న్యూఢిల్లీ: పార్లమెంటులో ప్రశ్నలు అడగటానికి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా.. తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ నైతిక విలువల కమిటీకి నేరపూరిత ఆరోపణలను పరిశీలించే అధికారాలు లేవని ఆరోపించారు. ఈ మేరకు ఆమె కమిటీకి బుధవారం ఓ లేఖ రాశారు.
కాగా ఎథిక్స్ కమిటీ ముందు హాజరయ్యేందుకు మహువా సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే కమిటీ ముందు హాజరయ్యే ఒకరోజు ముందు ఆమె లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘తనకు జారీ చేసిన సమన్లను మీడియాకు విడుదల చేయడం సరైందని ఎథిక్స్ కమిటీ భావించినందున.. గురువారం విచారణను ఎదుర్కొనే ముందు నా లేఖను సైతం విడుదల చేయడం ముఖ్యమని భావిస్తున్నాను’ అని ఆమె చెప్పారు.
ప్యానల్‌కు క్రిమినల్ అధికార పరిధి లేదు
కమిటీ చైర్‌పర్సన్ వినోద్ కుమార్ సోంకర్‌కు రాసిన లేఖలో.. తనపై వచ్చిన నేరాపూరిత ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సరైన వేదికేనా? అని మహువా ప్రశ్నించారు. పార్లమెంటరీ కమిటీలకు నేరారోపణలను విచారించే క్రిమినల్ అధికార పరిధి లేదని పేర్కొన్నారు. చట్టపరమైన దర్యాప్తు సంస్థలు మాత్రమే ఇటువంటి కేసులో విచారించవచ్చునని చెప్పారు. దేశ రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటరీ కమిటీల దుర్వినియోగాన్ని నిరోధించే లక్ష్యంతో ఇలాంటి ఏర్పాట్లు చేశారని మోయిత్రా తెలిపారు.
చదవండి: రిచెస్ట్ ఫ్యాషన్ డిజైనర్ ఎవరో తెలుసా? గ్లోబల్ సెలబ్రిటీలు ఆమె కస్టమర్లు
హీరానందానీని కూడా విచారణకు పిలవాలి
వ్యాపారవేత్త దర్శన్ హీరానందానిని ప్రశ్నించేందుకు అనుమతించాలని మోయిత్రా డిమాండ్ చేశారు. కాగా పార్లమెంట్‌లో అడిగేందుకు తన నుంచి ప్రశ్నలు స్వీకరించినట్లు దర్శన్ ఆరోపిస్తున్నారు. అంతేగాక దుబాయ్ నుంచి ప్రశ్నలు పోస్టు చేసేందుకు ఆమె పార్లమెంట్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌కు వాడినట్లు తెలిపారు.
కాగా అదానీ గ్రూప్‌ను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకునేలా పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు మోయితా వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకున్నారంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయగా.. నైతిక విలువలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ విచారణ చేపట్టింది. ఈ కేసులో నవంబర్ రెండున మహువా లోక్‌సభ ఎథిక్స్ ముందు విచారణకు హాజరై తన వాంగ్మూలాన్ని ఇవ్వనున్నారు. ఈ కేసులో నిషికాంత్ దూబే, న్యాయవాది జై అనంత్ దేహాద్రాయ్‌లు ఇప్పటికే కమిటీ ముందు హాజరై.. తమ వాంగ్మూలాలను నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment