డార్జిలింగ్: చర్చల ద్వారా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నా, గూర్ఖాలాండ్ డిమాండ్‌ను విడిచిపెట్టబోమని గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) అధ్యక్షుడు బిమల్ గురుంగ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ సర్కారు సంతకం చేసిన గూర్ఖా ప్రాంతీయ ప్రాధికార సంస్థ చట్టంలో గూర్ఖాలాండ్ డిమాండ్ ఉందని ఆయన గుర్తు చేశారు. ఆయన ఆదివారంలో తన వ్యాఖ్యలను ‘ఫేస్‌బుక్’లో పోస్ట్ చేశారు. కేంద్రం తెలంగాణ డిమాండ్‌ను ఆమోదించినప్పుడు, తామెందుకు తమ డిమాండ్‌ను వదులుకోవాలని ప్రశ్నించారు.
ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌పై కేంద్రంతో చర్చలు జరిపేందుకు తమ పార్టీ ప్రతినిధులు డిసెంబర్ 21న ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిపారు. డార్జిలింగ్ పర్వత ప్రాంతంలోను, తెరాయి, దూవార్ ప్రాంతా ల్లో ఎలాంటి బంద్‌లు ఉండబోవన్నారు. డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లో శాంతి కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునివ్వడంపై స్పందిస్తూ, ఈ ప్రాంతంలో తానేమీ హింసాకాండను కోరుకోవడం లేదన్నారు.
గూర్ఖాలాండ్ డిమాండ్‌ను విడిచిపెట్టం: జీజేఎం
Published Mon, Oct 28 2013 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM
Advertisement