
లోక్‌సభ ఎన్నికలకు ముందే పశ్చిమ బెంగాల్ రాజకీయాలలో ఆసక్తికరమైన పరిణామానాలు చోటు చేసుకుంటున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత తపస్ రాయ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా.. మరో నేత కునాల్ ఘోష్‌కు టీఎంసీ షోకాజ్ నోటీసు ఇచ్చింది.
కోల్‌కతా ఎంపీ సుదీప్ బందోపాధ్యపై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు కునాల్ ఘోష్‌కు టీఎంసీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. అంతకు ముందే ఘోష్ తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవులలో కొనసాగడం ఇష్టం లేదని ప్రకటించారు.
కునాల్ ఘోష్ శనివారం తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఎంపీ సుదీప్ బెనర్జీ బ్యాంకు ఖాతాలు, ఆయన తరపున అపోలో, భువనేశ్వర్‌కు జరిగిన చెల్లింపులపై విచారణ జరపాలి. అతను కస్టడీలో ఉన్నప్పుడు, అతనికి పెద్ద మొత్తం చెల్లించారా లేదా అతని తరపున ఆసుపత్రికి చెల్లించారా లేదా అనే దానిపై విచారణ జరగాలని పోస్ట్ చేశారు.