కరోనాతో తృణమూల్ ఎమ్మెల్యే మృతి | TMC MLA succumbs to Corona in hospital | Sakshi
Sakshi News home page

కరోనాతో తృణమూల్ ఎమ్మెల్యే కన్నుమూత

Published Wed, Jun 24 2020 10:16 AM | Last Updated on Wed, Jun 24 2020 10:54 AM

TMC MLA succumbs to Corona in hospital - Sakshi

కోల్ కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తమోనాశ్ ఘోష్(60) కరోనా వైరస్ తో పోరాడుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. గత నెలలో ఆయనకు నిర్వహించిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. ఆ తర్వాత నుంచి ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.(కరోనా ఉగ్రరూపం: ఒక్క రోజే 465 మరణాలు)

తమోనాశ్ మృతి పట్ల టీఎంసీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘35 ఏళ్ల పాటు ప్రజలు, పార్టీ కోసం తమోనాశ్ పని చేశారు. ఆయన లేని లోటు పూడ్చుకోలేం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అంటూ మమతా ట్వీట్ చేశారు.(కోవిడ్‌‌ మరణాలు: భారత్‌లో 1, యూకేలో 63.13!)

పార్టీ తరఫున ఫాల్తా నియోజకవర్గం నుంచి తమోనాశ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1998 నుంచి టీఎంసీ ట్రెజరర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement