
తృణమూల్ కార్యాలయానికి నిప్పు
డార్జిలింగ్:
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఆందోళనకారులు నిప్పంటించారు. గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రంకోసం 35 రోజులుగా వీరు సమ్మె చేస్తుండడం తెలిసిందే. కర్సెంగీ ప్రాంతంలోని రాజరాజేశ్వరీ హాల్‌లో మంటలు రేగిన మరుసటిరోజే ఆందోళనకారులు తృణమూల్ పార్టీ కార్యాలయానికి నిప్పంటించారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టంగానీ, గాయాలుగానీ కాలేదని పోలీసులు తెలిపారు. సంప్రదాయ నేపాలీ దుస్తులను ధరించి ప్రత్యేక గుర్ఖాలాండ్ రాష్ట్ర నినాదాలతో బుధవారం ఉదయం ర్యాలీ జరిపారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం రీబందోబస్తును ఏర్పాటు చేసింది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కేవలం ఔషధ దుకాణాలు మినహా మిగతా అన్నింటినీ మూసివేశారు.