టీఎంసీ ఎంపీకి షాక్‌.. రూ. 50 ల‌క్ష‌లు చెల్లించాల‌ని ఢిల్లీ హైకోర్టు ఆదేశం | Trinamool's Saket Gokhale Told To Pay Rs 50 Lakh Damages In Defamation Case | Sakshi
Sakshi News home page

టీఎంసీ ఎంపీకి షాక్‌.. పరువు న‌ష్టం కేసులో 50 ల‌క్ష‌లు చెల్లించాల‌ని ఢిల్లీ హైకోర్టు ఆదేశం

Published Mon, Jul 1 2024 5:52 PM | Last Updated on Mon, Jul 1 2024 6:03 PM

Trinamool's Saket Gokhale Told To Pay Rs 50 Lakh Damages In Defamation Case

న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత, రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలేకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. మాజీ దౌత్యవేత్త లక్ష్మీ పురి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సాకేత్‌ను  ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. 

లక్ష్మీ పురికి క్షమాపణలు చెప్పాలని పేర్కొంది. క్షమాపణలను ప్రముఖ జాతీయ వార్తాపత్రికలో ప్రచురించాలని, ఆరు నెలల పాటు సోషల్‌ మీడియాలో కూడా ఉంచాలని సూచించింది. ఎనిమిది వారాల్లోగా ఈ ఉత్తర్వును పాటించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

కాగా, 2021 జూన్‌ 13, 26న సాకేత్ గోఖలే వివాదస్పద ట్వీట్లు పోస్ట్‌ చేశారు. మాజీ దౌత్యవేత్త లక్ష్మీ పురి తన ఆదాయానికి మించి స్విట్జర్లాండ్‌లో ఆస్తిని కొనుగోలు చేశారని ఆరోపించారు. ఆమె భర్త, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి గురించి కూడా ఆ ట్వీట్లలో ప్రస్తావించారు.

ఈ నేపథ్యంలో అదే ఏడాది లక్ష్మీ పురి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. టీఎంసీ ఎంపీ సాకేత్‌ గోఖలేపై పరువునష్టం దావా వేశారు. ఇరువర్గాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు సోమవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement