గూర్ఖాలాండ్ ఇవ్వండి: జీజేఎం | GJM to Take Out Rally for Gorkhaland in Delhi Friday | Sakshi
Sakshi News home page

గూర్ఖాలాండ్ ఇవ్వండి: జీజేఎం

Published Fri, Feb 21 2014 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM

GJM to Take Out Rally for Gorkhaland in Delhi Friday

కోల్‌కతా: ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణను ఏర్పాటు చేసిన రీతిలోనే ఏకపక్ష  నిర్ణయంతో బెంగాల్‌ను విడదీసి గూర్ఖాలాండ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని జీజేఎం(గూర్ఖా జన్‌ముక్తి మోర్చా) గురువారం ఇక్కడ డిమాండ్ చేసింది. కొన్ని దశాబ్దాలుగా తాము ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేస్తున్నామని జీజేఎం అధ్యక్షుడు బిమల్ గురుంగ్ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. తమ డిమాండ్ సాధనలో భాగంగా శుక్రవారం భారీస్థాయిలో ఢిల్లీలో ర్యాలీ చేపడుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఏపీ అసెంబ్లీ తీర్మానాన్ని తోసిపుచ్చి తెలంగాణను ఏర్పాటు చేసిన విధంగానే తమకు గూర్ఖాలాండ్‌ను ఏర్పాటు చేయాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement