Kunal Ghosh
-
కునాల్‌ఘోష్‌కు తృణమూల్ షాక్
కోల్‌కతా: పార్టీ ప్రధాన కార్యదర్శి కునాల్‌ఘోష్‌కు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) షాక్ ఇచ్చింది. ఆ పదవి నుంచి ఘోష్‌ను తప్పిస్తూ పార్టీ హైకమాండ్ బుధవారం(మే1) ఆదేశాలు జారీ చేసింది.ఇంతకుముందే ఘోష్‌ను అధికార ప్రతినిధి పదవి నుంచి తప్పించిన పార్టీ హైకమాండ్ తాజాగా ఆయనను ప్రధాన కార్యదర్శి పదవిని కూడా తొలగించింది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన తపస్‌రాయ్‌పై ఘోష్ బుధవారం బహిరంగంగానే ప్రశంసలు కురిపించారు. తపస్‌రాయ్ పార్టీ మారడం సరైందేనని, తమ పార్టీ తృణమూల్ కాంగ్రెస్సే సరైన దిశలో వెళ్లడం లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తృణమూల్ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఘోష్ పదవి కోల్పోవాల్సి వచ్చింది. -
‘రాజమాత కుటుంబం బ్రిటిష్ వాళ్లకి సహాయం చేసింది’
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికలో భాగంగా బీజేపీ పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణా నగర స్థానంలో రాజమాత అమ్రితా రాయ్‌ని బరిలోకి దించింది. దీంతో ఆమె ఎవరూ అని సోషల్‌మీడియాలో చర్చ జరిగింది. అయితే అదే స్థానంలో గతేడాది ఎంపీ సభ్యత్వం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) నేత మహువా మొయిత్రా పోటిలో ఉంది. దీంతో టీఎంసీ అమ్రితా రాయ్‌పై విమర్శలకు తెరలేపింది. ఆమె రాజకుటుంబం భారత దేశాన్ని పాలించిన బ్రిటిష్‌వారి పక్షమని మండిపడింది. కృష్ణానగర్‌ను పరిపాలించిన రాజు రాజా కృష్ణచంద్ర రాయ్.. బెంగాల్ నవాబ్ సిరాజ్ ఉద్ దౌలా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో బ్రిటీష్ వారికి సాయం చేసి అనుకూలంగా పనిచేశారని టీఎంసీ నేత కునాల్ ఘోష్ విమర్శించారు. ‘బెంగాల్ నవాబ్ సిరాజ్ ఉద్ దౌలా బ్రిటిష్‌వారి వ్యతిరేకంగా పోరాడుతున్నసమయంలో కృష్ణా నగర్ రాజకుటుంబం బ్రిటీష్వారికి సాయం చేసిందని చరిత్ర చెబుతోంది. అనాడు రాజా కృష్ణచంద్ర రాయ్.. బ్రిటీష్ బలగాలు సాయం చేశారు. బీజేపీ వీర్‌సావర్కర్ పార్టీ. ఈ పార్టీ మహాత్మ గాంధీ హత్యకు బాధ్యత వహించాలి. బ్రిటీష్వారికే సాయం చేసిన కుటుంబాన్ని ఎన్నికల బరిలో దించింది బీజేపీ. మహువా మొయిత్రా దేశంలోని అవినీతిపై పోరాటం చేస్తోంది’ అని కునాల్ ఆరోపణలు చేశారు. టీఎంసీ విమర్శలపై రాజమాత అమ్రితా రాయ్ స్పందించారు. తన కుటుంబంపై చేస్తున్నఆరోపణలు అసత్యాలని తెలిపారు. ‘టీఎంసీ చేసే ఆరోపణలను భారత్, బెంగాల్లో ఎవరూ నమ్మరు. నా కుటుంబంపై చేస్తున్న విమర్శలు అసత్యం. మహారాజా కృష్ణ చంద్ర రాయ్ బ్రిటిష్ పక్షమన్న ఆరోపణ నిజం కాదు. ఆయన అలా ఎందుకు చేశాడు?. ఆయన అలా చేసిఉంటే ఇక్కడ హిందుత్వం ఉండేదా? సనాతన ధర్మం ఉండేదా? ఆయన బెంగాల్‌కు మరో గుర్తింపు తీసుకువచ్చారు. మత వ్యతిరేకత నుంచి రాజా కృష్ణచంద్ర రాయ్ మనల్నీ కాపాడారని ఎందుకు అనుకోకుడదు?’అని ఆమె టీఎంసీ కౌంటర్ ఇచ్చారు. -
బాండ్లను డ్రాప్ బాక్స్‌లో పడేశారు..
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల పథకం ద్వారా వందల కోట్ల విరాళాలను అందుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమ దాతలు ఎవరో తెలీయదని చెప్పొకొచి్చంది. ప్రభుత్వ ప్రాజెక్టులు, కాంట్రాక్టులను సంపాదించిన కంపెనీలే ఆయా అధికార పారీ్టలకు వందల కోట్ల ముడుపులను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ముట్టజెప్పాయన్న ఆరోపణల నడుమ తృణమూల్ కాంగ్రెస్ స్పందించడం విశేషం. టీఎంసీకొచి్చన బాండ్లపై పశ్చిమబెంగాల్లో సోమవారం ఒక పత్రికా సమావేశంలో ఆ పార్టీ నేత కునాల్ ఘోష్ మాట్లాడారు. ‘‘ మా పారీ్టకి ఎవరు విరాళంగా ఇచ్చారో మాకు తెలీదు. ఎంత పెద్ద మొత్తాలను ఇచ్చిందీ తెలీదు. అసలు ఈ బాండ్ల పథకాన్ని తెచి్చందే బీజేపీ. రాజకీయ పారీ్టలకు నిర్వహణ వ్యయాలను ప్రభుత్వాలే భరించాలని 1990దశకం నుంచీ మమతా బెనర్జీ మొత్తుకుంటూనే ఉన్నారు. వేలకోట్ల నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట పడాలని ఆమె కాంక్షించారు. అయినా సరే ఎవరిమాటా వినకుండా బీజేపీ ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని తెచి్చంది. వేరే దారి లేక మేమూ ఆ పథకం నిబంధనలను పాటించాం. మాకు ఎన్ని బాండ్లు ఇచ్చారో, ఎవరిచ్చారో తెలీదు. సాధారణంగా పార్టీ ఆఫీస్ బయట ఒక డ్రాప్‌బాక్స్ ఉంటుంది. అందులోనే ఈ బాండ్లు ఎవరో పెట్టి వెళ్లారు. ఆ బాండ్లపై దాతల పేర్లు ఉండవు. కేవలం ఆల్ఫా–న్యూమరిక్ నంబర్ ఉంటుంది. దాత పేరు, వివరాలు బీజేపీకైతే తెలుస్తాయి. ఎందుకంటే వాళ్లే కేంద్రంలో అధికారంలో ఉన్నారు. సీబీఐ, ఈడీని తమ చెప్పుచేతల్లో ఉంచుకుని వాటి ద్వారా బెదిరించి మరీ విరాళాల వసూళ్ల పర్వాన్ని బీజేపీ యథేచ్ఛగా కొనసాగింది. బాండ్ల ద్వారా మేం అందుకున్న మొత్తాలను టీఎంసీ అధికారిక బ్యాంక్ ఖాతాల్లోనే జమచేశాం’’ అని కునాల్ ఘోష్ చెప్పారు. భారతీయ స్టేట్ బ్యాంక్ ఎలక్టోరల్ బాండ్ల గణాంకాల ప్రకారం తృణమూల్ కాంగ్రెస్‌కు 10 మంది అతిపెద్ద విరాళాల దాతల నుంచే ఏకంగా రూ.1,198 కోట్లు వచ్చాయి. ఫ్యూచర్ గేమింగ్, హోటల్ సరీ్వసెస్ సంస్థ ఒక్కటే టీఎంసీకి రూ.542 కోట్లు విరాళంగా ఇచ్చింది. సుప్రీంకోర్టు సూచించిన కాలపరిమితిలో ఎస్బీఐ నుంచి దాదాపు 1,300 సంస్థలు/వ్యక్తులు రూ.12,000 కోట్లకుపైగా విలువైన బాండ్లను కొనుగోలుచేసి 23 రాజకీయపారీ్టలకు తమకు నచి్చన మొత్తాలను విడివిడిగా విరాళంగా ఇవ్వడం తెల్సిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ బాండ్ల వివరాలన్నింటినీ ఎన్నికల సంఘానికి అందజేసింది. -
‘సువేందును పోటీకి దింపాలి’.. బీజేపీకి టీఎంసీ సవాల్
కోల్‌కతా: లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, జాబితా విడుదల చేయటంలో బిజీగా ఉంటున్నాయి. ఎన్డీయే కూటమిలో భాగంగా బీజేపీ.. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పోటాపోటీగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) నేత కునాల్ ఘోష్ బీజేపీకి సవాల్ విసిరారు. బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించటంలో జాప్యం చేస్తుందని అన్నారు. ఆ స్థానంలో పోటీకి నిలపడానికి బీజేపీకి అభ్యర్థులే దొరకటం లేదని ఎద్దేవా చేశారు. డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో బీజేపీ నేత సువేందు అధికారిని పోటీకి దింపాలని టీఎంసీ నేత కునాల్ ఘోష్ సవాల్ విసిరారు. ‘బీజేపీ నేత సువేందు అధికారికి నేను బహిరంగ వివాల్ విసురుతున్నా. ఆయిన డైమండ్ హార్బర్ సెగ్మెంట్లో మా నేత అభిషేక్ బెనర్జీపై పోటీ చేయలి’ అని కునాల్ అన్నారు. ఇప్పటికీ డైమండ్ హార్బర్ సెగ్మెంట్లో బీజేపీ ఎవరినీ పోటీకి దింపలేదు. ఇక.. ఈ సీటులో పోటీ చేయాలని బీజేపీ తమ అభ్యర్థులను కోరుతోందని ఎద్దేవా చేశారు. అయితే టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీకి కంచుకోట అయిన డైమండ్ హార్బర్ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిని ప్రకటించకపోవటం గమనార్హం. సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ 2014, 2019 రెండు సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజర్టీతో గెలుపొందారు. ఆదివారం బీజేపీ ఐదో జాబితాలో భాగంగా 111 మంది అభ్యర్థులు ప్రకటించింది. అందులో బెంగాల్ నుంచి 19 మంది అభ్యర్థులు పోటీకి దింపింది. ఇప్పటి వరకు మొత్తం 38 మంది అభ్యర్థులను బీజేప ప్రకటించింది. ఇక.. పశ్చిమ బెంగాల్లో మొత్తం ఏడు విడతల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. చదవండి: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే మంత్రిపై కేసు -
టీఎంసీలో కీలక పరిణామం.. కునాల్ ఘోష్‌కు షోకాజ్ నోటీస్
లోక్‌సభ ఎన్నికలకు ముందే పశ్చిమ బెంగాల్ రాజకీయాలలో ఆసక్తికరమైన పరిణామానాలు చోటు చేసుకుంటున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత తపస్ రాయ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా.. మరో నేత కునాల్ ఘోష్‌కు టీఎంసీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. కోల్‌కతా ఎంపీ సుదీప్ బందోపాధ్యపై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు కునాల్ ఘోష్‌కు టీఎంసీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. అంతకు ముందే ఘోష్ తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవులలో కొనసాగడం ఇష్టం లేదని ప్రకటించారు. కునాల్ ఘోష్ శనివారం తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఎంపీ సుదీప్ బెనర్జీ బ్యాంకు ఖాతాలు, ఆయన తరపున అపోలో, భువనేశ్వర్‌కు జరిగిన చెల్లింపులపై విచారణ జరపాలి. అతను కస్టడీలో ఉన్నప్పుడు, అతనికి పెద్ద మొత్తం చెల్లించారా లేదా అతని తరపున ఆసుపత్రికి చెల్లించారా లేదా అనే దానిపై విచారణ జరగాలని పోస్ట్ చేశారు. -
టీఎంసీలో వర్గపోరు.. కీలక నేత రాజీనామా?
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో కీలక నేత కునాల్ ఘోష్ రాజీనామా చేశారు. కునాల్‌కు అదే పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత సుదీప్ బందోపాధ్యాయ మధ్య గత కొన్ని నెలలుగా వివాదం నడుస్తోంది. దాని పరిణామం ఇప్పుడు బయటపడింది. మార్చి 10న కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో మమతా బెనర్జీ మెగా ర్యాలీ నిర్వహించనున్నారు. దీనికి సన్నాహాలు చేసేందుకు సుదీప్ ఇటీవల కోల్‌కతాలో టీఎంసీ నేతలతో సమావేశమయ్యారు. అయితే దీనికి ఆయన కునాల్ ఘోష్‌ను ఆహ్వానించలేదు. దీంతో కునాల్ ఘోష్.. సుదీప్ పేరు ప్రస్తవించకుండా ట్విట్టర్లో ఆయనపై విమర్శల దాడి చేసారు. ‘ఆ నేత అసమర్థుడు. గ్రూపులను నడిపే నేత, స్వార్థపరుడు. ఏడాది పొడుగునా చిల్లర రాజకీయాలు చేసి, ఎన్నికలకు ముందు ‘దీదీ అభిషేకం’ పేరుతో, పార్టీ కార్యకర్తల సహకారంతో ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వ్యక్తిగత ప్రయోజనాలకే ఉపయోగపడుతుంది. మరెలాంటి ప్రయోజనం ఉండదు’ అని పేర్కొన్నారు. 2017లో రోజ్ వ్యాలీ యజమాని నుంచి రూ.27 లక్షలు తీసుకున్న ఆరోపణలపై సీబీఐ సుదీప్‌ను అరెస్ట్ చేసి భువనేశ్వర్ జైలుకు పంపింది. నెలరోజుల పాటు జైలులో ఉన్నాక అతనికి బెయిల్ వచ్చింది. 2018లో జరిగిన ఈ కుంభకోణంలో ఈడీ రూ.130 కోట్లను స్వాధీనం చేసుకుని, సుదీప్‌ను విచారించింది. కాగా కునాల్ ఘోష్ తన రాజీనామాకు ముందే తన ట్విట్టర్ ప్రొఫైల్ నుండి టీఎంసీ అధికార ప్రతినిధి, జనరల్ సెక్రటరీ తదితర పోస్ట్‌లను తొలగించి, జర్నలిస్టు, సామాజిక కార్యకర్త అని రాశారు. -
‘బీజేపీలో చేరలేదనే గంగూలీపై కక్ష సాధింపు’
కోల్‌కతా: భారత క్రికెట్ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించింది పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. గంగూలీని పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు విఫలమైనందునే మాజీ కెప్టెన్‌ను అవమానపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో సౌరవ్ గంగూలీ బీజేపీలో చేరుతున్నారనే వార్తను వ్యాప్తి చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందన్నారు టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షాను బీసీసీఐ సెక్రెటరీగా రెండో టర్మ్ కొనసాగిస్తూ గంగూలీకి అధ్యక్షుడిగా మరోమారు అవకాశం ఇవ్వకపోవటంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అది రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపించారు. ‘సౌరవ్ గంగూలీని పార్టీలో చేర్చుకుంటున్నట్లు బెంగాల్ ప్రజల్లో ఓ వార్తను వ్యాప్తి చేయాలని బీజేపీ కోరుకుంటోంది. ఈ విషయంపై మేము నేరుగా మాట్లాడాలనుకోవట్లేదు. కానీ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తర్వాత అలాంటి వార్తల వ్యాప్తికి బీజేపీ ప్రయత్నించిన క్రమంలోనే మాట్లాడుతున్నాం. బీసీసీఐ చీఫ్‌గా రెండోసారి గంగూలీని కొనసాగించకపోవటం వెనుక రాజకీయాలు ఉన్నాయనే అనుమానాలు ఉన్నాయి. సౌరవ్‌ను అవమానించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.’ అని తెలిపారు ఘోష్. ఈ ఏడాది మే నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. గంగూలీ ఇంటికి వెళ్లటం వెనుక అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, పరిస్థితులపై మాట్లాడటానికి గంగూలీనే సరైన వ్యక్తి అని పేర్కొన్నారు. మరోవైపు.. గంగూలీకి మద్దతు తెలిపారు టీఎంసీ ఎంపీ సాంతాను సేన్. బీసీసీఐ అధ్యక్షుడిగా రెండాసారి ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు. ఖండించిన బీజేపీ.. సౌరవ్ గంగూలీ విషయంలో టీఎంసీ చేసిన ఆరోపణలను ఖండించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్. అవి నిరాధారమైన ఆరోపణలని కొట్టిపారేశారు. గంగూలీని పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ఎప్పుడు ప్రయత్నించిందో తమకైతే తెలియదన్నారు. బీసీసీఐ చీఫ్ మార్పుపై కొందరు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయటం టీఎంసీ మానుకోవాలని హెచ్చరించారు. ఇదీ చదవండీ: Sourav Ganguly: గంగూలీ కథ ముగిసినట్లే..! -
బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీకి ఊహించని షాక్!
