
ప్రతీకాత్మక చిత్రం
కోల్‌కత : తృణమూల్ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. హుగ్లీ జిల్లా నకుందాలో నివాసముండే లాల్‌చంద్ బాగ్ (40) మార్కెట్‌కు వెళ్లి వస్తుండగా మాటువేసిన దుండగులు దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన లాల్‌చంద్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. లాల్‌చంద్ తండ్రి ఫిర్యాదు మేరకు 27 మందిపై కేసు నమోదు చేశామని, ఆరుగురిని అరెస్టు చేశామని ఎస్పీ తథాగత బసు తెలిపారు. మిగతా వారికోసం గాలింపు ముమ్మరం చేశామని వెల్లడించారు. కాగా, ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యనని బీజేపీ ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ర్యాలిలో పాల్గొన్నందుకే తమ కార్యకర్తను అతి దారుణంగా కొట్టి చంపారని టీఎంసీ జిల్లా నాయకుడు దిలీప్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment