Gorkhaland
-
తృణమూల్ కార్యాలయానికి నిప్పు
డార్జిలింగ్: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఆందోళనకారులు నిప్పంటించారు. గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రంకోసం 35 రోజులుగా వీరు సమ్మె చేస్తుండడం తెలిసిందే. కర్సెంగీ ప్రాంతంలోని రాజరాజేశ్వరీ హాల్లో మంటలు రేగిన మరుసటిరోజే ఆందోళనకారులు తృణమూల్ పార్టీ కార్యాలయానికి నిప్పంటించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టంగానీ, గాయాలుగానీ కాలేదని పోలీసులు తెలిపారు. సంప్రదాయ నేపాలీ దుస్తులను ధరించి ప్రత్యేక గుర్ఖాలాండ్ రాష్ట్ర నినాదాలతో బుధవారం ఉదయం ర్యాలీ జరిపారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం రీబందోబస్తును ఏర్పాటు చేసింది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కేవలం ఔషధ దుకాణాలు మినహా మిగతా అన్నింటినీ మూసివేశారు. -
గతాన్ని గుర్తు చేస్తున్న మమత
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 34 ఏళ్ల వామపక్షాల పాలనకు తెరదించి అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మళ్లీ ప్రజలు వామపక్షాలను గుర్తుచేసుకునేలా చేస్తున్నారు. సుదీర్ఘకంగా రాష్ట్రాలన్ని పాలించిన వామపక్షాల హయాంలో రానురాను అభివద్ధి కుంటుపడినప్పటికీ రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు ఉండేవని ప్రజలు అంటున్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో హిందు, ముస్లింల మధ్య అల్లర్లు చెలరేగి, ఉద్రిక్తపరిస్థితులు కొనసాగుతుండగా, ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం కోసం డార్జిలింగ్‌లో విధ్వంసకాండ కొనసాగుతోంది. ప్రత్యేక రాష్ట్రం కోసం గూర్ఖాలాండ్ ప్రజలు నిరవధిక సమ్మెను ప్రారంభించి శుక్రవారం నాటికి సరిగ్గా 30 రోజులయ్యాయి. డార్జిలింగ్ రైల్వే భద్రతా దళం కార్యాలయాన్ని, పోలీసు పోస్ట్‌ను, రాష్ట్ర ప్రభుత్వ గ్రంధాలయాన్ని ఆందోళనకారులు దగ్ధం చేశారు. ఇంటర్నెట్ సర్వీసులు మూగపోయి దాదాపు 27 రోజులు గడిచాయి. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు మమతా బెనర్జీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ముస్లింలను మెప్పించేందుకు మమతా బెనర్జీ తీసుకుంటున్న చర్యలతో మండిపడుతున్న హిందూ శక్తులు రాష్ట్రంలో మత ఘర్షణలను మరింత రెచ్చగొట్టేందుకు కాచుకు కూర్చున్నాయి. తప్పుడు వార్తలకు ప్రచారం కల్పిస్తున్నాయి. ముస్లింలకు సాధికారికత కల్పించేందుకు కాకుండా, కేవలం వారిని మెప్పించేందుకే మమతా బెనర్జీ చర్యలు తీసుకుంటుడాన్ని ఇప్పటికే కలకత్తా హైకోర్టు మూడుసార్లు మందలించినప్పటికీ ఆమె వైఖరిలో మార్పు రావడం లేదు. సమాజంలో వెనకబడిన ముస్లింలకు సాధికారికత కల్పించాలంటే విద్యా, ఉద్యోగావకాశాల్లో వారికి రిజర్వేషన్ల లాంటివి కల్పించాలి. కానీ మసీదుల్లో పనిచేసే ముల్లాలకు జీతభత్యాలు ఇవ్వడమంటే ముస్లింలను మంచి చేసుకోవడానికి మాత్రమేనని సామాజిక శాస్త్రవేత్తలు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఎదగకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో 1990 నాటికి చల్లబడిన గూర్ఖాలాండ్ ఉద్యమాన్ని మమతా బెనర్జీ అనవసరంగా తట్టిలేపారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే భాషా విధానం ఉండాలంటూ సర్క్యులర్ జారీ చేయడం ద్వారా నేపాల్ భాష మాట్లాడే గూర్ఖాలను రెచ్చగొట్టారు. 29 శాతం ముస్లింలతో కలిపి 40 శాతం ఓటర్లు తనపక్కనున్నారని భావిస్తున్న మమతా బెనర్జీ పది శాతం కూడా లేని గూర్ఖాలను (12 లక్షల మంది) పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నట్లున్నారు. గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌ను సానుభూతితో పరిశీలిస్తామని 2014 లోక్‌సభ ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీజేపీ మొత్తం బెంగాల్ రాష్ట్రం మీదకన్నేసి గూర్ఖాలాండ్పై శీతకన్నేసింది. -
గూర్ఖాలాండ్ ఉద్యమంలో మళ్లీ హింస
డార్జిలింగ్: ప్రత్యేక గూర్ఖాలాండ్ కోసం 29 రోజులుగా సాగుతున్న ఉద్యమం మరోసారి హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు గురువారం గూర్ఖాలాండ్ ప్రాదేశిక పరిపాలన(జీటీఏ) కార్యాలయంతో పాటు రైల్వే స్టేషన్, అటవీశాఖ బంగ్లాకు నిప్పు పెట్టారు. దగ్గరిలోని పలు వాహనాలను ధ్వంసం చేశారు. మరోవైపు నేపాలీ కవి భానుభక్త ఆచార్య జయంతి సందర్భంగా వందలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రత్యేక రాష్ట్రం కోసం నినాదాలు చేశారు. గూర్ఖాలాండ్ ఉద్యమ సమన్వయ కమిటీ(జీఎంసీసీ) ఇచ్చిన పిలుపు మేరకు రచయిత, మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ కృష్ణసింగ్ మొక్తాన్ 2004లో అందుకున్న భానుభక్త అవార్డును బెంగాల్ ప్రభుత్వానికి తిరిగిచ్చేశారు. సంగీత్ సమ్మాన్ అవార్డును గాయకుడు కర్మయోన్జన్ వెనక్కి ఇచ్చారు. జాతీయ జలవిద్యుదుత్పత్తి సంస్థ(ఎన్‌హెచ్‌పీసీ)కు చెందిన రామ్దీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని 600 మంది ఆందోళనకారులు చుట్టుముట్టడంతో కార్యకలాపాలను నిలిపివేశారు. మరోవైపు, ఈ హింసాత్మక ఘటనలపై రాష్ట్ర పర్యాటక మంత్రి గౌతమ్ దేబ్ తీవ్రంగా మండిపడ్డారు. -
రూ. లక్ష దాటిన కిలో టీ పౌడరు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే, ముఖ్యంగా యూరప్ దేశాల్లో గూర్ఖాలాండ్ రాజధాని డార్జిలింగ్ తేయాకు ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆ రాష్ట్ర ప్రజలు గత కొంతకాలంగా ఆందోళన నిర్వహిస్తుండడంతో తేయాకు రెండో పంట పూర్తిగా దెబ్బతిన్నది. తేయాకును తెంపే కూలీలు పనిలోకి రాకుండా ఆందోళన చేస్తుండడంతో స్థానిక టీ కంపెనీలన్నీ మూతపడ్డాయి. యూరప్ దేశాలకు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. భారతీయ కరెన్సీలో ఐదువేల రూపాయలకు కిలో పలికే డార్జిలింగ్ టీ పొడి ధర ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో లక్ష ఇరవై వేల రూపాయలు పలుకుతోంది. మరికొంతకాలం అయితే అసలు సరకు దొరకని పరిస్థితి ఏర్పడుతుందని తేయాకు ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అస్సాం తేయాకుకన్నా డార్జిలింగ్‌లో పండే తేయాకు ప్రత్యేకమైనది, భిన్నమైనది. దీనికి ప్రత్యేకమైన రుచి, వాసన ఉంటుంది. అందుకనే అస్సాం టీ పొడి కిలో 130 రూపాయలు పలికితే డార్జిలింగ్ టీ పొడి ధర ఐదువేల రూపాయల వరకు పలుకుతుంది. డార్జిలింగ్ తేయాకు పంటను మేలో ప్రారంభిస్తారు. అదే జూన్ నెలలో తీవ్రస్థాయికి చేరుకుంటంది. సెప్టెంబర్‌తో పూర్తిగా ముగిసిపోతుంది. అన్నింటికన్నా జూన్ నెల కీలకమైనది. ఆకులను తెంపి వేయడం వల్ల మళ్లీ వచ్చే ఆకులు బలంగా ఉంటాయి. జూన్ నెలలో తేయాకు ఆకులను తెంపడం ఆపిస్తే ఆ తర్వాత ఆకులు కూడా చేతికి అందకుండా పోతాయి. ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ గూర్ఖాలు జూన్ 9వ తేదీ నుంచి తేయాకు తోటల్లోకి పనులకు రావడం లేదు. డార్జిలింగ్ తేయాకు రెండో పంట దాదాపు పూర్తిగా తుడుచుపెట్లుకుపోయినట్లేనని స్థానిక ‘గూడ్రిక్ గ్రూప్’ మేనేజింగ్ డైరెక్టర్ ఏఎన్ సింగ్ తెలిపారు. 40 శాతం రెవెన్యూ పూర్తిగా నష్టపోయామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు ఆ కంపెనీకి 260 కోట్ల రూపాయల నష్టం ఇప్పటికే వాటిల్లిందని డార్జిలింగ్ టీ అసోసియేషన్ కార్యదర్శి కౌషిక్ బసు మీడియాకు తెలిపారు. ఆ ప్రాంతంలో దాదాపు వంద మంది ఎగుమతిదారులకు ఈ సంఘం ప్రాతినిధ్యం వహిస్తోంది. జర్మనీకి చెందిన హల్స్సేన్ అండ్ ఆంప్, లియాన్, లండన్‌కు చెందిన యూనిలివర్, యూకేకు చెందిన టైపూ, ట్వినింగ్స్, టెట్లీ కంపెనీలు డార్జిలింగ్ టీ పొడిని ఎక్కువగా కొనగోలు చేస్తాయి. ఇప్పట్లో ఆందోళన సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇటీవల జరిగిన పోలీసు కాల్పుల్లో ముగ్గురు గూర్ఖా ఆందోళనకారులు మరణించారు. పలువురు గాయపడ్డారు. 1980 దశకంలో ఆందోళన తీవ్రంగా జరిగినప్పుడు దాదాపు 1200 మంది ఆందోళనకారులు మరణించారు. -
రగులుతున్న గూర్ఖాలాండ్
డార్జిలింగ్: గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నినాదంతో డార్జిలింగ్‌లో చెలరేగిన హింస కలింపోంగ్కు పాకింది. డార్జి లింగ్లో ఆదివారం ఎలాంటి అవాంఛనీయ ఘటనా చోటుచేసుకోలేదు. కలిం పోంగ్లో ఆందోళనకారులు ఓ గ్రంథా లయం, రెండు పంచాయతీ కార్యాలయాలు, ఓ పోలీసు వాహనాన్ని తగులబెట్టారు. అయితే ఇది తమ పని కాదని గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) పేర్కొంది. డార్జిలింగ్‌లోని సింగమారిలో ఘర్షణల్లో శనివారం చనిపోయిన ఇద్దరు కార్యకర్తల మృతదేహాలతో జీజేఎం ఆది వారం నిరసన ర్యాలీ చేపట్టింది. సమస్య ను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆందోళనకారులకు సూచించారు. -
రణరంగంగా డార్జిలింగ్
► ఆందోళనల్లో ఒకరి మృతి... ► బెంగాల్ సమైక్యత కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం: మమత డార్జిలింగ్/కోల్‌కతా: గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లో 10 రోజులుగా జరుగుతున్న గొడవలు శనివారం మరింత హింసాత్మకంగా మారాయి. డార్జిలింగ్‌లోని సింగమారిలో పోలీసులు, గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు మరణించారు.జూన్ 8న ఘర్షణలు మొదలైన తర్వాత నమోదైన తొలి మరణం ఇది. లెబోంగ్కార్ట్ రోడ్, చౌక్ బజార్, ఘుమ్ ప్రాంతాల్లోనూ హింస చెలరేగింది. 35 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఇండియా రిజర్వ్ బెటాలియన్ (ఐఆర్బీ)కి చెందిన అధికారి కిరణ్ తమంగ్ సహా మొత్తం 19 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఏడుగురు జీజేఎం కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బెంగాల్ సీఎం మమత బెనర్జీకి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ ఫోన్ చేసి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఆందోళనలపై మమత కోల్‌కతాలో మాట్లాడుతూ ‘ఇది ఎన్నో రోజుల క్రితమే పన్నిన కుట్ర. ఒక్క రోజులో ఇన్ని బాంబులు, ఆయుధాలను ఆందోళనకారులు సమకూర్చుకోలేరు. వారి వెనుక ఈశాన్య ప్రాంతంలోని కొన్ని తిరుగుబాటు వర్గాలు, విదేశాలు ఉన్నాయి. నా ప్రాణ త్యాగానికైనా సిద్ధం కానీ బెంగాల్‌ను విడదీయనివ్వను’ అని అన్నారు. పోలీసులపైకి పెట్రోల్ బాంబులు, రాళ్లు ఉద్యమం కారణంగా సింగమారిసహా డార్జిలింగ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. సింగమారిలో శనివారం జీజేఎం కార్యకర్తలు త్రివర్ణపతాకం, వారి పార్టీ జెండాలను పట్టుకుని నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకుని వారిని వెళ్లిపోవాలని కోరారు. అందుకు నిరాకరించిన జీజేఎం కార్యకర్తలు.. సిబ్బందిపై పెట్రోల్ బాంబులు, రాళ్లు విసిరారు. పోలీసు వాహనాలను తగులబెట్టారు. పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించి, లాఠీ చార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. -
ఉద్యమంలో రాజకీయాలు!
గూర్ఖాలాండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉన్నదైనా.. డార్జిలింగ్ ప్రాంతంలో రాజకీయంగా పైచేయి సాధించటానికే తాజాగా ఉద్యమం సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు బెంగాలీ భాషను తప్పనిసరి చేస్తూ మమత బెనర్జీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. నేపాలీ మాతృభాషగా ఉన్న గూర్ఖాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈనెల 8న మమత డార్జిలింగ్‌లో కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మమత గోబ్యాక్ అంటూ పోలీసులపై దాడికి దిగిన నిరసనకారులు వారి వాహనాలను తగులబెట్టారు. జీజేఎం నాయకుడు బిమల్ గురుంగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో డార్జిలింగ్‌లో సోమవారం నుంచి నిరవధిక బంద్ జరుగుతోంది. వైద్యశాలలు, పాఠశాలలు, ఇతర అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ కార్యాలయాలు ఏవీ పనిచేయవని గుర్ఖాలు ప్రకటించారు. మరోవైపు మమత కూడా కఠినవైఖరి తీసుకున్నారు. విధులకు రాకపోతే రికార్డుల్లో ‘సర్వీసు బ్రేక్’గా పరిగణిస్తామని ఉద్యోగులను హెచ్చరించారు. పరిస్థితులను అదుపులోకి తేవడానికి సైన్యాన్ని మోహరించారు. పైచేయి సాధించాలనే ఆరాటం... డార్జిలింగ్‌లో తాజా స్థితికి రాజకీయ ఆధిపత్యం సాధించాలనే ఆరాటమే కారణం. గూర్ఖాలాండ్లో బిమల్ గురుంగ్ మాటకు తిరుగులేదు. ఇక్కడ మమత బలపడటంతో ఆమెకు చెక్ పెట్టాలని గురుంగ్ భావించారు. బెంగాలీ తప్పనిసరన్న మమత నిర్ణయాన్ని సాకుగా తీసుకొని ఆందోళనలకు పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను తెరపైకి తెచ్చి ఉద్యమిస్తే ప్రజల్లో భావోద్వేగాలు పెంచడం ద్వారా పట్టు నిలుపుకోవాలనేది గురుంగ్ ఆలోచన. బీజేపీని నిలువరించేందుకు దీదీ వ్యూహం.. ఉత్తర బెంగాల్‌లోని ఆరు జిల్లాల్లో బీజేపీ క్రమంగా బలం పెంచుకుంటోంది. ఈ జిల్లాలన్నింటిలో కలిపి 42 అసెంబ్లీ స్థానాలు ఉండటంతో బీజేపీ ఎదుగుదలను దీదీ ముప్పుగా భావిస్తున్నారు. చిన్నరాష్ట్రాలకు బీజేపీ సూత్రప్రాయంగా అనుకూలం. మంగళవారం స్థానిక బీజేపీ నేతలు జీజేఎంతో సమావేశంలో పాల్గొని గుర్ఖాలాండ్‌కు మద్దతు పలికారు. డార్జిలింగ్ చుట్టుపక్కల కొండప్రాంతాల్లోనే ప్రత్యేక గూర్ఖాలాండ్‌కు మద్దతు ఉందనీ, మైదాన ప్రాంతాల్లోని ప్రజలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తారని మమత లెక్క. బీజేపీపై విభజనకు అనుకూలమనే ముద్రవేసి ఈ జిల్లాల్లో బీజేపీని దెబ్బతీయాలని దీదీ చూస్తున్నారు. పాపం అమాయక ఆదివాసీలే సెంటిమెంట్‌తో రోడ్డెకుతున్నారు. 110 ఏళ్ల డిమాండ్ డార్జిలింగ్‌తోపాటు సిలిగుడి, జల్పాయ్‌గుడిలోని కొన్ని ప్రాంతాలను కలిపి గూర్ఖాలాండ్ ఏర్పాటు చేయాలనేది 110 ఏళ్ల నుంచి ఉన్న డిమాండ్. ఇప్పటికీ తమను నేపాలీలనే సంబోధిస్తున్నారనేది గూర్ఖాల ఆవేదన. భాష, సాంస్కృతికపరమైన వైవిధ్యాల కారణంగా ప్రత్యేక రాష్ట్రంకోరుతున్నారు. పాలనా సంస్కరణల నిమిత్తం 1907లో భారత్‌లో పర్యటించిన మోర్లీ– మింటో ప్యానల్‌కు, 1952లో నెహ్రూకు, బాషాప్రయుక్త రాష్ట్రాల నిమిత్తం 1953లో ఏర్పాటైన ఎస్సార్సీ (రాష్ట్రాల పునర్విభజన కమిషన్)కి ప్రత్యేక గూర్ఖాలాండ్ ఏర్పాటు చేయాలనే వినతిపత్రాలు అందాయి. రాజీవ్ హయాంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ హింసాత్మక మార్గంలోకి మళ్లింది. సుభాష్ ఘీషింగ్ నేతృత్వంలోని గూర్ఖా జాతీయ విమోచన ఫ్రంట్ ఉద్యమించింది. 1986–88 మధ్య జరిగిన హింసాత్మక ఆందోళనల్లో 1,200 మంది పౌరులు చనిపోయారు. ఆరో షెడ్యూల్లో చేర్చి గిరిజన ప్రాంతానికి కొంతమేరకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించారు. దీని పగ్గాలను గురుంగ్‌కు అప్పజెప్పారు మమత. అయితే 2013 చివర్లో తెలంగాణ ఏర్పాటుకు నాటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జీటీఏ చీఫ్‌గా గురుంగ్ రాజీనామా చేసి... మమతతో తెగదెంపులు చేసుకున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
గుర్ఖా లొల్లి లోగుట్టు
వేసవిలోనూ చల్లగా ఉండే పర్వతప్రాంతం ‘డార్జిలింగ్’ వానాకాలం వచ్చేసినా... ఉడుకుతోంది. ప్రత్యేక రాష్ట్రం గూర్ఖాలాండ్ కావాలనే డిమాండ్‌తో ఇక్కడి ప్రజలు హింసాత్మక ఆందోళనలకు దిగడంతో అట్టుడుకుతోంది. గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో సోమవారం నుంచి నిరవధిక బంద్‌కు గుర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) పిలుపినివ్వడం... మరోవైపు శాంతిభద్రతల నిమిత్తం బెంగాల్ ప్రభుత్వం ఆర్మీని రప్పించడంతో ఉద్రిక్తత నెలకొంది. నిజానికి గూర్ఖాలాండ్ డిమాండ్ కొత్తదేమీ కాదు... వందేళ్లుగా ఉన్నదే. మరిప్పుడు ఎందుకు మళ్లీ తెరపైకి వచ్చిందంటే... రాజకీయ ఆధిపత్య పోరే కారణం. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు బెంగాలీని తప్పనిసరి చేస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. నేపాలీ మాతృభాషగా ఉన్న గూర్ఖాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తమ ఆధిపత్యంలోని డార్జిలింగ్‌లో హింసాత్మక ఆందోళనలకు దిగారు.. ఈనెల 8న మమత డార్జిలింగ్‌లో కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మమత గోబ్యాక్ అంటూ పోలీసులపై దాడికి దిగిన నిరసనకారులు వారి వాహనాలను తగులబెట్టారు. లాఠీచార్జీ, భాష్పవాయువు ప్రయోగం కూడా జరిగింది. గుర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో సోమవారం నుంచి నిరవధిక బంద్‌ను పాటించనున్నట్లు జీజేఎం నాయకుడు బిమల్ గురుంగ్ ప్రకటించారు. ఆసుపత్రులు, పాఠశాలలు, ఇతర అత్యవసర సర్వీసులు మినహా ప్రభుత్వ కార్యాలయాలు ఏవీ పనిచేయవని ప్రకటించారు. మమత కూడా కఠినవైఖరి తీసుకున్నారు. విధులకు రాకపోతే రికార్డుల్లో ‘సర్వీసు బ్రేక్’గా పరిగణిస్తామని ఉద్యోగులను హెచ్చరించారు. పరిస్థితులను అదుపులోకి తేవడానికి సైన్యాన్ని పంపాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. ఆరు పటాలాల సైన్యం, ఐదు కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, స్థానిక పోలీసులను పెద్ద సంఖ్యలో డార్జిలింగ్‌లో మొహరించింది బెంగాల్ ప్రభుత్వం. కేంద్రం మంగళవారం మరో 600 మంది పారా మిలటరీ సిబ్బందిని డార్జిలింగ్‌కు తరలించింది. ► పైచేయి సాధించాలనే ఆరాటం... నిజానికి ప్రస్తుతం డార్జిలింగ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితికి రాజకీయ ఆధిపత్యం సాధించాలనే ఆరాటమే కారణం. ప్రతిపాదిత గూర్ఖాలాండ్ ప్రాంతంలో బిమల్ గురుంగ్ మాటకు తిరుగులేదు. అయితే మమత ఈ ప్రాంతంలో పట్టుకోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇతర ఆదివాసీలైన లెప్చాలు, తమంగ్స్, భూటియాలు, షెర్పాలు, మంగర్లను అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కల్పించారు. కలింపాంగ్‌ను జిల్లాగా చేస్తున్నట్లు ప్రకటించారు. గతనెల 14న నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా... మిరిక్ మున్సిపాలిటీని తృణమూల్ గెలుచుకుంది. పర్వతప్రాంతాల్లో తమకు పెట్టని కోటలుగా ఉన్నచోట్ల తృణమూల్ ఖాతాలు తెరవడం, మిరిక్‌కు కైవసం చేసుకోవడాన్ని... తన ఆధిపత్యానికి సవాల్‌గా గురుంగ్ భావించారు. బెంగాలీ తప్పనిసరి అనే మమత నిర్ణయాన్ని సాకుగా తీసుకొని ఆందోళనలకు పిలుపిచ్చారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ సెంటిమెంటును తెరపైకి తెచ్చి ఉద్యమిస్తే ప్రజల్లో భావోద్వేగాలు పెంచడం ద్వారా పట్టు నిలుపుకోవాలనేది గురుంగ్ ఆలోచన. ► బీజేపీకి చెక్ పెట్టడమే దీదీ వ్యూహం.. ఉత్తర బెంగాల్‌లోని ఆరు జిల్లాల్లో (కూచ్ బెహార్, అలీపూర్దౌర్, జల్పాయ్గురి, డార్జిలింగ్, ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ దినాజ్‌పూర్) 2014– 2016 మధ్యకాలంలో బీజేపీ బాగా బలపడింది. 42 అసెంబ్లీ స్థానాలున్న ఈ జిలాల్లో బీజేపీ ఎదుగుదలను దీదీ ముప్పుగా భావిస్తున్నారు. డార్జిలింగ్ చుట్టుపక్కల కొండప్రాంతాల్లోనే ప్రత్యేక గూర్ఖాలాండ్‌కు మద్దతు ఉంటుందని, మైదాన ప్రాంతాల్లోని బెంగాలీ ప్రజలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తారు కాబట్టి వీరి మద్దతు తృణమూల్‌కు లభిస్తుందని మమత లెక్క. బెంగాల్ విభజనకు మమత మొదటి నుంచి వ్యతిరేకమే. ఎన్డీయే భాగస్వామి అయిన జీజేఎం మద్దతుతోనే 2014లో బీజేపీ డార్జిలింగ్ ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. మంగళవారం స్థానిక బీజేపీ నేతలు జీజేఎంతో సమావేశంలో పాల్గొని గుర్ఖాలాండ్‌కు మద్దతు పలికారు. చిన్నరాష్ట్రాలకు బీజేపీ సూత్రప్రాయంగా అనుకూలం. అసెంబ్లీ ఎన్నికల్లోనూ గూర్ఖాలాండ్‌ను బీజేపీ ప్రస్తావించింది. కాబట్టి బీజేపీపై విభజనకు అనుకూలమనే ముద్రవేసి... ఈ జిల్లాల్లో కమలం పార్టీని దెబ్బతీయాలని దీదీ చూస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతమైతే బీజేపీ ఇరకాటంలో పడుతుంది. బెంగాల్ బీజేపీ నేతలు విభజనను బాహటంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు మిత్రపక్షం జేజీఎం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. గూర్ఖాలాండ్‌కు మొగ్గితే ఉత్తరప్రదేశ్‌లో, మహారాష్ట్రలో విదర్భ నుంచి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు వస్తాయి కాబట్టి బీజేపీ ఏమీ తేల్చదు. పైగా బెంగాల్లో బలపడాలని కమలనాథులు చాలాకాలంగా పావులు కదుపుతున్నారు. తమ ప్రయోజనాలను దెబ్బతీసే గూర్ఖాలాండ్ విభజనను ఇప్పట్లో పట్టించుకోరు. ఇలా రాజకీయ పార్టీలు ఎవరి లెక్కల్లో వారున్నారు. పాపం అమాయక ఆదివాసీలే సెంటిమెంట్‌తో రోడ్డెకుతున్నారు. ► 110 ఏళ్ల డిమాండ్ డార్జిలింగ్ పర్వత ప్రాంతంతో పాటు సిలిగురి, జల్పాయ్గురిలోని కొన్ని ప్రాంతాలను కలిపి గూర్ఖాలాండ్ ఏర్పాటు చేయాలనేది డిమాండ్. భారతీయులమైనప్పటికీ... తమకంటూ ప్రత్యేక రాష్ట్రం లేనందువల్ల ఇప్పటికీ తమను నేపాలీలనే సంబోధిస్తున్నారనేది గూర్ఖాల ఆవేదన. భాష, సాంస్కృతికపరమైన వైవిధ్యాల కారణంగా తమకూ ఒక రాష్ట్రం ఉండాలని వీరు బలంగా కోరుకుంటున్నారు. పాలనా సంస్కరణల నిమిత్తం 1907లో భారత్‌లో పర్యటించిన మోర్లీ– మింటో ప్యానల్‌కు ప్రత్యేక గూర్ఖాలాండ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో వినతిపత్రం అందింది. 1952లో నాటి భారత ప్రధాని నెహ్రూకు ఆలిండియా గూర్ఖా లీగ్ ప్రత్యేక రాష్ట్రం కోరుతూ వినతిపత్రం ఇచ్చింది. బాషాప్రయుక్త రాష్ట్రాల నిమిత్తం ఏర్పాటైన తొలి ఎస్సార్సీ తలుపుతట్టినా ఫలితం శూన్యం. తర్వాత ఇందిరాగాంధీ ఈ డిమాండ్లను పట్టించుకోలేదు. రాజీవ్‌గాంధీ హయాంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ హింసాత్మక మార్గంలోకి మళ్లింది. సుభాష్ ఘీషింగ్ నేతృత్వంలోని గూర్ఖా జాతీయ విమోచన ఫ్రంట్ ఉద్యమించింది. 1986–88 మధ్య జరిగిన హింసాత్మక ఆందోళనల్లో 1,200 మంది పౌరులు చనిపోయారు. 1988 ఆగష్టు 22న ఉద్యమకారులకు, కేంద్రానికి, బెంగాల్ ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరి... ఈ ప్రాంత పరిపాలన చూడటానికి డార్జిలింగ్ గూర్ఖా హిల్ కౌన్సిల్ (డీజీహెచ్ఎస్) ఏర్పాటైంది. షీఘింగ్ 2008 దాకా డీజీహెచ్ఎస్కు నేతృత్వం వహించారు. బిమల్ గురుంగ్ నేతృత్వంలోని జీజేఎం బలమైన శక్తిగా ఎదగడంతో ఘీషింగ్ డార్జిలింగ్‌ను వదిలి వెళ్లారు. మరో ఉద్యమం తర్వాత గూర్ఖాలాండ్ ప్రాదేశిక పాలనావిభాగం (జీటీఏ) ఏర్పాటైంది. ఆరో షెడ్యూల్లో చేర్చి గిరిజన ప్రాంతానికి కొంతమేరకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించారు. దీని పగ్గాలను గురుంగ్‌కు అప్పజెప్పారు మమత. అయితే 2013 చివర్లో తెలంగాణ ఏర్పాటుకు నాటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జీటీఏ చీఫ్‌గా గురుంగ్ రాజీనామా చేసి... మమతతో తెగదెంపులు చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా కావాలనే డిమాండ్ తిరిగి ఎత్తుకున్నారు.– సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
విదర్భకు ఓకే.. గూర్ఖాలాండ్‌కు నో!
బోడోలాండ్నూ సమర్థించను: జైరామ్ ‘తెలంగాణకు’ హామీ ఇచ్చాం సీమాంధ్ర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్నాం న్యూఢిల్లీ: మహారాష్ట్ర నుంచి విదర్భను విడదీయాలన్న డిమాండ్‌ను సమర్థిస్తానని ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్న కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్ సోమవారం ప్రకటించారు. అయితే వ్యూహాత్మక కారణాల రీత్యా పశ్చిమబెంగాల్లోని గూర్ఖాలాండ్ డిమాండ్‌ను మాత్రం సమర్థించబోనన్నారు. అలాగే అసోంలోని బోడోలాండ్ డిమాండ్‌నూ సమర్థించనన్నారు. విదర్భ డిమాండ్ కూడా గతంలో ఎప్పట్నుంచో ఉన్నదేనన్నారు. ఎన్సీపీతో పాటు బీజేపీ కూడా అందుకు సానుకూలమేనని, కేవలం శివసేనను ఒప్పిస్తే సరిపోతుందని ఒక చానల్ ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌ను కూడా నాలుగు ముక్కలు చేయాలని రెండు రోజుల క్రితమే జైరాం గట్టిగా డిమాండ్ చేయడం తెలిసిందే. ప్రస్తుత రూపంలో ఉత్తరప్రదేశ్ పాలన కష్టసాధ్యమని జైరామ్ చెప్పారు. ఆ రాష్ట్రంలో ఏకంగా 20 కోట్ల జనాభా, 74 లేదా 75 జిల్లాలు, 800 బ్లాకులు ఉన్నాయన్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా యూపీని సమర్ధంగా పాలించలేదన్నారు. అందుకే ఆ రాష్ట్ర విభజనను తాను సమర్థిస్తున్నానన్నారు. అరుుతే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, కాంగ్రెస్ పార్టీది కానీ, భారత ప్రభుత్వానిది కానీ కాదని చెప్పారు. తెలంగాణకు, ఎన్నికలకు సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోతుందని తాననుకోనన్నారు. ఎన్నికలకు, తెలంగాణ ఏర్పాటుకు సంబంధం లేదన్నారు. 60 ఏళ్ల క్రితం నుంచే తెలంగాణ అంశం ఉందని, ఇటీవల పదేళ్లలో కూడా ఇది తీవ్రంగా ఉందని, 2004లో తెలంగాణ ఏర్పాటుకు తాము హామీ ఇచ్చామని చెప్పారు. కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయూలు ఉన్నప్పటికీ ఇచ్చినమాటకు కట్టుబడి ముందుకు వెళ్లామన్నారు. సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలు, ఆందోళనలు పూర్తిగా దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకున్నామన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటికీ సీమాంధ్రకు మంచి అభివృద్ధి ప్యాకేజీ లభించిందని చెప్పారు. సీమాంధ్రకిచ్చిన ప్రత్యేక హోదాను జాతీయ అభివృద్ధి మండలి (ఎన్డీసీ) ధ్రువీకరించనుందని తెలిపారు. హైదరాబాద్‌లో వస్తున్న ఆదాయమంతా సీమాంధ్ర కోల్పోరుు తెలంగాణకు జమ అవుతుందని చెప్పారు. వనరులు కూడా తగ్గిపోతాయని, ఈ దృష్ట్యానే ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తున్నట్టు తెలిపారు. -
గూర్ఖాలాండ్ ఇవ్వండి: జీజేఎం
కోల్‌కతా: ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణను ఏర్పాటు చేసిన రీతిలోనే ఏకపక్ష నిర్ణయంతో బెంగాల్‌ను విడదీసి గూర్ఖాలాండ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని జీజేఎం(గూర్ఖా జన్ముక్తి మోర్చా) గురువారం ఇక్కడ డిమాండ్ చేసింది. కొన్ని దశాబ్దాలుగా తాము ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేస్తున్నామని జీజేఎం అధ్యక్షుడు బిమల్ గురుంగ్ ఫేస్బుక్లో పేర్కొన్నారు. తమ డిమాండ్ సాధనలో భాగంగా శుక్రవారం భారీస్థాయిలో ఢిల్లీలో ర్యాలీ చేపడుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఏపీ అసెంబ్లీ తీర్మానాన్ని తోసిపుచ్చి తెలంగాణను ఏర్పాటు చేసిన విధంగానే తమకు గూర్ఖాలాండ్‌ను ఏర్పాటు చేయాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. -
గూర్ఖాలాండ్ డిమాండ్‌ను విడిచిపెట్టం: జీజేఎం
డార్జిలింగ్: చర్చల ద్వారా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నా, గూర్ఖాలాండ్ డిమాండ్‌ను విడిచిపెట్టబోమని గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) అధ్యక్షుడు బిమల్ గురుంగ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ సర్కారు సంతకం చేసిన గూర్ఖా ప్రాంతీయ ప్రాధికార సంస్థ చట్టంలో గూర్ఖాలాండ్ డిమాండ్ ఉందని ఆయన గుర్తు చేశారు. ఆయన ఆదివారంలో తన వ్యాఖ్యలను ‘ఫేస్బుక్’లో పోస్ట్ చేశారు. కేంద్రం తెలంగాణ డిమాండ్‌ను ఆమోదించినప్పుడు, తామెందుకు తమ డిమాండ్‌ను వదులుకోవాలని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌పై కేంద్రంతో చర్చలు జరిపేందుకు తమ పార్టీ ప్రతినిధులు డిసెంబర్ 21న ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిపారు. డార్జిలింగ్ పర్వత ప్రాంతంలోను, తెరాయి, దూవార్ ప్రాంతా ల్లో ఎలాంటి బంద్‌లు ఉండబోవన్నారు. డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లో శాంతి కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునివ్వడంపై స్పందిస్తూ, ఈ ప్రాంతంలో తానేమీ హింసాకాండను కోరుకోవడం లేదన్నారు. -
మోడీకి సౌరాష్ర్ట ‘బేడీ’!
విశ్లేషణ: ‘‘ఉత్తర బెంగాల్‌లోని గూర్ఖాలాండ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను అవాస్తవమైన, అసహజమైన, జాతీయ ప్రయోజనాలకు హానికరమైన ప్రతిపాదనగా భారత ప్రభుత్వం భావిస్తోంది. అలాంటి ప్రత్యేక రాష్ట్రంఏర్పాటు కోసం జరిగే ఉద్యమానికి ఎలాంటి అవకాశం ఇవ్వరాదని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇలాంటి మతిలేని ప్రయత్నాల ద్వారా దేశ సంఘీభావాన్ని చెడగొట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం సహించబోదు’’ అని సర్దార్ పటేల్ 1952 జూలైలో హెచ్చరించారు. పులి మేకతోలు కప్పుకున్నంత మాత్రాన మేకగా మారిపోతుం దా? మారిపోదు కనుకనే, దానికి ‘మేకవన్నెపులి’ అని పేరు పెట్టాల్సివచ్చింది! అలాగే 2000 మంది మైనారిటీల ఊచకోతకు బాధ్యుడై కూడా న్యాయవ్యవ స్థనూ, అసమర్థపు కాంగ్రెస్ పాలక వ్యవస్థనూ పదకొం డేళ్లుగా మభ్యపెడుతూ కేసుల నుంచి తప్పించుకుని తిరు గుతున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తన ‘కంట్లో దూలాల్ని’ చూసుకోకుండా ఎదుటి వారి కళ్లల్లో నలుసుల్ని వెతకచూడటంలో ఆరితేరినవాడు! అశేష త్యాగాలతో ప్రజాబాహుళ్యం అరవై ఆరేళ్లనాడు సాధిం చుకున్న స్వాతంత్య్రాన్నీ, లౌకిక వ్యవస్థా స్థాపనను ప్రజ లకు గ్యారంటీ చేసి ప్రజలకు హామీ పడిన రాజ్యాంగాన్నీ ఈ ఆరు దశాబ్దాలలో కాంగ్రెస్ పాలకులు నీరుగార్చారు. మరోవైపు రాజకీయ ముసుగులో పాలనాశక్తిగా ‘హిం దూత్వ’ పేరిట అవతరించిన భారతీయ జనతాపార్టీ నాయకులు నేడు ‘మోడీత్వ’ రంగులో క్రమంగా బయట పడుతున్నారు. కాంగ్రెస్ పాలకుల తప్పుడు రాజకీయాలను చాటు చేసుకుని, దేశ ప్రజలను, రాష్ట్రాలను సామ్రాజ్యవలస పాలకుల మాదిరిగానే విభజించి పాలించే దుర్నీతికి బీజేపీ మత రాజకీయవాదులు కూడా గజ్జెకట్టారు. ప్రపంచ బ్యాంకు ప్రజావ్యతిరేక ‘సంస్కరణల’కూ, విదేశీ బహుళ జాతి కంపెనీల, దేశీయ గుత్త పెట్టుబడి వర్గాల ప్రయో జనాల కోసం గొడుగుపట్టడంలో కాంగ్రెసూ, బీజేపీ నేడు పోటాపోటీలు పడుతున్నాయి! అందులో భాగంగానే, చివరికి జాతీయ స్వాతంత్య్రోద్యమం గుర్తించి ఏక భాషా సంస్కృతులు పునాదిగా భాషా ప్రయుక్త రాష్ట్రాల అవతర ణను సుసాధ్యం చేసిన పరిణామాన్ని తిప్పికొట్టేందుకు ఈ రెండు రాజకీయశక్తులూ తమ ఉనికి కోసం, ఒకటిగా ఉన్న రాష్ట్రాలను విడగొట్టేందుకు పూనుకుంటున్నాయి. ప్రజల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. ప్రజల మౌలిక సమస్యలైన తిండి, బట్ట, వసతి, ఉపా ధి అవసరాలను తీర్చగల ప్రణాళికాబద్ధమైన పథకాలను అమలుజరిపే బాధ్యత నుంచి ఈ రెండు పార్టీలు రోజు రోజుకీ దూరమవుతున్నాయి. అందుకే ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు పెట్టుబడిదారీ వ్యవస్థకు సహజ మైన చిట్కా వైద్యాన్ని, విభజించి పాలించే నీతిని ఆశ్ర యించి ప్రజల మధ్య ఘర్షణలను, చీలికలను పెంచడానికి శతథా ప్రయత్నిస్తున్నాయి. ఈ ధోరణి దేశ విభజనతోనే ప్రారంభమై నేటికీ కొనసాగుతోంది! ప్రజల మధ్య, రాష్ట్రాల మధ్య తగవులు, తంపులు పెట్టే ‘సంస్కృతి’ ఆధారంగానే స్వాతంత్య్రానంతర కాంగ్రెస్ అధిష్టానమూ, అనంతరదశలో బీజేపీ నాయకులూ పంజాబ్‌ను చీల్చడం (పంజాబ్-హర్యానాలుగా) దగ్గర నుంచి మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్‌లను ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరా ఖండ్లుగా ముక్కలుగా బద్దలు కొట్టడం వరకూ కీలక పాత్ర వహించాయి. ‘విడిపోవటం వికాసం’ కోసమేననీ, ‘విడిపోయి కలిసి ఉందా’మనీ చేసే ప్రచారం, ఈ ‘విభజన’ రాజకీయ కుట్రలో ప్రధానాంశం! అదే సూత్రాన్ని ఇప్పుడు ఈ రెండు మత రాజకీయ పక్షాలూ, ఎన్నికలలో తమ స్వార్థ ప్రయో జనాల కోసం, భాషాప్రయుక్త ప్రాతిపదికపై ఏర్పడిన రాష్ట్రాల స్వరూపాలను చెదరగొట్టి, సమైక్యంగా ఉంటూ పెట్టుబడిదారీ వ్యవస్థ పరిధుల్లోనే అభివృద్ధిని నమోదు చేసుకుంటున్న ప్రజలను చెల్లాచెదురుచేయడానికి సంకల్పించాయి. విడిపోతేనే వికాసమని చెప్పే మాటలు నీటి మూటలేనని ఎన్డీయే సృష్టించిన మూడు రాష్ట్రాలు చాటిచెబుతున్నాయి. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి కోసమే ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లను ప్రత్యేక రాష్ట్రాలుగా విభ జించామని ఆనాడు చెప్పారు. కానీ ఆ లక్ష్యం నెరవేరలేదు సరికదా, ఏ రెండు రాష్ట్రాల నుంచి వీటిని ఏ ఉద్దేశంతో ‘చీల్చామ’ని చెప్పారో ఆ ఆదివాసీల బతుకుల్ని విద్య, వైద్య, ఆరోగ్య, ఉపాధి రంగాలలో చట్టుబండలు చేశారు. మత రాజకీయాలను ఆశ్రయించి తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ గత ఐదేళ్ల క్రితం వరకూ కర్ణాటక సహా మొత్తం ఏడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అప్పటిదాకా దక్షిణ భారతంలో కాలుమోపలేని బీజేపీ మొదటిసారిగా కర్ణాటకలో పూర్తిస్థాయి ప్రభు త్వాన్ని నెలకొల్పింది. అక్కడి నుంచి స్థానికంగా కర్ణాట కలో ఎన్ని రకాల మతఘర్షణలు చోటు చేసుకున్నాయో రాజకీయ పరిశీలకులకు తెలుసు! మరి ఈ నాడు ఈ పార్టీ పరిస్థితి ఏమిటి? ఏడు రాష్ట్రాల్లో తన అధికారం కూలి పోయి, ప్రస్తుతం పాలనాశక్తిగా బీజేపీ పాలన కేవలం నాలుగు రాష్ట్రాలకు కుదించుకుపోయింది! చివరికి దక్షిణా దిన చేజిక్కిందనుకున్న కర్ణాటక కూడా ఈ ఏడాది మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవమానకరంగా బీజేపీ చేజారిపోయింది! తాజాగా నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని నిల పడం కోసం ‘వికాస’ పురుషుని వేషంలో హైదరాబాద్ వచ్చి విభజన సభ జరిపాడు. తెలుగుజాతిని విడగొట్టేం దుకు, ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేసేందుకు సాగుతున్న రాజకీయ కుట్రలో తనవంతు పాత్ర పోషించేందుకు వచ్చాడు. వందలాది మంది రైతుల ఆత్మహత్యలకు, పోషకాహారానికి దూరమైపోయిన వేలాది మంది బాల బాలికల, శిశువుల అకాల మరణాలకు నిలయంగా ఉన్న గుజరాత్‌లోని సౌరాష్ర్ట ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం కోసం చాలా కాలంగా ఉద్యమిస్తోంది. ఏడు జిల్లాలతో కూడిన (జామ్‌నగర్, సురేంద్రనగర్, రాజ్‌కోట్, అమ్రేలి, భావ్ నగర్, పోర్బందర్, జునాగఢ్) సౌరాష్ట్రను గుజరాత్ నుంచి వేరు చేసి ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలన్న ఉద్య మం అక్కడ ఉధృతంగా సాగుతోంది. దానికి పరిష్కారం చూపలేని మోడీ తగుదునమ్మా అని తెలుగు జాతిని రెం డుగా చీల్చాలని రంకెలేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ముక్కలు కావాలి, బీజేపీ నాలుగు సీట్లు పెంచుకొని, ఢిల్లీ దర్బారుకు ఎగబాకాలనేది అసలు రంధి! వేర్పాటు ఉద్యమానికి ఊతం ఇవ్వడం అందుకే! నెహ్రూకు పోటీగా సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నిలు వెత్తు భారీ విగ్రహాలు ఆవిష్కరించాలని మోడీ ఆరాట పడుతున్నాడు. కానీ పటేల్ నిలబడింది భారతదేశ సమైక్య తకు, సంస్థానాల విలీనీకరణ ద్వారా రాష్ట్రాల సుస్థిరత కోసమేగాని మోడీలాగా విభజన ద్వారా వ్యక్తిగత ‘వికా సం’ కోసంకాదు! ఆంధ్రప్రదేశ్ విషయంలో రాష్ట్రాల పున ర్విభజన కోసం నియమించిన మొదటి ఫజలలీ కమి షనూ, నిన్నమొన్నటి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సమర్పించిన రెండు నివేదికలూ మొదటి ప్రాధాన్యాన్ని ఏకీకృత సమై క్యాంధ్రకే ఇచ్చాయనేది గమనార్హం. శ్రీకృష్ణ కమిషన్ ఆరు ప్రాధాన్యాలలో మొదటి ప్రాధాన్యాన్ని, ఆఖరి మాటనూ (1/6 ప్రతిపాదనలు) ఆద్యంతాల బిగింపు లాగా సమైక్య