బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తలకు తీవ్రగాయం | Mamata Banerjee Suffered Major Injury Says Trinamool Congress | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తలకు తీవ్రగాయం

Published Thu, Mar 14 2024 8:31 PM | Last Updated on Fri, Mar 15 2024 4:24 AM

Mamata Banerjee Suffered Major Injury Says Trinamool Congress - Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె తల నుదుటిపై భారీ గాయమైంది. ఈ విషయాన్ని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఎక్స్‌’ట్విటర్‌’లో వెల్లడించింది. 

మమతా తలకు గాయమైన ఫోటోను షేర్‌ చేసింది. ఆసుపత్రి బెడ్‌పై మమతా పడుకొని ఉండగా.. ఆమె తల నుదుటి భాగాన గాయమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముఖం మీదుగా మెడ వద్దకు రక్తం కారుతూ కనిపిస్తున్నారు. ‘మా చైర్‌పర్సన్ మమతా బెనర్జీ గాయపడ్డారు. దయచేసి ఆమెకోసం ప్రార్థించండి’ అంటూ ట్వీట్‌ చేశారు.

కాగా మమతా బెనర్జీ గురువారం కాళీఘాట్‌లోని తన ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడటంతో ఆమెకు ఈ గాయమైంది. దీంతో వెంటనే ఆమెను కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 

ఇక ఈ ఏడాది జనవరిలోనూ  కారు ప్రమాదంలో మమతా తలకు స్వల్ప గాయమైంది.  బర్ధమాన్‌ నుంచి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా.. ఆమె కాన్వాయ్‌కు ఎదురుగా మరో వాహనం రావడంతో దాన్ని తప్పించేందుకు డ్రైవర్‌ కారుకు బ్రేక్‌లు వేశాడు. దీంతో ముందు సీట్లో కూర్చున్న సీఎం.. విండ్‌షీల్డ్‌కు ఢీకొనడంతో తలకు స్వల్ప గాయమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement