
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎల్‌పీజీ సిలిండర్ల ధరల పెరుగుదలను నిరసనగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదివారం సిలిగురిలో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో టీఎంసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గ్యాస్ బండ ప్లకార్డులు పట్టుకొని పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు బీజేపీ సిద్ధమైందని మండిపడ్డారు. బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని ఓట్లు టీఎమ్‌సీకి వేయండని ఆమె చెప్పారు.
మహిళలు బెంగాల్‌లో క్షేమంగా లేరని మోదీ అంటున్నారని, మరి బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో మహిళలు సురక్షితంగా ఉన్నారా అని ప్రశ్నించారు. బెంగాల్‌లోనే మహిళలు అత్యంత సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఈ పాదయాత్రలో పార్టీ ఎంపీలు మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్‌లు పాల్గొన్నారు. మర్చి 27 నుంచి ప్రారంభమయ్యే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎనిమిది దశల్లో జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment