ప్లేటు ఫిరాయించిన బీజేపీ
డార్జిలింగ్: ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం డిమాండ్‌కు గత దశాబ్దం కాలంగా మద్దతిస్తూ వస్తున్న భారతీయ జనతా పార్టీ హఠాత్తుగా నేడు తన పంథాను ఎందుకు మార్చుకుంది? సీపీఎం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గూర్ఖాలాండ్ రాష్ట్రం కావలంటూ గొడవ చేసిన బీజేపీ ఎందుకు మౌనం వహించిందీ? గూర్ఖాలాండ్‌కు మద్దతిస్తూ డార్జిలింగ్ నుంచి గత రెండు పర్యాయాలు బీజేపీ ఎమ్మెల్యే గెలిచిన విషయాన్ని కూడా ఎందుకు విస్మరిస్తోంది?
నేడు కేంద్రంలో బీజేపీయే అధికారంలో ఉంది. గూర్ఖాలాండ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలంటే చేతిలోని పనే. అయినా ప్రత్యేక రాష్ట్రం కోసం గూర్ఖాలాండ్ ప్రజలు విధ్వంసం సష్టిస్తున్నా కదలిక లేదు. పైగా ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రాన్ని కోరేది లేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గియా మంగళవారం స్పష్టం చేశారు. అందుకు గూర్ఖాలాండ్ మీదుగా చొరబాటుదారులు వస్తారని చైనా బూచీని చూపెడుతున్నారు. ఓ రాష్ట్రంకన్నా జాతీయ సమగ్రతే ముఖ్యమంటూ కొంత పాట వినిపిస్తున్నారు. ఈ చైనా బూచీ ఇంతకు ముందు లేదా? ఎందుకు ఇప్పుడు కొత్తగా వచ్చింది? ఇదంతా రాజకీయం కాదా?
పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ ఐక్య బెంగాల్ పేరిట మరింత బలపడేందుకు కషి చేస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రమంతటా ఒకే భాష ఉండాలనే ఉత్తర్వులతో నేపాలీ మాట్లాడే గూర్ఖాలాండ్ ప్రజలను రెచ్చగొట్టారు. తనమూల్ కాంగ్రెస్ పునాదులను పెకిలించి తన పార్టీని బలోపేతం చేసుకోవాలని గత కొంతకాలంటా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ దశలో గూర్ఖాలాండ్ డిమాండ్‌ను అంగీకరించినట్లయితే మిగతా పశ్చిమ బెంగాల్ ప్రజలను మొత్తం శత్రువులను చేసుకోవాల్సి వస్తుందన్న భయం. గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటవడం వల్ల బీజేపీకి రాజకీయంగా కూడా ఒరిగేదేమీ లేదు. మహా అంటే గూర్ఖాలాండ్‌కు ఒక్క ఎంపీ సీటు లభిస్తుంది. అది కూడా పార్టీకి దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. ‘గూర్ఖా జనముక్తి మోర్చా’ లాంటి పార్టీలే తన్నుకు పోతాయ్. బెంగాల్లోని 42 ఎంపీ సీట్లపై దష్టి పెట్టడమే మంచిదన్న దూరదష్టితో ఆలోచించి ప్లేటు ఫిరాయించింది.