Gorkhaland state
-
గూర్ఖాల్యాండ్ డిమాండ్‌ను వదిలిన మోర్చా
డార్జిలింగ్/కోల్‌కతా: ప్రత్యేక గూర్ఖాల్యాండ్ రాష్ట్ర సాధన కోసం దాదాపు 15 ఏళ్లుగా పోరాడుతున్న గూర్ఖా జనముక్తి మోర్చా(జీజేఎం) ఎట్టకేలకు తన ప్రధాన డిమాండ్‌ను విరమించుకుంది. నేపాలీ మాట్లాడే గూర్ఖాలు అధికంగా నివసించే పశ్చిమబెంగాల్లోని పర్వత ప్రాంత సమ్మిళిత అభివృద్ది కోసం ‘రాజకీయ’ పరిష్కారం చూపాలని జీజేఎం ప్రధాన కార్యదర్శి రోషన్ గిరి డిమాండ్‌చేశారు. ‘ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను వదులుకుంటున్నాం. బెంగాల్ రాష్ట్రంలో గూర్ఖాలు ఇకపై మమేకం అవుతారు. పర్వత ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తారు’ అని రోషన్ చెప్పారు. ఉత్తర బెంగాల్ పర్యటనలో ఉన్న సీఎం మమతా బెనర్జీతో హమ్రో పార్టీ సభ్యులతో కూడిన జీజేఎం ప్రతినిధి బృందం భేటీ అయింది. జీజేఎం నిర్ణయాన్ని అధికార తృణమూల్ కాంగ్రెస్ సహా పలు పార్టీలు స్వాగతించాయి. ప్రజా మద్దతు కోల్పోయే జీజేఎం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని, ప్రత్యేక డార్జిలింగ్ రాష్ట్ర సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని కుర్సేంగ్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు ప్రసాద్ శర్మ అన్నారు. జీజేఎంకు ఆయువుపట్టు లాంటి డార్జిలింగ్ ప్రాంతంలో హమ్రో పార్టీ హవా పెరిగిందని, ముఖ్యంగా డార్జిలింగ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలవడంతో జీజేఎం పంథా మారిందని శర్మ వ్యాఖ్యానించారు. -
ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం
సాక్షి, డార్జిలింగ్ : ప్రత్యేక గూర్ఖాలాండ్ పోరాటంలో ఇకపై ఉద్యమాలు, సమ్మెలు, హర్తాల్ వంటివి చేయమని గూర్ఖా జనముక్తి మోర్చా ఆదివారం ప్రకటించింది. మూడు నెలలుగా డార్జిలింగ్‌లో నిర్వహిస్తున్న సమ్మె, బంద్‌ల వల్ల ఎటువంటి ఫలితం రాకపోవడంతో.. ఇకపై పూర్తిగా ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమాన్ని చేయాలని నిర్ణయించినట్లు జీజేఎం నేత బిన్నీ తమాంగ్ ప్రకటించారు. బంద్‌ల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం మినహా సాధించేదేమీ లేదని చెప్పారు. దీపావళి తరువాత ఆరు ప్రాంతాల్లో ప్రజా సమావేశాలు, చర్చలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రత్యేక గూర్ఖాలాండ్ ఉద్యమానికి ఇతర రాష్ట్రాలు సహకరించాలని ఆయన కోరారు. -
ప్లేటు ఫిరాయించిన బీజేపీ
డార్జిలింగ్: ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం డిమాండ్‌కు గత దశాబ్దం కాలంగా మద్దతిస్తూ వస్తున్న భారతీయ జనతా పార్టీ హఠాత్తుగా నేడు తన పంథాను ఎందుకు మార్చుకుంది? సీపీఎం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గూర్ఖాలాండ్ రాష్ట్రం కావలంటూ గొడవ చేసిన బీజేపీ ఎందుకు మౌనం వహించిందీ? గూర్ఖాలాండ్‌కు మద్దతిస్తూ డార్జిలింగ్ నుంచి గత రెండు పర్యాయాలు బీజేపీ ఎమ్మెల్యే గెలిచిన విషయాన్ని కూడా ఎందుకు విస్మరిస్తోంది? నేడు కేంద్రంలో బీజేపీయే అధికారంలో ఉంది. గూర్ఖాలాండ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలంటే చేతిలోని పనే. అయినా ప్రత్యేక రాష్ట్రం కోసం గూర్ఖాలాండ్ ప్రజలు విధ్వంసం సష్టిస్తున్నా కదలిక లేదు. పైగా ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రాన్ని కోరేది లేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గియా మంగళవారం స్పష్టం చేశారు. అందుకు గూర్ఖాలాండ్ మీదుగా చొరబాటుదారులు వస్తారని చైనా బూచీని చూపెడుతున్నారు. ఓ రాష్ట్రంకన్నా జాతీయ సమగ్రతే ముఖ్యమంటూ కొంత పాట వినిపిస్తున్నారు. ఈ చైనా బూచీ ఇంతకు ముందు లేదా? ఎందుకు ఇప్పుడు కొత్తగా వచ్చింది? ఇదంతా రాజకీయం కాదా? పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ ఐక్య బెంగాల్ పేరిట మరింత బలపడేందుకు కషి చేస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రమంతటా ఒకే భాష ఉండాలనే ఉత్తర్వులతో నేపాలీ మాట్లాడే గూర్ఖాలాండ్ ప్రజలను రెచ్చగొట్టారు. తనమూల్ కాంగ్రెస్ పునాదులను పెకిలించి తన పార్టీని బలోపేతం చేసుకోవాలని గత కొంతకాలంటా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ దశలో గూర్ఖాలాండ్ డిమాండ్‌ను అంగీకరించినట్లయితే మిగతా పశ్చిమ బెంగాల్ ప్రజలను మొత్తం శత్రువులను చేసుకోవాల్సి వస్తుందన్న భయం. గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటవడం వల్ల బీజేపీకి రాజకీయంగా కూడా ఒరిగేదేమీ లేదు. మహా అంటే గూర్ఖాలాండ్‌కు ఒక్క ఎంపీ సీటు లభిస్తుంది. అది కూడా పార్టీకి దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. ‘గూర్ఖా జనముక్తి మోర్చా’ లాంటి పార్టీలే తన్నుకు పోతాయ్. బెంగాల్‌లోని 42 ఎంపీ సీట్లపై దష్టి పెట్టడమే మంచిదన్న దూరదష్టితో ఆలోచించి ప్లేటు ఫిరాయించింది. -
'బైచుంగ్కు ఇవ్వం... బీజేపీకే మద్దతు ఇస్తాం'
డార్జీలింగ్ లోక్‌సభ నియోజకవర్గానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు బైచుంగ్ భాటియాను ఎంపిక చేయడం పట్ల గుర్కా జనముక్తి మోర్చ (జీజేఎం) నిరసన వ్యక్తం చేసింది. అతడిని ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని జీజేఎం అధ్యక్షుడు బిమల్ గురంగ్ మంగళవారం డార్జీలింగ్లో వెల్లడించారు. సిక్కం రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఇక్కడ ఎలా ఎన్నికల బరిలో నిలుపుతారని ఆయన ఆ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రశ్నించారు. ఆయన ఎంపిక విషయం తమను సంప్రదించలేదన్నారు. అదికాక గుర్కాలాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఏప్పటి నుంచి పోరాడుతున్నామని ఆయన గుర్తు చేశారు. బీజేపీ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలంగా ఉందన్నారు. అందుకు మద్దతు ఇస్తామని ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు జస్వంత్ సింగ్, సుష్మాస్వరాజ్, రాజీవ్ ప్రతాప్ రూడీలు భరోసా ఇచ్చారన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకే మద్దతు ఇస్తామన్నారు. అయితే డార్జీలింగ్ ఎంపీ బీజేపీ సీనియర్ నేత జస్వంత్ సింగ్ గత ఐదేళ్లుగా తమ ప్రాంతానికి చేసింది ఏమీ లేదన్నారు. అయితే డార్జీలింగ్ నియోజకవర్గం నుంచి బైచుంగ్ వంద శాతం విజయం సాధిస్తాడని రాష్ట్ర మంత్రి గౌతమ్ దేవ్ ధీమా వ్యక్తం చేశారు.