రకారం, రెజ్లింగ్ కోచ్‌ల మధ్య వ్యక్తిగత శత్రుత్వమే కాల్పులకు దారితీసినట్టు తెలుస్తోంది. బరోడా గ్రామానికి చెందిన రెజ్లింగ్ కోచ్ సుఖ్వీందర్, మరికొందరు ఈ కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసు నమోదు చేసి, వివరాలను పరిశీలిస్తున్నామని పోలీసుల అధికారులు వెల్లడించారు.  సంఘటన స్థలాన్ని సందర్శించిన రోహతక్‌ ఎస్పీ రాహుల్ శర్మ మాట్లాడుతూ (మనోజ్, సాక్షి) దంపతుల మూడేళ్ల కుమారుడికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయని తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తు‍న్నామని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామనీ, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.  మృతులు ఐదుగురిలో  కోచ్‌ దంపతులు సోనిపట్ లోని సరగ్తాలా గ్రామానికి చెందిన మనోజ్ కుమార్, అతని భార్య సాక్షి, ఉత్తరప్రదేశ్ కు చెందిన రెజ్లింగ్ కోచ్ సతీష్ కుమార్, మహిళా రెజ్లర్పూ ‌జా,  ప్రదీప్ మాలిక్‌గా గుర్తించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement