కోల్‌కతా: పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) భారీ విజయం సాధించింది. సంఖ్యాపరంగా తక్కువ అయినప్పటికీ తర్వాతి స్థానంలో బీజేపీ నిలిచింది. గత ఎన్నికల్లో మొదటి స్థానంలో ఉన్న సీపీఎం ఈసారి మూడో స్థానానికి పడిపోయింది. ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల ప్రకారం.. 19,394 గ్రామ పంచాయతీలను టీఎంసీ, 5,050 పంచాయతీలను బీజేపీ గెలుచుకోగా, 1,306 చోట్ల సీపీఎం, 918 చోట్ల కాంగ్రెస్ గెలుపొందాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. దీంతోపాటు పంచాయతీ సమితుల ఫలితాల్లోనూ అధికార పార్టీ మంచి ఫలితాలను నమోదు చేసుకుంది. టీఎంసీ 560 పంచాయతీ సమితులను గెలుచుకుని, 350 సమితుల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 24 స్థానాలను గెలుచుకుని మరో 16 చోట్ల మెజారిటీ దిశగా సాగుతోంది. జిల్లా పరిషత్‌లలో టీఎంసీ 55 స్థానాలను గెలుచుకుని 30 చోట్ల పూర్తి ఆధిక్యంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment