కోల్‌కతా : ఐదో విడత సార్వత్రిక ఎన్నికల ముందు పశ్చిమ బెంగాల్‌లోని ఘాతల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, మాజీ ఏపీఎస్ భారతీ ఘోష్ సంచనల వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలను ఇళ్లలోంచి లాక్కొచ్చి కుక్కలను కొట్టినట్లు కొట్టిస్తా అని హెచ్చరించారు. ఆనందపూర్ ప్రాంతంలో తృణమూల్ కార్యకర్తల దాడిలో గాయపడినట్టు చెబుతున్న కొంతమంది బీజేపీ కార్యకర్తలను పరామర్శించిన భారతి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘ఓటు వెయ్యెదంటూ మా కార్యకర్తలను బెదిరిస్తారా? బెదిరించనివ్వండి. నేను కూడా ఉత్తర ప్రదేశ్ నుంచి 1000 మందిని తీసుకొచ్చి మిమ్మల్నీ(తృణమూల్ కార్యకర్తలు) కుక్కల్ని కొట్టించినట్లు కొట్టిస్తా. మా కార్యకర్తలకు ఏది ఇస్తే అంతకు రెట్టింపు వడ్డీతో కలిపి చెల్లిస్తా. అప్పుడు తృణమూల్ పార్టీ కార్యకర్తలు అంతా ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్లాల్సి వస్తుంది’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment