Mamata Banerjee sings Bengali song amid 30-hour sit-in against Centre - Sakshi
Sakshi News home page

మైక్‌ పట్టుకొని పాట పాడిన మమతా బెనర్జీ.. వీడియో వైరల్!

Published Thu, Mar 30 2023 4:17 PM | Last Updated on Thu, Mar 30 2023 5:35 PM

Mamata Banerjee Sings Bengali Song In Protest Against Centre - Sakshi

కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ పాట పాడారు. కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా చేపట్టిన ధర్నాలో గురువారం తన నిరసనను సీఎం ఓ పాట రూపంలో వ్యక్తపరిచారు. రవింద్రనాథ్‌ ఠాగూర్‌ స్వరపరిచిన ఓ బెంగాలీ పాటను మైక్‌ పట్టుకొని స్వయంగా ఆలపించారు. ధర్నా సమయంలో స్టేజ్‌ మీదున్న ఇతర నేతలు, కళాకారులతో కలిసి ‘ఎబార్ తోర్ మోరా గంగే’ అనే పాటను పాడారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ కోల్‌కతాలో రెండు రోజులుగా మమతా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. గ్రామీణ ఉపాధి హామీ పథకంతో సహా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఎం స్వయంగా ఈ ధర్నా చేపట్టారు. ఈ దీక్షలో మమతతో పాటు టీఎంసీ సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. ఈ నిరసన దీక్ష ఈ రోజు రాత్రి 7 గంటలకు ముగియనుంది.
చదవండి: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడుపని.. ఆ వీడియో చూస్తూ అడ్డంగా బుక్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement