
కోల్‌కతా: పార్టీ ప్రధాన కార్యదర్శి కునాల్‌ఘోష్‌కు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) షాక్ ఇచ్చింది. ఆ పదవి నుంచి ఘోష్‌ను తప్పిస్తూ పార్టీ హైకమాండ్ బుధవారం(మే1) ఆదేశాలు జారీ చేసింది.
ఇంతకుముందే ఘోష్‌ను అధికార ప్రతినిధి పదవి నుంచి తప్పించిన పార్టీ హైకమాండ్ తాజాగా ఆయనను ప్రధాన కార్యదర్శి పదవిని కూడా తొలగించింది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన తపస్‌రాయ్‌పై ఘోష్ బుధవారం బహిరంగంగానే ప్రశంసలు కురిపించారు.
తపస్‌రాయ్ పార్టీ మారడం సరైందేనని, తమ పార్టీ తృణమూల్ కాంగ్రెస్సే సరైన దిశలో వెళ్లడం లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తృణమూల్ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఘోష్ పదవి కోల్పోవాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment