సార్వత్రిక ఎన్నికలను రంజాన్ మాసంలో జరపడం ముస్లిం ఓటర్లపై ప్రభావం చూపెట్టే అవకాశం ఉందని వస్తున్న వ్యాఖ్యానాలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. రంజాన్ రోజు ఎన్నికలు జరిగితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసం ఉంటూనే తమ పనులు చేసుకుంటారని ఆయన తెలిపారు.