కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో బీజేపీని నిలువరించేందుకు తృణమూల్ కాంగ్రెస్‌తో చేతులు కలపాలన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రతిపాదనను వామపక్షాలు తిరస్కరించాయి. మమత పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాయి. రాజకీయాల్లో అంటరానివారు ఎవరూ ఉండరని, వామపక్షాలతో పొత్తుపై చర్చలకు సిద్ధమని మమత శుక్రవారం అన్నారు. దీనిపై సీపీఐ నేత గురుదాస్ దాస్‌గుప్తా మాట్లాడుతూ.. తృణమూల్‌తో కానీ, మమతతో కానీ పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదని, మమత రాజకీయాలు, విధానాల వల్లే బీజేపీ బెంగాల్‌లోకి ప్రవేశించిందని ఆరోపించారు. ఇతర వామపక్ష పార్టీలైన ఫార్వర్డ్ బ్లాక్, ఆర్‌ఎస్‌పీ కూడా తృణమూల్‌తో పొత్తు ప్రతిపాదనను వ్యతిరేకించాయి.