bimal gurung
-
డార్జిలింగ్‌లో ఉద్రిక్తత
-
అంతిమ పోరాటానికి సిద్ధం కండి: గురుంగ్
డార్జిలింగ్: ప్రత్యేక గూరా ్ఖలాండ్ కల నెరవేర్చుకునేం దుకు ఇక అంతి మ పోరాటానికి సిద్ధం కావాలని గూర్ఖా జన్ముక్తి మోర్చా (జీజేఎం) సుప్రీమ్ బిమల్‌గురుంగ్ ప్రజలకు పిలుపునిచ్చారు. అందుకు సమయం ఆసన్నమైందని గుర్తు తెలియని ప్రాంతం నుంచిసందేశం పంపారు. ఆయన నివాసాలపై పోలీసుల దాడి క్రమంలో గురుంగ్ రహస్య ప్రాంతంలోకి వెళ్లిపోయారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జీజేఎం చేపట్టిన నిరవధిక బంద్‌తో పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ అట్టుడుకుతోంది. జీజేఎం మద్దతు దారులు రెండో రోజూ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వ్యాపార సంస్థలను మూయించి వేశారు. డార్జిలింగ్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని ఓ పంచాయతీ కార్యాలయానికి నిప్పంటించారు. కొండల్లో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. -
ఉద్యమంలో రాజకీయాలు!
గూర్ఖాలాండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉన్నదైనా.. డార్జిలింగ్ ప్రాంతంలో రాజకీయంగా పైచేయి సాధించటానికే తాజాగా ఉద్యమం సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు బెంగాలీ భాషను తప్పనిసరి చేస్తూ మమత బెనర్జీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. నేపాలీ మాతృభాషగా ఉన్న గూర్ఖాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈనెల 8న మమత డార్జిలింగ్‌లో కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మమత గోబ్యాక్ అంటూ పోలీసులపై దాడికి దిగిన నిరసనకారులు వారి వాహనాలను తగులబెట్టారు. జీజేఎం నాయకుడు బిమల్ గురుంగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో డార్జిలింగ్‌లో సోమవారం నుంచి నిరవధిక బంద్ జరుగుతోంది. వైద్యశాలలు, పాఠశాలలు, ఇతర అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ కార్యాలయాలు ఏవీ పనిచేయవని గుర్ఖాలు ప్రకటించారు. మరోవైపు మమత కూడా కఠినవైఖరి తీసుకున్నారు. విధులకు రాకపోతే రికార్డుల్లో ‘సర్వీసు బ్రేక్’గా పరిగణిస్తామని ఉద్యోగులను హెచ్చరించారు. పరిస్థితులను అదుపులోకి తేవడానికి సైన్యాన్ని మోహరించారు. పైచేయి సాధించాలనే ఆరాటం... డార్జిలింగ్‌లో తాజా స్థితికి రాజకీయ ఆధిపత్యం సాధించాలనే ఆరాటమే కారణం. గూర్ఖాలాండ్లో బిమల్ గురుంగ్ మాటకు తిరుగులేదు. ఇక్కడ మమత బలపడటంతో ఆమెకు చెక్ పెట్టాలని గురుంగ్ భావించారు. బెంగాలీ తప్పనిసరన్న మమత నిర్ణయాన్ని సాకుగా తీసుకొని ఆందోళనలకు పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను తెరపైకి తెచ్చి ఉద్యమిస్తే ప్రజల్లో భావోద్వేగాలు పెంచడం ద్వారా పట్టు నిలుపుకోవాలనేది గురుంగ్ ఆలోచన. బీజేపీని నిలువరించేందుకు దీదీ వ్యూహం.. ఉత్తర బెంగాల్‌లోని ఆరు జిల్లాల్లో బీజేపీ క్రమంగా బలం పెంచుకుంటోంది. ఈ జిల్లాలన్నింటిలో కలిపి 42 అసెంబ్లీ స్థానాలు ఉండటంతో బీజేపీ ఎదుగుదలను దీదీ ముప్పుగా భావిస్తున్నారు. చిన్నరాష్ట్రాలకు బీజేపీ సూత్రప్రాయంగా అనుకూలం. మంగళవారం స్థానిక బీజేపీ నేతలు జీజేఎంతో సమావేశంలో పాల్గొని గుర్ఖాలాండ్‌కు మద్దతు పలికారు. డార్జిలింగ్ చుట్టుపక్కల కొండప్రాంతాల్లోనే ప్రత్యేక గూర్ఖాలాండ్‌కు మద్దతు ఉందనీ, మైదాన ప్రాంతాల్లోని ప్రజలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తారని మమత లెక్క. బీజేపీపై విభజనకు అనుకూలమనే ముద్రవేసి ఈ జిల్లాల్లో బీజేపీని దెబ్బతీయాలని దీదీ చూస్తున్నారు. పాపం అమాయక ఆదివాసీలే సెంటిమెంట్‌తో రోడ్డెకుతున్నారు. 