partha chatterjee.. బెంగాల్లో అధికార తృణముల్ కాంగ్రెస్(టీఎంసీ)కి చెందిన విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ స్కామ్‌ల వ్యవహారం దేశంలోనే హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. కాగా, నటి అర్పితా ముఖర్జీ, పార్థా చటర్జీల ఈడీ విచారణలో కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేత పార్థా ఛటర్జీకి షాకిచ్చారు. టీఎంసీ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తక్షణమే ఛటర్జీని మంత్రి వర్గం నుంచి, పార్టీ పదవుల నుంచి, టీఎంసీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ తన వ్యాఖ్యలు తప్పు అయితే.. తనను అన్ని పదవులను నుంచి తొలగించే హక్కు పార్టీకి ఉందని చెప్పారు. తాను టీఎంసీ సైనికుడిగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు కునాల్ ఘోష్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అంతకుముందు కూడా కునాల్ ఘోష్.. పార్థా ఛటర్జీ అవినీతిపై ఇలాంటి సంఘటనలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించడంతో పాటు టీఎంసీ నేతల పరువును దిగజాచార్చాయి. పార్థా చటర్జీ తనకే కాకుండా రాష్ట్రానికి కూడా అప్రతిష్ట తీసుకువచ్చారని విమర్శలు చేశారు. Partha Chatterjee should be removed from ministry and all party posts immediately. He should be expelled. If this statement considered wrong, party has every right to remove me from all posts. I shall continue as a soldier of @AITCofficial. — Kunal Ghosh (@KunalGhoshAgain) July 28, 2022 ఇదిలా ఉండగా.. అర్పితా ముఖర్జీకి చెందిన మరో ఇంట్లో నుంచి కూడా నోట్ల కట్టలే బయటపడ్డాయి. బుధవారం నాడు బెల్గారియా ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో కోట్ల రూపాయలను గుర్తించారు ఈడీ అధికారులు. ఈ మేరకు బ్యాంక్ అధికారులకు సమాచారం అందించగా.. హుటాహుటిన చేరుకుని కౌంటింగ్ మెషీన్‌తో లెక్కించడం ప్రారంభించారు. దాదాపుగా 20 కోట్లకు పైగా డబ్బు.. బంగారు బిస్కెట్లు.. నగల్ని రికవరీ చేశారు. అంతేకాదు దర్యాప్తునకు ఉపయోగపడే.. కీలకమైన డాక్యుమెంట్లను సైతం సేకరించారు. మరోవైపు.. అర్పితా ముఖర్జీ నివాసాల్లో 18 గంటల పాటు సాగిన ఈడీ సోదాల్లో కీలక పత్రాలతో పాటు దాదాపు 50 కోట్ల రూపాయల నగదు.. ఐదు కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పది ట్రంకు పెట్టెల్లో నగదుతో పాటు నగలు, డాక్యుమెంట్లను డీసీఎం వ్యానులో అధికారులు తరలించారు. ఇది కూడా చదవండి: అర్పిత మరో ఇంట్లోనూ నోట్ల కట్టలు.. మంత్రితో సంబంధం ఉన్న మరో మహిళ ఎవరు? -
ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారణ
షిల్లాంగ్: శారదా, రోజ్‌వ్యాలీ చిట్‌ఫంట్ కేసుల్లో కోల్‌కతా కమిషనర్ రాజీవ్‌కుమార్, టీఎంసీ ఎంపీ కునాల్ ఘోష్‌లను సీబీఐ అధికారులు ఆదివారం సుదీర్ఘంగా విచారించారు. తొలుత వీరిని వేర్వేరు గదుల్లో విచారించిన అధికారులు, ఆ తర్వాత ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. శారదా చిట్‌ఫండ్ కుంభకోణంపై విచారణకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్‌కు రాజీవ్‌కుమార్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా శారదా చిట్‌ఫండ్ కుంభకోణానికి సంబంధించిన కీలక సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ఆయన యత్నించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శారదా కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. తాజాగా సుప్రీం ఆదేశాల మేరకు ఇద్దరు సీబీఐ అధికారుల బృందం రాజీవ్‌కుమార్, కునాల్ ఘోష్‌ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. వీడియో రికార్డింగ్‌కు