
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత 'తపస్ రాయ్' (Tapas Roy) ఈ రోజు (సోమవారం) లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. జనవరిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన నివాసంపై దాడి చేసినప్పుడు పార్టీ నాయకత్వం తనకు అండగా నిలవలేదని, పార్టీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
తపస్ రాయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్‌కు సమర్పించానని, ఇప్పుడు నేను 'ఫ్రీ బర్డ్' అని అన్నారు.
తపస్ రాయ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన బీజేపీలో చేరతారా? లేదా మరేదైనా ప్రతిపక్ష పార్టీలో చేరతారా అనే దానిపై తీవ్రమైన ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఇతర పార్టీలలో చేరే విషయం మీద తన అభిప్రాయాన్ని రాయ్ వెల్లడించలేదు, రానున్న రోజుల్లో వెల్లడించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.