
ర్యాలీ చూస్తుంటే.. ఇంతలోనే బుల్లెట్ దిగింది..!
టీఎంసీ నేత హమిదుల్ రహమాన్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించనందుకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
టీఎంసీ నేత హమిదుల్ రహమాన్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించనందుకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఏం జరిగిందో తెలియదు, ఇంటి ముందు నిల్చుని ర్యాలీ చూస్తున్న 13 ఏళ్ల బాలుడికి బుల్లెట్ దిగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చోప్రా అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా హమిదుల్ రహమాన్ ఎన్నికయ్యారు. ఇస్లాంపుర ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా కొందరు వ్యక్తులు తుపాకీ మోత మోగించారు.
దాదాపు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంటి ముందు నిల్చుని ర్యాలీ చూస్తున్న గర్ అలీకి బుల్లెట్ తగిలింది. ఇక అంతే ఆ బాలుడి తల్లిదండ్రులు ఉరుకులు పరుగులు పెట్టారు. అలీని ఇస్లాంపూర్ సబ్ డివిజన్ హాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ కు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. ఆ బాలుడికి బుల్లెట్ దిగిన విషయం నిజమే, అయితే ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.