సీబీఐ నో.. ఈ విషయమై సీబీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజీవ్ కుమార్‌ను రెండో రోజు విచారించామని తెలిపారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు మొదలైన విచారణ రాత్రి ముగిసిందన్నారు. తన విచారణను వీడియో తీయాలన్న రాజీవ్‌కుమార్ విజ్ఞప్తిని సీబీఐ తిరస్కరించిందని వెల్లడించారు. కస్టోడియల్ విచారణ సందర్భంగా మాత్రమే వీడియో రికార్డింగ్ చేస్తామని స్పష్టం చేశారు. మధ్యాహ్నం వరకూ రాజీవ్ కుమార్, ఘోష్‌ను వేర్వేరు గదుల్లో విచారించామనీ, ఆతర్వాత మాత్రం ఇద్దరిని ఒకే గదిలో కూర్చోబెట్టి విచారణ సాగించామని పేర్కొన్నారు. మరోవైపు షిల్లాంగ్‌లోని సరస్వతీదేవి ఆలయంలో పూజలు చేసిన అనంతరం కునాల్ ఘోష్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కునాల్ మీడియాతో మాట్లాడుతూ..‘ఈ విషయంలో నేను ఎలాంటి కామెంట్లు చేయదల్చుకోలేదు. మొదటినుంచి నేను సీబీఐ అధికారులకు సహకరిస్తున్నా. అందులో భాగంగానే ఈరోజు విచారణకు హాజరయ్యా’ అని తెలిపారు. శారదా కుంభకోణానికి సంబంధించి 2013లో కునాల్ ఘోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కొద్దికాలానికే ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. -
కోల్‌కతా పోలీస్ బాస్‌ను విచారించిన సీబీఐ
షిల్లాంగ్: కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్‌ను సీబీఐ అధికారులు శనివారం విచారణ జరిపారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని సీబీఐ కార్యాలయంలో ఉదయం ప్రారంభమైన విచారణ 9 గంటలపాటు కొనసాగింది. మధ్యలో విరామం సమయంలో బయటకు వచ్చిన ఆయన టీఎంసీ నేత, లాయర్ విశ్వజిత్ దేవ్, సీనియర్ ఐపీస్ అధికారులు జావెద్ షమీమ్, మురళీధర్ వర్మలతో మాట్లాడారు. శారదా చిట్‌ఫండ్ స్కాంకు చెందిన కీలక పత్రాల అదృశ్యంపై ఆదివారం రాజీవ్‌ను ప్రశ్నించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కుంభకోణానికి సంబంధించి టీఎంసీ మాజీ ఎంపీ కునాల్ ఘోష్‌ను కూడా ఆదివారం విచారించనున్నట్లు సీబీఐ తెలిపింది. చిట్‌ఫండ్ కుంభకోణంపై మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఐపీఎస్ అధికారి రాజీవ్‌కుమార్ నేతృత్వం వహించారు. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు బాధ్యతలను చేపట్టిన సీబీఐ..కుంభకోణంలోని కీలక ఆధారాలు కనిపించకుండాపోయినట్లు గుర్తించింది. వాటిపై విచారణకు సీబీఐ యత్నించగా కుమార్ సహకరించలేదు. గత వారం కుమార్ ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులను పోలీసులు నిర్బంధించడం, సీఎం మమతా బెనర్జీ ఆందోళనకు దిగడం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తటస్థప్రాంతమైన షిల్లాంగ్‌లో సీబీఐ అధికారులు రాజీవ్‌కుమార్ నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. -
సమగ్ర దర్యాప్తు జరిపించండి!
న్యూఢిల్లీ: శారదా చిట్స్ స్కాంపై సమగ్ర దర్యాప్తు జరపాలంటూ లెఫ్ట్ పార్టీల నేతలు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అన్ని దర్యాప్తు సంస్థలను సమన్వయం చేస్తూ ఈ తరహా మోసపూరిత స్కీములన్నింటిపై విచారణ జరిపించాలని కోరారు. శారదా కేసులో సెబీ, సీబీఐ, వంటి కేంద్ర సంస్థలు వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయని, అయితే దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ స్కామ్ మూలాల్లోకి వెళ్లడానికి అన్ని సంస్థల సంయుక్త దర్యాప్తు అవసరమని సూచించినట్లు సీపీఎంనేత సీతారాం ఏచూరి మీడియాకు తెలిపారు. ప్రధానిని కలసిన వారిలో సీపీఎం నేత బిమన్‌బోస్, పశ్చిమబెంగాల్ ప్రతిపక్ష నేత సుర్జోకాంత మిశ్రా, ఆర్ఎస్పీ నేత అబనీరాయ్, ఫార్వర్డ్ బ్లాక్ నేత అలీఇమ్రాన్ రమ్జ్ ఉన్నారు. శారదా మీడియాతో మమతకే అత్యధిక లబ్ధి: కునాల్ కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తృణమూల్ కాంగ్రెస్ నుంచి సస్పెండైన ఎంపీ కునాల్ ఘోష్ తీవ్ర ఆరోపణలు చేశారు. చిట్‌ఫండ్ స్కాంలో ఆమెకు వ్యతిరేకంగా స్థానిక కోర్టులో సోమవారం వాంగ్మూలమిచ్చారు. శారదా గ్రూప్‌నకు చెందిన శారదా మీడియా ద్వారా మమత అత్యధిక లబ్ధి పొందారన్నారు. 2013లో ఈ స్కాం బయటపడే నాటికి ఆ మీడియాకు కునాల్ ఘోష్ సీఈవోగా ఉన్నారు. అప్పటికి పలు పత్రికలు, టీవీ చానళ్లు శారదా మీడియా చేతిలో ఉన్నాయి. ఈ కేసులో తనను బలి పశువును చేశారని తృణమూల్ నేతలపై కునాల్ ధ్వజమెత్తారు. స్కాంలో మమత, పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ రాయ్ హస్తముందని పునరుద్ఘాటించారు. ‘నా వద్ద సమాచారం ఉంది. సీబీఐ నన్ను ప్రశ్నిస్తే ఆ వివరాలు వెల్లడిస్తా’ అని అన్నారు. -
అసలు దోషులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు: కునాల్
కోల్‌కతా: ‘శారదా స్కామ్‌లో అసలు దోషులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు.. వారిని ఇప్పటికీ అరెస్టు చేయలేదు. వారిని వెంటనే అరెస్టు చేయాలి’ అని తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత ఎంపీ కునాల్ ఘోష్ డిమాండ్ చేశారు. ఈ స్కామ్‌లో అరెస్టయి జైల్లో ఉన్న ఆయన శుక్రవారం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. కోల్‌కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో చికిత్స అనంతరం.. వైద్య పరీక్షల నిమిత్తం శనివారం ఆయన్ను ‘బంగూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరాలజీ’కి తరలించారు. ఈ సందర్భంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయనపైవిధంగా స్పందించారు. -
ఎంపీ కునాల్ ఆత్మహత్యాయత్నం
కోల్‌కతా సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న తృణమూల్ బహిష్కృత నేత నిద్ర మాత్రలు మింగడంతో ఆస్పత్రిలో చేర్పించిన అధికారులు శారదా స్కామ్ కేసులో సంచలన పరిణామం కోల్‌కతా: శారదా చిట్‌ఫండ్స్ స్కామ్ దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన ఎంపీ కునాల్ ఘోష్ కోల్‌కతాలోని కేంద్ర కారాగారంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. గతేడాది నవంబర్ 23న సీబీఐ ఘోష్‌ను అరెస్ట్ చేయగా, అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. నిద్ర మాత్రలు మింగినట్లు ఘోష్ వెల్లడించగా ఆయన్ను ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎస్ఎస్కేఎం ఆస్పత్రిలో చేర్పించామని పశ్చిమబెంగాల్ రాష్ట్ర జైళ్ల శాఖ మంత్రి హెచ్ఏ సాఫ్వి తెలిపారు. ఘోష్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని ఆస్పత్రి డెరైక్టర్ ప్రదీప్ మిత్ర ప్రకటించారు. ఆస్పత్రికి తీసుకొచ్చిన సమయంలో ఆయన మగత స్థితిలో ఉన్నట్లు తెలిపారు. తాను 40 నిద్ర మాత్రలు మింగినట్లు చెప్పారని వెల్లడించారు. సీసీయూ విభాగంలో చేర్చిన అనంతరం ఘోష్ కడుపు భాగాన్ని శుభ్రం చేసి, నమూనాలను పరీక్షల కోసం పంపామని వివరించారు. ముందుగా హెచ్చరించి మరీ... శారదా చిట్స్ స్కామ్ కేసు విచారణలో భాగంగా ఘోష్‌ను ఈ నెల 10న ఇక్కడి ఓ కోర్టులో హాజరు పరిచిన సందర్భంలో... ఈ కేసులో అసలు నిందితులు బయట స్వేచ్ఛగా తిరుగుతుంటే తాను జైల్లో ఉన్నానని, నిందితులపై సీబీఐ మూడు రోజుల్లోపు తగిన చర్య తీసుకోకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఘోష్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అరవింద్ మిశ్రా ముందు చెప్పినట్లు ఓ జైలు అధికారి వెల్లడించారు. ఈ హెచ్చరిక నేపథ్యంలో గత రెండు రోజుల నుంచి ఘోష్‌పై మరింత నిఘా పెట్టామని, గురువారం రాత్రి నిద్రించే ముందు కూడా అతన్ని పూర్తిగా తనిఖీ చేశామని, ఎలాంటి నిద్రమాత్రలు లభించలేదని జైలు అధికారి తెలిపారు. అయితే, శుక్రవారం వేకువజామున 2.30 గంటల సమయంలో శ్వాస ఆడటం కష్టంగా ఉందని, తాను నిద్రమాత్రలు మింగానని ఘోష్ చెప్పగా... వెంటనే వైద్యులను పిలిపించామని, వారు ఘోష్‌ను పరిశీలించి అంతా సాధారణంగానే ఉందని చెప్పినట్లు ఆ అధికారి వివరించారు. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ఆయన్ను ఎస్ఎస్కేఎం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఆత్మహత్నాయత్నం చేసిన ఘోష్‌పై జైలు అధికారుల ఫిర్యాదు మేరకు హాస్టింగ్ స్టేషన్ పోలీసులు సెక్షన్ 309 కింద కేసు నమోదు చేశారు. స్వతహాగా జర్నలిస్టు అయిన ఘోష్ గతంలో శారదా గ్రూపు కంపెనీ ‘బెంగాల్ మీడియా’కు సీఈఓగా వ్యవహరించారు. ఇన్వెస్టర్లకు భారీ లాభాల ఆశ చూపించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన శారదా చిట్స్ స్కామ్ కేసులో ఘోష్‌కు కూడా పాత్ర ఉందని పేర్కొంటూ సీబీఐ గతేడాది ఆయన్ను అరెస్ట్ చేసింది. శారదా స్కామ్‌లో పలువురు తృణమూల్ కాంగ్రెస్ అగ్రనేతల ప్రమేయం ఉందని ఘోష్ గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. జైలు అధికారులపై చర్య: ఈ సంచలన పరిణామంతో, కోల్‌కతాలోని కేంద్ర కారాగారం సూపరింటెండెంట్, ఘటన జరిగిన సమయంలో విధుల్లో ఉన్న సిబ్బంది, జైలు డాక్టర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం మమతా బెనర్జీ శాసనసభలో ప్రకటించారు. విచారణకు రాష్ట్ర హోం కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీని వేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఘోష్ ఆత్మహత్యాయత్నాన్ని బీజేపీ రాజకీయ కుట్రగా అభివర్ణించింది. ఈ కేసులో ఆధారాలను అణగదొక్కేందుకు ప్రయత్నం జరుగుతోందని ఆరోపించింది. -
జైల్లో బహిష్కృత ఎంపీ ఆత్మహత్యాయత్నం
-
జైల్లో బహిష్కృత ఎంపీ ఆత్మహత్యాయత్నం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన శారదా గ్రూపు చిట్‌ఫండ్ కుంభకోణంలో నిందితుడుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కునాల్ ఘోష్ శుక్రవారం జైల్లో ఆత్మహత్యాయత్నం చేశారు. కోల్‌కతా ప్రెసిడెన్సీ జైల్లో ఉన్న ఆయన 58 నిద్రమాత్రలు మింగి ఈ ఘటనకు పాల్పడ్డారు. కునాల్ ఆత్మహత్యాయత్నాన్ని గమనించిన జైలు అధికారులు హుటాహుటీన ఎన్ఎన్కెఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా కునాల్ ఘోష్‌పై ఆరోపణలు రావటంతో తృణమూల్ కాంగ్రెస్ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. కునాల్ గత నవంబర్ లో అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. శారదా గ్రూపు మీడియా విభాగం సీఈవోగా వ్యవహరించిన ఆయనపై చీటింగ్ సహా పలు అభియోగాలు ఉన్నాయి. మరోవైపు కునాల్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించటంతో జైల్లోనే ఉన్నారు. శారద స్కాంలో ప్రమేయం ఉన్న చాలామంది స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని, మూడు రోజుల క్రితం కునాల్ కోర్టుకు వెల్లడించారు. వారిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన కోరారు. -
పోలీసు కస్టడీకి కునాల్ ఘోష్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన శారదా గ్రూపు చిట్‌ఫండ్ కుంభకోణంలో అరెస్టయిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కునాల్ ఘోష్‌ను కట్టుదిట్టమైన భద్రత నడుమ స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఆయనను ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించింది. కునాల్ ఘోష్‌ను శనివారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శారదా గ్రూపు మీడియా విభాగం సీఈవోగా వ్యవహరించిన ఆయనపై చీటింగ్ సహా పలు అభియోగాలు మోపారు.