బీజేపీలో చేరిన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలు | Setback for Mamata Banerjee | Sakshi

బీజేపీలో చేరిన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలు

May 29 2019 7:28 AM | Updated on Mar 21 2024 8:18 PM

లోక్‌సభ ఎన్నికల ఫలితాల షాక్‌ నుంచి తేరుకోకముందే పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీకి గట్టి షాక్‌ తగిలింది. బెంగాల్‌లో కమలం వికసించడంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జారుకుంటున్నారు. మంగళవారం తృణమూల్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక సీపీఎం ఎమ్మెల్యే బీజేపీలో చేరారు. వీరితోపాటు 50 మందికిపైగా కౌన్సిలర్లు బీజేపీ తీర్థం పుచ్చుకోగా.. వీరిలో ఎక్కువ మంది టీఎంసీ పార్టీ వాళ్లే. బీజేపీ నాయకుడు ముకుల్‌ రాయ్‌ కొడుకు టీఎంసీ ఎమ్మెల్యే సుభ్రాన్షు రాయ్‌తోపాటు ఎమ్మెల్యేలు తుషార్‌కాంతి భట్టాచార్య (టీఎంసీ), దేవేంద్రనాథ్‌ రాయ్‌ (సీపీఎం) బీజేపీలో చేరారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement