తృణమూల్, బీజేపీ ఘర్షణల్లో ముగ్గురి మృతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందారు. బీర్భూం జిల్లా మక్రా గ్రామంలో సోమవారం ఇరుపార్టీల కార్యకర్తలు నాటు తుపాకులతో కాల్పు లు జరుపుకోగా ముగ్గురు తీవ్రం గా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. ఘర్షణల్లో 5 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. గ్రామం లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
మక్రా దగ్గరున్న చక్‌మొండోలా గ్రామంలో బాంబులు తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఈనెల 24న పోలీసులు అక్కడి తనిఖీకి వెళ్లగా స్థానికులు బాంబులతో దాడి చేశారు. నలుగురికి గాయాలయ్యాయి. 26న ఆ గ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఘర్షణలు చెలరేగాయి.