రాష్ట్రమే సరైనదీ, పురోగతికి సవ్యమైనదీ అని స్పష్టం చేసింది! ఇక్కడ నరేంద్ర మోడీగాని, అతడి లాంటి బీజేపీ నాయకులుగానీ ఈ సందర్భంగా సర్దార్ పటేల్ 1952, జూలైలో పార్లమెంటులో చేసిన ప్రసంగాన్ని బట్టీ పట్టక పోయినా కనీసం చదువుకొని ఉండటం అవసరం! ఆనాడే గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన తలెత్తినప్పుడు సర్దార్ పటేల్ ఇలా హెచ్చరించారు. ‘‘ఉత్తర బెంగాల్‌లోని గూర్ఖాలాండ్‌ను ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనను అవాస్తవమైన, అసహజమైన, జాతీయ ప్రయోజనాలకు హానికరమైన ప్రతిపాదనగా భారత ప్రభుత్వం భావిస్తోంది. అలాంటి ప్రత్యేక రాష్ట్రంఏర్పాటు కోసం జరిగే ఉద్యమానికి ఎలాంటి అవకాశం ఇవ్వరాదని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇలాంటి మతిలేని ప్రయత్నాల ద్వారా దేశ సంఘీ భావాన్ని చెడగొట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం సహించబోదు’’ ఏక భాషాసంస్కృతుల ఆధారంగా సహేతుకమైన భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును అభిలషిస్తూ జాతీయ కాంగ్రెస్ ఆమోదించిన తీర్మానాలను గౌరవిస్తూ, అసహ జమూ, అశాస్త్రీయమైన పద్ధతుల్లో రాష్ట్రాల విభజనను వ్యతిరేకిస్తూ సర్దార్ పటేల్ ఈ మాట చెప్పారనే వాస్తవాన్ని మోడీ ప్రభృతులు తెలుసుకోవటం మంచిది! -
72 గంటల్లోగా బంద్ విరమించాలి
డార్జిలింగ్/కోల్‌కతా: ప్రత్యేక గూర్ఖాలాండ్ డిమాండ్‌తో గూర్ఖాలాండ్ జనముక్తి మోర్చా (జీజేఎం) ఎనిమిది రోజులుగా కొనసాగిస్తున్న నిరవధిక బంద్‌ను చట్టవిరుద్ధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం ప్రకటించారు.బంద్‌ను విరమించుకునేందుకు జీజేఎంకు 72 గంటల గడువు విధించారు. బంద్‌లకు వ్యతిరేకంగా హైకోర్టు, సుప్రీంకోర్టుల ఆదేశాలు ఉన్నాయని, ఈ విషయంలో ముఖ్యమంత్రిగా తనకు కొన్ని రాజ్యాంగపరమైన బాధ్యతలు ఉన్నాయని మమత కోల్‌కతాలో ఏర్పాటైన మీడియా సమావేశంలో అన్నారు. ‘ఎనిమిది రోజులు సహనం వహించాను... నేను చాలా కఠినురాలిని. కఠిన చర్యలు తీసుకునే పరిస్థితులు కల్పించవద్దు’ అని హెచ్చరించారు. డార్జిలింగ్ తన గుండె అని, రాష్ట్రాన్ని విభజించే ప్రసక్తే లేదని మమత తేల్చి చెప్పారు. బంద్‌ను విరమించుకుంటే, చర్చలు జరిపేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. చర్చల కోసం వారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని లేదా హోంశాఖ కార్యదర్శిని సంప్రదించవచ్చని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై కూడా మమత విమర్శలు కురిపించారు. రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సూచించారు. డార్జిలింగ్ లోక్‌సభ నియోజకవర్గంపై కన్నేసి ఎవరూ జీజేఎంతో అవగాహన కుదుర్చుకోరాదని హెచ్చరించారు. అయితే, మమత అల్టిమేటంపై గురుంగ్ తీవ్రంగా స్పందించారు. నిరంకుశత్వంతో తమను లొంగదీయాలని ఆమె భావించినట్లయితే, అది పొరపాటే అవుతుందని అన్నారు. ్ర ఆమె తన అల్టిమేటంను ఉపసంహరించుకోకుంటే ‘జనతా కర్ఫ్యూ’ను అమలు చేస్తామని హెచ్చరించారు. మమత అల్టిమేటం నేపథ్యంలో స్థానిక పోలీసు బలగాలతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు డార్జిలింగ్‌లో భారీ ఎత్తున మోహరించాయి. జీజేఎం మద్దతుదారులు పలువురిపై అరెస్టు వారంట్లు ఉన్నాయని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని డార్జిలింగ్ ఎస్పీ కునాల్ అగ్రవాల్ చెప్పారు. ఇదిలా ఉండగా, జీజేఎం కీలక నేతలు ఇద్దరిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. పాత కేసులకు సంబంధించి గూర్ఖా ప్రాంతీయ ప్రాధికార సంస్థ (జీటీఏ) పాలక మండలి సభ్యుడు మహేంద్ర ప్రధాని, జీజేఎం డార్జిలింగ్ పట్టణ శాఖ అధ్యక్షుడు నారాయణ్ ప్రధాన్‌లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. డార్జిలింగ్‌లో కేబుల్ టీవీ ప్రసారాల నిలిపివేత... గూర్ఖాలాండ్ ఉద్యమంపై మమత సర్కారు అణచివేత కొనసాగిస్తోంది. తాజాగా, డార్జిలింగ్ పట్టణంలోని కేబుల్ ఆపరేటర్ల సేవలను నిలిపివేసింది. తగిన పత్రాలు లేనందునే ఈ చర్య తీసుకున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఒకవైపు ఉద్యమం ఉధృతంగా సాగుతుండగా, మరోవైపు కేబుల్ ప్రసారాలు నిలిచిపోవడంతో ప్రజలు ఎక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోలేని పరిస్థితిలో పడ్డారు. అస్సాంలో ‘ప్రత్యేక’ డిమాండ్లను ఆలకించిన పాండే గువాహటి/దిఫు: అస్సాంలోని ‘ప్రత్యేక’ డిమాండ్లను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అవినాశ్ పాండే శనివారం ఆలకించారు. కర్బీ ఆంగ్లాంగ్ను తెలంగాణ తరహాలో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ కోరగా, దీనిని అస్సాంలోనే స్వయంప్రతిపత్తి గల రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కర్బీ ఆంగ్లాంగ్ స్వయంప్రతిపత్తి రాష్ట్ర డిమాండ్ కమిటీ (కేఏఏఎస్డీసీఓఎం) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోనియాను ఉద్దేశించి రాసిన వినతిపత్రాన్ని పాండేకు అందజేసింది. -
బెంగాల్లో అట్టుడుకుతున్న గూర్ఖాలాండ్ ఉద్యమం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తాము అనుకూలమంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటన పశ్చిమబెంగాల్లో చిచ్చు రేపింది. గూర్ఖాలాండ్ రాష్ట్రం కోసం గత కొంత కాలంగా జీజేఎం నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె, బంద్ లాంటి వాటిని 72 గంటల్లోగా ముగించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని సీఎం మమతా బెనర్జీ హెచ్చరిస్తే.. అలా అయితే రక్తపాతం తప్పదని జీజేఎం తిరిగి హెచ్చరించింది. మమతా బెనర్జీ తన అల్టిమేటంను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ప్రజలే స్వచ్ఛందంగా కర్ఫ్యూ అమలుచేస్తారని, రక్తపాతం కూడా తప్పదని జీజేఎం అధ్యక్షుడు బిమల్ గురుంగ్ తీవ్రస్వరంతో తెలిపారు. డార్జిలింగ్, కుర్సెయాంగ్, కలింపాంగ్ మూడు జిల్లాల్లోనూ గత ఎనిమిది రోజులుగా జనజీవనం పూర్తిగా స్తంభించింది. ''వాళ్ల బంద్‌ను ఉపసంహరించుకోడానికి వాళ్లకు 72 గంటల గడువు ఇస్తున్నాను. మేం