న్యూఢిల్లీ: టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రియాన్ సస్పెన్షన్ అంశంపై మంగళవారం రాజ్యసభలో హైడ్రామా నడిచింది. మంగళవారం సభ ఆరంభం కాగానే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రియాన్ మణిపూర్ అంశంపై చర్చించాలంటూ పట్టుబడ్డారు. దీంతో చైర్మన్ ధన్‌ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా కార్యకలాపాలకు పదేపదే అడ్డుతగులుతున్న ఒబ్రియాన్‌ను సభ నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరారు.
సభా మర్యాదకు భంగం కలిగిస్తున్నందుకు ఆయనను వర్షాకాల సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తూ రాజ్యసభలో నేత గోయల్ తీర్మానం ప్రవేశపెట్టారు. కాంగ్రెస్‌కు చెందిన ప్రమోద్ తివారీ సహా పలువురు సభ్యులు ఒబ్రియాన్ పట్ల సౌమ్యంగా వ్యవహరించాలని చైర్మన్‌ను కోరారు. స్పందించిన ధన్‌ఖడ్.. ఒబ్రియాన్ తిరిగి సమావేశాలకు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
కాగా, ప్రతిపక్ష నేతలపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన పీయూష్ గోయెల్‌పై ‘ఇండియా’ కూటమి నేతలు సభా హక్కుల నోటీసు ఇచ్చారు. న్యూస్‌క్లిక్ వెబ్‌పోర్టల్‌కు నిధులందాయంటూ గోయెల్ చేసిన ఆరోపణలపై విపక్ష పార్టీల నేతలు మంగళవారం రాజ్యసభ చైర్మన్‌కు ఈ మేరకు నోటీసు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment