Reference
-
‘గోల్డెన్ అవర్‘ను మరవద్దు
⇒ నాచారంలో ఉండే హర్‡్ష అనే వ్యక్తి ఈ ఏడాది ఏప్రిల్ 27న సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు భయపడి మూడు దఫాల్లో రూ.కోటి 10 లక్షలు వారు చెప్పిన బ్యాంకు ఖాతాలకు పంపారు. తాను మోసపోయినట్టు గ్రహించిన వెంటనే సైబర్ క్రైం హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్ (సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోరి్టంగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టం) పోర్టల్‌లో వివరాలు అప్డేట్ చేశారు. కేవలం 12 నిమిషాల వ్యవధిలోనే రూ.కోటిని హోల్డ్ చేశారు. పెద్దమొత్తంలో డబ్బు లు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా ఆపగలిగారు. – సాక్షి, హైదరాబాద్‘‘గోల్డెన్ అవర్..’’సాధారణంగా ఈ పదం వైద్యం విషయంలో ఎక్కువగా వింటుంటాం. ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంటలో రోగికి అందే చికిత్స అనేది వారి ప్రాణాన్ని కాపాడడంలో కీలకం. అదే మా దిరిగా సైబర్‌నేరం జరిగిన తర్వాత కూడా వెనువెంటనే పోలీస్ దృష్టికి తీసుకెళ్లడం వల్ల సొమ్ము సైబర్ నేరగాళ్లకు చేరకుండా కాపాడవచ్చని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెబుతున్నారు. డబ్బు పోగొ ట్టుకున్న తర్వాత వెనువెంటనే సైబర్ క్రైం పోలీస్ టోల్ ఫ్రీ నంబర్ 1930 నంబర్‌కు సమాచారం ఇవ్వడంతో తగిన పరిష్కా రం దక్కుతుందని వారు సూచిస్తున్నారు. అదేవిధంగా సైబర్ క్రైం పోర్టల్లోనూ ఫిర్యాదు చేయవచ్చని చెబుతున్నారు.కంగారు వద్దు.. 1930కు డయల్ చేయండి సైబర్ నేరగాళ్ల చేతిలో వివిధ రూపాల్లో మోసపోతున్న బాధితులు తమ బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బులు కట్ కాగానే ఎంతో కంగారు పడుతుంటా రు. ఈ కంగారులో వారు వెంటనే బ్యాంకులకు పరుగెత్తుతున్నారు. బ్యాంకు అధికారులు ఈ విషయం పోలీసులకు చెప్పాలనడంతో అక్కడి నుంచి స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళుతున్నారు. అక్కడ పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వడం.. పోగోట్టుకున్న డబ్బు మొత్తాన్ని బట్టి ఆ కేసు ఎవరి పరిధిలోకి వస్తుందన్న వివరాలు సేకరించేటప్పటికే ఎంతో సమయం వృథా అవుతోంది.సైబర్ నేరగాళ్లు గురి చూసి మరీ సెలవులు, వారాంతాల్లోనే ఎక్కువ కొల్లగొడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో అయితే విషయం పోలీసుల వరకు వెళ్లేందుకు చాలా సమయం పడుతుంది. కానీ, ఇన్ని ప్రయాసలు, అనవసర కంగారు పక్కన పెట్టి.. వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం ఉత్తమమని సైబర్‌సెక్యూరిటీ బ్యూరో అధికారులు సూచిస్తున్నారు.24 గంటల పాటు అందుబాటులో ఉండే సిబ్బంది.. వెనువెంటనేడబ్బును కాపాడేందుకు చర్యలు తీసుకుంటారని వారు చెబుతున్నారు. అదేవిధంగా కొన్ని సార్లు నంబర్ వెంట నే కలవకపోతే నేరుగా సైబర్ క్రైం పోర్టల్ https:// cybercrime.gov.in లోనూ ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయడంతోనూ ఫలితం ఉంటుందని పేర్కొంటున్నారు.⇒ ఈ ఏడాది మే 14న ‘మేం మహారాష్ట్ర పోలీస్ శాఖ నుంచి మాట్లాడుతున్నాం.. మీపై పెద్ద మనీలాండరింగ్ కేసు నమోదైంది. వెంటనే మేం చెప్పినట్టు డబ్బులు పంపకపోతే మీపై కేసు నమో దు చేస్తాం..’’అని సైబరాబాద్‌లోని ఓ మహిళకు సైబర్ నేరగాడు ఫోన్‌కాల్ చేసి బెదిరించాడు. భయంతో వణికిపోయిన సదరు బాధితురాలు రూ.60 లక్షలు నేరగాళ్ల ఖాతాలో జమ చేసింది. తర్వాత తాను మోసపోయినట్టు గ్రహించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1930కు కాల్ చేసింది. క్షణాల్లోనే స్పందించిన టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సిబ్బంది బాధితురాలు పోగొట్టుకున్న రూ.60 లక్షలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా కేవలం గంట వ్యవధిలోనే కాపాడటం జరిగింది.సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్ అంటే?⇒ సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోరి్టంగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టంనే సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్గా చెబుతారు. ఇందులో పోలీసులు, సైబర్ సెక్యూరిటీ బ్యూరోల సిబ్బంది, బ్యాంకులు, ఆర్బీఐ, పేమెంట్ వాలెట్లు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తదితర వ్యవస్థలన్నింటికీ ఒక ఉమ్మడి వేదికగా ఈ పోర్టల్ పనిచేస్తుంది.1930 టోల్ ఫ్రీ నంబర్ నుంచి లేదా సైబర్ క్రైం పోర్టల్‌కు బాధితులు డబ్బు పోగొట్టుకున్నట్టు సమాచారం ఇవ్వ గానే ఆ సమాచారాన్ని బ్యాంకు ఖాతా వివరాలు, సమయం, ట్రాన్సాక్షన్ చేసి న విధానం (ఆన్లైన్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్‌కార్డు లేదా డెబిట్‌కార్డు ద్వారా) ఏ ఖాతా నంబర్‌కు డబ్బులు బదిలీ చేశా>రు..? ఏ సమయంలో చేశారు..? అన్నీ నమోదు చేయగానే సంబంధిత బ్యాంకు వాళ్లకు ఆ వివరాలు వెళతాయి. వెంటనే ఆ డబ్బు అనుమానాస్పద లావాదేవీ కింద గుర్తించి డబ్బులు హోల్డ్ చేస్తారు. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే.. అంత ఫలితంసైబర్ నేరగాళ్ల బారినపడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మోసపోయినట్టు గుర్తిస్తే.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలి. లేదా సైబర్ క్రైం పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి. వెంటనే సమాచారమివ్వడం వల్ల డబ్బులు బ్యాంకులోనే ఫ్రీజ్ చేయవచ్చు. దీని వల్ల బాధితులు పోగొ ట్టుకున్న డబ్బును కాపాడేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వెనువెంటనే సమాచారం ఇచి్చన బాధితుల సొమ్మును చాలా వరకు టీజీసీఎస్బీ కాపాడింది. – శిఖాగోయెల్, డైరెక్టర్, టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో -
డిప్యూటీ స్పీకర్ ‘ఎస్పీ’కి ఇవ్వండి: తృణమూల్
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఎంపిక పూర్తయింది. ఇక డిప్యూటీ స్పీకర్ ఎవరనే అంశం ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ కూటమికే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. ఇండియాకూటమిలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ మాత్రం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీకే ఆ పదవి ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు సమాచారం. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అవధేశ్ ప్రసాద్ ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఫైజాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. స్పీకర్‌గా బీజేపీకి చెందిన ఓం బిర్లా ఇప్పటికే ఎన్నికైన విషయం తెలిసిందే. -
భారత్‌లో ‘రిఫరెన్స్’ ఇంధనం ఉత్పత్తి షురూ..
న్యూఢిల్లీ: దేశీయంగా ‘రిఫరెన్స్’ పెట్రోల్, డీజిల్ ఇంధనాల తయారీ ప్రారంభమైంది. తద్వారా ఆటోమొబైల్స్ టెస్టింగ్ కోసం ఉపయోగించే ప్రత్యేక ఇంధనాలను తయారు చేసే దేశాల సరసన భారత్ కూడా చేరింది. చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ ఇంధనాలను ఆవిష్కరించారు. దిగుమతులను తగ్గించుకుని భారత్ స్వావలంబన సాధించే దిశగా రిఫరెన్స్ ఇంధనాల ఉత్పత్తి మరో కీలక అడుగని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మూడు సంస్థలే ఈ ఇంధనాలను తయారు చేస్తున్నాయని, ఇకపై దేశీయంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా వీటిని ఉత్పత్తి చేస్తుందని మంత్రి చెప్పారు. ఐవోసీ తమ పారదీప్ రిఫైనరీలో రిఫరెన్స్ గ్రేడ్ పెట్రోల్‌ను, హర్యానాలోని పానిపట్ యూనిట్లో డీజిల్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆటోమొబైల్ కంపెనీలు తాము తయారు చేసే వాహనాలను పరీక్షించేందుకు ప్రత్యేక గ్రేడ్ ఇంధనాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. దీన్నే రిఫరెన్స్ ఫ్యూయల్‌గా వ్యవహరిస్తారు. ఇలాంటి అవసరాల కోసం సాధారణ గ్రేడ్ ఇంధనాలు పనికిరావు. సాధారణంగా వీటి అమ్మకాలు పెద్దగా లేనందున దేశీయంగా రిఫైనరీలు ఇప్పటివరకు ఈ ఇంధనాలను ఉత్పత్తి చేయడం లేదు. దీంతో దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే, తాజాగా ఐవోసీ వీటిని తయారు చేయడం వల్ల రిఫరెన్స్ ఫ్యూయల్ రేట్లు తగ్గగలవు. సాధారణ పెట్రోల్, డీజిల్ రేట్లు లీటరుకు రూ. 90–96 (ఢిల్లీలో) స్థాయిలో ఉండగా.. దిగుమతైన రిఫరెన్స్ ఇంధనం రేటు రూ. 800–850 శ్రేణిలో ఉంటుంది. దేశీయంగానే దీన్ని ఉత్పత్తి చేస్తే లీటరు ధర సుమారు రూ. 450కి తగ్గుతుంది. దేశీయంగా డిమాండ్‌ను తీర్చిన తర్వాత ఐవోసీ ఎగుమతులపైనా దృష్టి పెట్టనుంది. -
ఇంధన ఉత్పత్తిలో భారత్ కీలక ముందడుగు.. ఇకపై దిగుమతి అక్కర్లేదు!
