Pavan Varma.. దేశవ్యాప్తంగా రాజీకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బీహార్‌లో బీజేపీకి హ్యాండ్ ఇస్తూ నితీష్ కుమార్.. కాంగ్రెస్, ఆర్జేడీ సపోర్టుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాగా, ఇంతకు ముందు బీజేపీతో కలిసి ఉండటాన్ని ఇష్టపడని కొందరు నేతల జేడీయూను వీడారు. తాజాగా బీజేపీ నుంచి తెగదెంపులు చేసుకోవడంతో నేతలు మళ్లీ నితీష్ చెంతకు చేరుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బీహార్‌కు చెందిన జేడీయూ మాజీ ఎంపీ పవన్ వర్మ శుక్రవారం.. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీకి రాజీనామా చేశారు. ఈ మేరకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా.. ‘మమతా జీ, ఏఐటీసీ కార్యాలయానికి పంపిన నా రాజీనామాను దయచేసి ఆమోదించండి. మీ ఆప్యాయత, మర్యాదలకు ధన్యవాదాలు చెబుతున్నాను. మీతో సంప్రదింపులు జరిపేందుకు నేను ఎదురుచూస్తున్నాను. మీకు అంతా మంచి జరుగాలని కోరుకుంటున్నాను. హృదయపూర్వక నమస్కారాలు’ అంటూ కామెంట్స్ చేశారు.
అయితే, గతంలో జేడీయూ అధినేత నితీశ్ కుమార్ బీజేపీకి మద్దతు ఇవ్వడాన్ని పవన్ కుమార్ తప్పుపట్టారు. ఈ సందర్భంలోనే పౌరసత్వ సవరణ చట్టాన్ని నితీశ్ కుమార్ సమర్థించడాన్ని పవన్ వర్మ వ్యతిరేకించారు. . బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌పై నితీశ్ కుమార్ కామెంట్స్‌ను ప్రస్తావిస్తూ లేఖ రాయడం అప్పట్లో సంచలనంగా మారింది. దీంతో, పవన్ వర్మను జేడీయూ సస్పెండ్ చేసింది. అనంతరం, ఆయన మమత నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్‌లో చేరారు. కాగా, తాజాగా నితీష్ కుమార్.. బీజేపీకి గుడ్ బై చెప్పడంతో పవన్ వర్మ టీఎంసీ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. మళ్లీ పవన్ వర్మ.. నితీష్ గూటికి చేరుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, పవన్ వర్మ టీఎంసీలో చేరి ఏడాది కూడా కాకపోవడం విశేషం.
Pavan Varma joined TMC in November 2021. In January 2020, he was expelled from JD(U) over his open criticism of Nitish Kumar's support for the controversial Citizenship Amendment Act. https://t.co/oa1arCypqc
— The Wire (@thewire_in) August 12, 2022
ఇది కూడా చదవండి: శశిథరూర్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం
Comments
Please login to add a commentAdd a comment