110 ఏళ్ల డిమాండ్ డార్జిలింగ్‌తోపాటు సిలిగుడి, జల్పాయ్‌గుడిలోని కొన్ని ప్రాంతాలను కలిపి గూర్ఖాలాండ్ ఏర్పాటు చేయాలనేది 110 ఏళ్ల నుంచి ఉన్న డిమాండ్. ఇప్పటికీ తమను నేపాలీలనే సంబోధిస్తున్నారనేది గూర్ఖాల ఆవేదన. భాష, సాంస్కృతికపరమైన వైవిధ్యాల కారణంగా ప్రత్యేక రాష్ట్రంకోరుతున్నారు. పాలనా సంస్కరణల నిమిత్తం 1907లో భారత్‌లో పర్యటించిన మోర్లీ– మింటో ప్యానల్‌కు, 1952లో నెహ్రూకు, బాషాప్రయుక్త రాష్ట్రాల నిమిత్తం 1953లో ఏర్పాటైన ఎస్సార్సీ (రాష్ట్రాల పునర్విభజన కమిషన్)కి ప్రత్యేక గూర్ఖాలాండ్ ఏర్పాటు చేయాలనే వినతిపత్రాలు అందాయి. రాజీవ్ హయాంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ హింసాత్మక మార్గంలోకి మళ్లింది. సుభాష్ ఘీషింగ్ నేతృత్వంలోని గూర్ఖా జాతీయ విమోచన ఫ్రంట్ ఉద్యమించింది. 1986–88 మధ్య జరిగిన హింసాత్మక ఆందోళనల్లో 1,200 మంది పౌరులు చనిపోయారు. ఆరో షెడ్యూల్లో చేర్చి గిరిజన ప్రాంతానికి కొంతమేరకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించారు. దీని పగ్గాలను గురుంగ్‌కు అప్పజెప్పారు మమత. అయితే 2013 చివర్లో తెలంగాణ ఏర్పాటుకు నాటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జీటీఏ చీఫ్‌గా గురుంగ్ రాజీనామా చేసి... మమతతో తెగదెంపులు చేసుకున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
'బైచుంగ్కు ఇవ్వం... బీజేపీకే మద్దతు ఇస్తాం'
డార్జీలింగ్ లోక్‌సభ నియోజకవర్గానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు బైచుంగ్ భాటియాను ఎంపిక చేయడం పట్ల గుర్కా జనముక్తి మోర్చ (జీజేఎం) నిరసన వ్యక్తం చేసింది. అతడిని ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని జీజేఎం అధ్యక్షుడు బిమల్ గురంగ్ మంగళవారం డార్జీలింగ్లో వెల్లడించారు. సిక్కం రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఇక్కడ ఎలా ఎన్నికల బరిలో నిలుపుతారని ఆయన ఆ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రశ్నించారు. ఆయన ఎంపిక విషయం తమను సంప్రదించలేదన్నారు. అదికాక గుర్కాలాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఏప్పటి నుంచి పోరాడుతున్నామని ఆయన గుర్తు చేశారు. బీజేపీ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలంగా ఉందన్నారు. అందుకు మద్దతు ఇస్తామని ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు జస్వంత్ సింగ్, సుష్మాస్వరాజ్, రాజీవ్ ప్రతాప్ రూడీలు భరోసా ఇచ్చారన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకే మద్దతు ఇస్తామన్నారు. అయితే డార్జీలింగ్ ఎంపీ బీజేపీ సీనియర్ నేత జస్వంత్ సింగ్ గత ఐదేళ్లుగా తమ ప్రాంతానికి చేసింది ఏమీ లేదన్నారు. అయితే డార్జీలింగ్ నియోజకవర్గం నుంచి బైచుంగ్ వంద శాతం విజయం సాధిస్తాడని రాష్ట్ర మంత్రి గౌతమ్ దేవ్ ధీమా వ్యక్తం చేశారు. -
గూర్ఖాలాండ్ ఇవ్వండి: జీజేఎం
కోల్‌కతా: ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణను ఏర్పాటు చేసిన రీతిలోనే ఏకపక్ష నిర్ణయంతో బెంగాల్‌ను విడదీసి గూర్ఖాలాండ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని జీజేఎం(గూర్ఖా జన్ముక్తి మోర్చా) గురువారం ఇక్కడ డిమాండ్ చేసింది. కొన్ని దశాబ్దాలుగా తాము ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేస్తున్నామని జీజేఎం అధ్యక్షుడు బిమల్ గురుంగ్ ఫేస్బుక్లో పేర్కొన్నారు. తమ డిమాండ్ సాధనలో భాగంగా శుక్రవారం భారీస్థాయిలో ఢిల్లీలో ర్యాలీ చేపడుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఏపీ అసెంబ్లీ తీర్మానాన్ని తోసిపుచ్చి తెలంగాణను ఏర్పాటు చేసిన విధంగానే తమకు గూర్ఖాలాండ్‌ను ఏర్పాటు చేయాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. -
గూర్ఖాలాండ్ డిమాండ్‌ను విడిచిపెట్టం: జీజేఎం
డార్జిలింగ్: చర్చల ద్వారా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నా, గూర్ఖాలాండ్ డిమాండ్‌ను విడిచిపెట్టబోమని గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) అధ్యక్షుడు బిమల్ గురుంగ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ సర్కారు సంతకం చేసిన గూర్ఖా ప్రాంతీయ ప్రాధికార సంస్థ చట్టంలో గూర్ఖాలాండ్ డిమాండ్ ఉందని ఆయన గుర్తు చేశారు. ఆయన ఆదివారంలో తన వ్యాఖ్యలను ‘ఫేస్బుక్’లో పోస్ట్ చేశారు. కేంద్రం తెలంగాణ డిమాండ్‌ను ఆమోదించినప్పుడు, తామెందుకు తమ డిమాండ్‌ను వదులుకోవాలని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌పై కేంద్రంతో చర్చలు జరిపేందుకు తమ పార్టీ ప్రతినిధులు డిసెంబర్ 21న ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిపారు. డార్జిలింగ్ పర్వత ప్రాంతంలోను, తెరాయి, దూవార్ ప్రాంతా ల్లో ఎలాంటి బంద్‌లు ఉండబోవన్నారు. డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లో శాంతి కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునివ్వడంపై స్పందిస్తూ, ఈ ప్రాంతంలో తానేమీ హింసాకాండను కోరుకోవడం లేదన్నారు. -
కేంద్రంతో మాత్రమే చర్చిస్తాం: జీజేఎం
డార్జిలింగ్: ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌పై తాము కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే చర్చలు జరుపుతామని, పశ్చిమ బెంగాల్ సర్కారుతో ఈ అంశంపై మాట్లాడే ప్రసక్తే లేదని గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) కరాఖండిగా తేల్చి చెప్పింది. జీజేఎం చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా డార్జిలింగ్ పర్వతప్రాంతంలో ఆదివారం తొమ్మిది రోజూ బంద్ కొనసాగింది. ‘ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం ఏర్పాటు కోసం మా న్యాయమైన డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే చర్చలు సాగిస్తాం. ఈ అంశంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో మాట్లాడే ప్రసక్తే లేదు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఈ అంశంతో ఎలాంటి సంబంధం లేదు’ అని జీజేఎం అధినేత బిమల్ గురుంగ్ ఆదివారం మీడియాతో అన్నారు. డార్జిలింగ్ ప్రాంతానికి కేంద్రపాలిత ప్రాంతం హోదా పొందేందుకు కేంద్రంతో జీజేఎం రహస్య ఒప్పందం కుదుర్చుకుందంటూ వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న బంద్‌కు ఒకరోజు విరామం ప్రకటిస్తున్నామని తెలిపారు. ఆగస్టు 13-14 నుంచి ‘జనతా కర్ఫ్యూ’ ప్రారంభించనున్నామని ప్రకటించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విధించిన 72 గంటల గడువు ఆమె ఆదేశం కాదని, కోర్టు ఆదేశమని అన్నారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించకుండానే ‘జనతా కర్ఫ్యూ’ కొనసాగిస్తామని, ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతారని చెప్పారు. ఒకవైపు డార్జిలింగ్‌లో నిరవధిక బంద్ కొనసాగుతుండగా, మరోవైపు అరెస్టుల పర్వం కూడా కొనసాగుతోంది. జీజేఎం కోర్ కమిటీ సభ్యుడు శేఖర్ శర్మను శనివారం రాత్రి కుర్సియాంగ్లో పోలీసులు అరెస్టు చేశారు. బంద్‌లు ఆపకుంటే కఠిన చర్యలు: గొగోయ్ గువాహటి: ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లతో అస్సాంలో బంద్‌లు కొనసాగిస్తున్న నిరసనకారులు బంద్ ఆపాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ హెచ్చరించారు. త్రిపురలోనూ ‘ప్రత్యేక’ డిమాండ్: ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోనూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు డిమాండ్ తెరపైకి వచ్చింది. గిరిజన ప్రాంతాలను కలుపుతూ త్రిపుర గిరిజన ప్రాంతాల స్వయంప్రతిపత్తి జిల్లా మండలిని (టీటీఏఏడీసీ) ఏర్పాటు చేయాలని ఇండిజీనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీటీఎఫ్) డిమాండ్ చేసింది. అయితే, త్రిపురలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్నాయి. -
బెంగాల్లో అట్టుడుకుతున్న గూర్ఖాలాండ్ ఉద్యమం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తాము అనుకూలమంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటన పశ్చిమబెంగాల్లో చిచ్చు రేపింది. గూర్ఖాలాండ్ రాష్ట్రం కోసం గత కొంత కాలంగా జీజేఎం నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె, బంద్ లాంటి వాటిని 72 గంటల్లోగా ముగించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని సీఎం మమతా బెనర్జీ హెచ్చరిస్తే.. అలా అయితే రక్తపాతం తప్పదని జీజేఎం తిరిగి హెచ్చరించింది. మమతా బెనర్జీ తన అల్టిమేటంను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ప్రజలే స్వచ్ఛందంగా కర్ఫ్యూ అమలుచేస్తారని, రక్తపాతం కూడా తప్పదని జీజేఎం అధ్యక్షుడు బిమల్ గురుంగ్ తీవ్రస్వరంతో తెలిపారు. డార్జిలింగ్, కుర్సెయాంగ్, కలింపాంగ్ మూడు జిల్లాల్లోనూ గత ఎనిమిది రోజులుగా జనజీవనం పూర్తిగా స్తంభించింది. ''వాళ్ల బంద్‌ను ఉపసంహరించుకోడానికి వాళ్లకు 72 గంటల గడువు ఇస్తున్నాను. మేం ఎనిమిది రోజుల పాటు సహించాం. జరిగింది చాలు. కేవలం కొద్దిమంది రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రం మొత్తం ఇబ్బంది పడుతోంది. వాళ్లు ఉపసంహరించుకోకపోతే, కోర్టు ఉత్తర్వుల ప్రకారం కఠిన చర్యలు తీసుకోక తప్పదు. అవసరమైనప్పుడు మనం స్ట్రాంగ్‌గా ఉండే మందులు తీసుకోక తప్పదు'' అని సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కలకత్తా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఆమె ప్రస్తావించారు. ప్రజాస్వామిక ప్రతిఘటనలను తాను సమ్మతిస్తాను గానీ, బంద్‌లు, ఇతర హింసాత్మక విధానాలను మాత్రం సహించేది లేదన్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని చూసేవారు ఎవరైనా ఫలితం అనుభవించక తప్పదన్నారు. కొంతమంది 'కేంద్ర రాజకీయ నాయకులు' రాష్ట్రంలో విభజించి పాలించే విధానం మానుకోవాలని, కేంద్ర ఏజెన్సీలు తమ విషయంలో జోక్యం చేసుకోకూడదని కూడా మమత హెచ్చరించారు. మమత ఈ మాట చెప్పగానే గురుంగ్ కూడా తీవ్రంగా స్పందించారు. మమతా బెనర్జీ ఇలా గడువులు పెట్టడం సరికాదని, లక్షలాది మంది ప్రజలు రోడ్లమీదకు వస్తారని ఆయన అన్నారు. ప్రజలను హతమార్చి రాజకీయాలు చేయాలనుకుంటే ప్రాణాలివ్వడానికి వారు సిద్ధమేనని చెప్పారు. తమ ఉద్యమం విషయంలో వెనకడుగు వేసేది లేదని, ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే రక్తపాతం తప్పదని, దానికి మమతే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. -
బెంగాల్లో అట్టుడుకుతున్న గూర్ఖాలాండ్ ఉద్యమం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తాము అనుకూలమంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటన పశ్చిమబెంగాల్లో చిచ్చు రేపింది. గూర్ఖాలాండ్ రాష్ట్రం కోసం గత కొంత కాలంగా జీజేఎం నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె, బంద్ లాంటి వాటిని 72 గంటల్లోగా ముగించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని సీఎం మమతా బెనర్జీ హెచ్చరిస్తే.. అలా అయితే రక్తపాతం తప్పదని జీజేఎం తిరిగి హెచ్చరించింది. మమతా బెనర్జీ తన అల్టిమేటంను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ప్రజలే స్వచ్ఛందంగా కర్ఫ్యూ అమలుచేస్తారని, రక్తపాతం కూడా తప్పదని జీజేఎం అధ్యక్షుడు బిమల్ గురుంగ్ తీవ్రస్వరంతో తెలిపారు. డార్జిలింగ్, కుర్సెయాంగ్, కలింపాంగ్ మూడు జిల్లాల్లోనూ గత ఎనిమిది రోజులుగా జనజీవనం పూర్తిగా స్తంభించింది. ''వాళ్ల బంద్‌ను ఉపసంహరించుకోడానికి వాళ్లకు 72 గంటల గడువు ఇస్తున్నాను. మేం ఎనిమిది రోజుల పాటు సహించాం. జరిగింది చాలు. కేవలం కొద్దిమంది రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రం మొత్తం ఇబ్బంది పడుతోంది. వాళ్లు ఉపసంహరించుకోకపోతే, కోర్టు ఉత్తర్వుల ప్రకారం కఠిన చర్యలు తీసుకోక తప్పదు. అవసరమైనప్పుడు మనం స్ట్రాంగ్‌గా ఉండే మందులు తీసుకోక తప్పదు'' అని సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కలకత్తా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఆమె ప్రస్తావించారు. ప్రజాస్వామిక ప్రతిఘటనలను తాను సమ్మతిస్తాను గానీ, బంద్‌లు, ఇతర హింసాత్మక విధానాలను మాత్రం సహించేది లేదన్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని చూసేవారు ఎవరైనా ఫలితం అనుభవించక తప్పదన్నారు. కొంతమంది 'కేంద్ర రాజకీయ నాయకులు' రాష్ట్రంలో విభజించి పాలించే విధానం మానుకోవాలని, కేంద్ర ఏజెన్సీలు తమ విషయంలో జోక్యం చేసుకోకూడదని కూడా మమత హెచ్చరించారు. మమత ఈ మాట చెప్పగానే గురుంగ్ కూడా తీవ్రంగా స్పందించారు. మమతా బెనర్జీ ఇలా గడువులు పెట్టడం సరికాదని, లక్షలాది మంది ప్రజలు రోడ్లమీదకు వస్తారని ఆయన అన్నారు. ప్రజలను హతమార్చి రాజకీయాలు చేయాలనుకుంటే ప్రాణాలివ్వడానికి వారు సిద్ధమేనని చెప్పారు. తమ ఉద్యమం విషయంలో వెనకడుగు వేసేది లేదని, ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే రక్తపాతం తప్పదని, దానికి మమతే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. -
32 మంది గూర్ఖాలాండ్ ఉద్యమకారులు అరెస్ట్
గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న ఆందోళనకారుల చేపట్టిన బంద్ బుధవారం ఐదో రోజుకు చేరింది. అయితే 32 మంది గూర్ఖాలాండ్ ఉద్యమకారులను గతరాత్రి అరెస్ట్ చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. వారందరిపై గతంలోనే కేసు నమోదు అయ్యాయని, అలాగే శాంతిభద్రతలను కూడా పరిగణలోకి తీసుకుని వారిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. దాంతో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన ఉద్యమకారుల సంఖ్య 143 మందికి చేరిందని తెలిపారు. అయితే గూర్ఖాలాండ్ జనమూక్తి మోర్చ అధ్యక్షుడు బిమల్ గురంగ్ అనిత్ ధపాను ఈ నెల మొదట్లోనే అరెస్ట్ చేసినట్లు పోలీసుల ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఆ రాష్ట్ర హోం సెక్రటరీ బాసుదేబ బెనర్జీ డార్జిలింగ్ హిల్స్‌లోని స్థానిక అధికారులతో కలసి శాంతి భద్రతలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం ఆయన డార్జిలింగ్‌లోని గూర్ఖాలాండ్ ప్రాదేశిక పరిపాలన ముఖ్యకార్యదర్శి రామదాస్ మీనాతో సమావేశమైనారు. స్థానిక పరిస్థితులపై ఇరువురు చర్చించారు. పరిస్థితులు అదుపులోకి తీసుకువచ్చేందుకు సహకరించాలని ఆయనకు బెనర్జీకి సూచించారు. కొల్కత్తా వెళ్లగానే డార్జిలింగ్‌లోని పరిస్థితులపై సీఎం మమతా బెనర్జీకి నివేదిక సమర్పిస్తానని ఆయన తెలిపారు. అయితే డార్జిలింగ్ జిల్లా కలెక్టర్‌గా ఆర్థిక శాఖ సంయూక్త కార్యదర్శి పునీత్ యాదవ్‌ను నియమిస్తు బెంగాల్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుటివరకు ఆ పదవిలో ఉన్న సౌమిత్ర మోహన్‌ను బృద్వన్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.