ఎనిమిది రోజుల పాటు సహించాం. జరిగింది చాలు. కేవలం కొద్దిమంది రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రం మొత్తం ఇబ్బంది పడుతోంది. వాళ్లు ఉపసంహరించుకోకపోతే, కోర్టు ఉత్తర్వుల ప్రకారం కఠిన చర్యలు తీసుకోక తప్పదు. అవసరమైనప్పుడు మనం స్ట్రాంగ్‌గా ఉండే మందులు తీసుకోక తప్పదు'' అని సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కలకత్తా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఆమె ప్రస్తావించారు. ప్రజాస్వామిక ప్రతిఘటనలను తాను సమ్మతిస్తాను గానీ, బంద్‌లు, ఇతర హింసాత్మక విధానాలను మాత్రం సహించేది లేదన్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని చూసేవారు ఎవరైనా ఫలితం అనుభవించక తప్పదన్నారు. కొంతమంది 'కేంద్ర రాజకీయ నాయకులు' రాష్ట్రంలో విభజించి పాలించే విధానం మానుకోవాలని, కేంద్ర ఏజెన్సీలు తమ విషయంలో జోక్యం చేసుకోకూడదని కూడా మమత హెచ్చరించారు. మమత ఈ మాట చెప్పగానే గురుంగ్ కూడా తీవ్రంగా స్పందించారు. మమతా బెనర్జీ ఇలా గడువులు పెట్టడం సరికాదని, లక్షలాది మంది ప్రజలు రోడ్లమీదకు వస్తారని ఆయన అన్నారు. ప్రజలను హతమార్చి రాజకీయాలు చేయాలనుకుంటే ప్రాణాలివ్వడానికి వారు సిద్ధమేనని చెప్పారు. తమ ఉద్యమం విషయంలో వెనకడుగు వేసేది లేదని, ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే రక్తపాతం తప్పదని, దానికి మమతే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. -
బెంగాల్లో అట్టుడుకుతున్న గూర్ఖాలాండ్ ఉద్యమం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తాము అనుకూలమంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటన పశ్చిమబెంగాల్లో చిచ్చు రేపింది. గూర్ఖాలాండ్ రాష్ట్రం కోసం గత కొంత కాలంగా జీజేఎం నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె, బంద్ లాంటి వాటిని 72 గంటల్లోగా ముగించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని సీఎం మమతా బెనర్జీ హెచ్చరిస్తే.. అలా అయితే రక్తపాతం తప్పదని జీజేఎం తిరిగి హెచ్చరించింది. మమతా బెనర్జీ తన అల్టిమేటంను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ప్రజలే స్వచ్ఛందంగా కర్ఫ్యూ అమలుచేస్తారని, రక్తపాతం కూడా తప్పదని జీజేఎం అధ్యక్షుడు బిమల్ గురుంగ్ తీవ్రస్వరంతో తెలిపారు. డార్జిలింగ్, కుర్సెయాంగ్, కలింపాంగ్ మూడు జిల్లాల్లోనూ గత ఎనిమిది రోజులుగా జనజీవనం పూర్తిగా స్తంభించింది. ''వాళ్ల బంద్‌ను ఉపసంహరించుకోడానికి వాళ్లకు 72 గంటల గడువు ఇస్తున్నాను. మేం ఎనిమిది రోజుల పాటు సహించాం. జరిగింది చాలు. కేవలం కొద్దిమంది రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రం మొత్తం ఇబ్బంది పడుతోంది. వాళ్లు ఉపసంహరించుకోకపోతే, కోర్టు ఉత్తర్వుల ప్రకారం కఠిన చర్యలు తీసుకోక తప్పదు. అవసరమైనప్పుడు మనం స్ట్రాంగ్‌గా ఉండే మందులు తీసుకోక తప్పదు'' అని సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కలకత్తా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఆమె ప్రస్తావించారు. ప్రజాస్వామిక ప్రతిఘటనలను తాను సమ్మతిస్తాను గానీ, బంద్‌లు, ఇతర హింసాత్మక విధానాలను మాత్రం సహించేది లేదన్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని చూసేవారు ఎవరైనా ఫలితం అనుభవించక తప్పదన్నారు. కొంతమంది 'కేంద్ర రాజకీయ నాయకులు' రాష్ట్రంలో విభజించి పాలించే విధానం మానుకోవాలని, కేంద్ర ఏజెన్సీలు తమ విషయంలో జోక్యం చేసుకోకూడదని కూడా మమత హెచ్చరించారు. మమత ఈ మాట చెప్పగానే గురుంగ్ కూడా తీవ్రంగా స్పందించారు. మమతా బెనర్జీ ఇలా గడువులు పెట్టడం సరికాదని, లక్షలాది మంది ప్రజలు రోడ్లమీదకు వస్తారని ఆయన అన్నారు. ప్రజలను హతమార్చి రాజకీయాలు చేయాలనుకుంటే ప్రాణాలివ్వడానికి వారు సిద్ధమేనని చెప్పారు. తమ ఉద్యమం విషయంలో వెనకడుగు వేసేది లేదని, ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే రక్తపాతం తప్పదని, దానికి మమతే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. -
డార్జిలింగ్‌లో ఆగని ‘ప్రత్యేక’ మంటలు
డార్జిలింగ్/న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా యూపీఏ నిర్ణయం ప్రకటించిన దరిమిలా దేశంలో పలుచోట్ల ‘ప్రత్యేక’ మంటలు వ్యాపించాయి. గూర్ఖాలాండ్ డిమాండ్‌తో డార్జిలింగ్‌లో సోమవారం మూడోరోజూ బంద్ కొనసాగింది. అస్సాంలో ‘ప్రత్యేక’ వాదాన్ని వినిపిస్తున్న పలు సంఘాలు సోమవారం నుంచి 1,500 గంటల బంద్ ప్రారంభించాయి. మిగిలిన రాష్ట్రాల్లోనూ ‘ప్రత్యేక’ డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. కలింపాంగ్‌లో గూర్ఖాలాండ్ డిమాండ్‌తో ఆత్మాహుతి చేసుకున్న గూర్ఖా జనముక్తి మోర్చా మద్దతుదారు మంగళ్‌సింగ్ అంతిమయాత్రలో జీజేఎం కార్యకర్తలు మౌనప్రదర్శనగా పాల్గొన్నారు. అట్టుడుకుతున్న అస్సాం: ‘ప్రత్యేక’ డిమాండ్లతో అస్సాం అట్టుడుకుతోంది. కర్బీ-అంగ్లాంగ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో ఆ ప్రాంతంలో కొనసాగుతున్న ఆందోళనల్లో చెదురు మదురు ఘటనలు జరిగాయి. ‘బోడోలాండ్’ డిమాండ్ కూడా ఊపందుకుంది. ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ 48 గంటల బంద్‌కు పిలుపునివ్వగా, యునెటైడ్ డెమోక్రటిక్ పీపుల్స్ ఫ్రంట్ సోమవారం 1,500 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. కర్ణాటకలోనూ డిమాండ్లు: కర్ణాటకలోనూ ‘ప్రత్యేక’ డిమాండ్లు మొదలయ్యాయి. 1956 వరకు సి-కేటగిరీ రాష్ట్రంగా ఉన్న కొడుగుకు ప్రత్యేక స్వయంప్రతిపత్తి ఇవ్వాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని 22 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నామని, ఈ మేరకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కొడవ నేషనల్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎన్యూ నాచప్ప కొడవ హెచ్చరించారు. కాగా, కర్ణాటకలో అత్యంత వెనుకబడిన ‘హైదరాబాద్-కర్ణాటక’ ప్రాంతాన్ని రాష్ట్రంగా ప్రకటించాలని హైదరాబాద్-కర్ణాటక జనపర సంఘర్షణ సమితి డిమాండ్ చేస్తోంది.