ఇంధన ఉత్పత్తిలో భారత్ ముందడుగు వేసింది. ఆటోమొబైల్ పరిశ్రమకు కీలకమైన సూచన ఇంధనాన్ని (రెఫరెన్స్ ఫ్యూయల్) ఆవిష్కరించింది. ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) సహకారంతో తన మొదటి రెఫరెన్స్ ఇంధనాన్ని ప్రారంభించింది. రెఫరెన్స్ ఫ్యూయల్‌ను దేశీయంగా ఉత్పత్తి చేయనున్న మూడవ దేశంగా భారత్ అవతరించింది. దీంతో ఇక రెఫరెన్స్ ఇంధనం కోసం ఇతర దేశాలపై ఆధాపడాల్సిన అవసరం ఉండదు. మనం సాధారణంగా 1,000 కిలోలీటర్ల రెఫరెన్స్ ఇంధనం దిగుమతి చేసుకుంటున్నామని, కానీ వినియోగం కేవలం 150 కిలోలీటర్లు మాత్రమేనని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. త్వరలో ఈ ఇంధనం దిగుమతులను ఆపివేసి, మనం కూడా ప్రధాన ఎగుమతిదారుగా మారనున్నామని ఆయన పేర్కొన్నారు. ఏమిటీ రెఫరెన్స్ ఫ్యూయల్? రెఫరెన్స్ ఫ్యూయల్ అనేది ఆటోమొబైల్ పరిశ్రమకు చాలా కీలకం. వాహన తయారీదారులు, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT), ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వంటి ఏజెన్సీలు వాహనాలను క్రమాంకనం చేయడానికి, పరీక్షించడానికి 'రిఫరెన్స్' ఇంధనాలను ఉపయోగిస్తాయి. చాలా డబ్బు ఆదా రెఫరెన్స్ ఇంధనాన్ని ఇండియన్ ఆయిల్ పారాదీప్ , పానిపట్ రిఫైనరీలు ఉత్పత్తి చేయనున్నాయి. దిగుమతి చేసుకున్న రిఫరెన్స్ ఫ్యూయల్ లీటరు ధర రూ. 800 నుంచి రూ.850 ఉంటోంది. అదే మన దేశంలోనే ఉత్పత్తి చేయడం వల్ల లీటరు దాదాపు రూ. 500 లోపే వచ్చే అవకాశం ఉంటుంది. -
కొత్త కోర్టులతో సత్వర న్యాయం అందాలి
విజయనగరం లీగల్: విజయనగరం జిల్లాలో కొత్తగా ఏర్పాటైన న్యాయస్థానాల ద్వారా ప్రజలకు సత్వర న్యాయం అందాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు అభిలషించారు. ఈ దిశగా న్యాయాధికారులు, న్యాయవాదులు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. విజయనగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో కొత్తగా మంజూరైన అదనపు సీనియర్ సివిల్ కోర్టుని ఆదివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి, జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ ఉపమాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ దుప్పల వెంకటరమణ ప్రారంభించారు. న్యాయసేవా సదన్‌లో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కార్యాలయాన్ని జస్టిస్ ఏవీ శేషసాయి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ యువ న్యాయవాదులకు తగిన శిక్షణ ఇచ్చి మెరికల్లాంటి న్యాయవాదులను అందించాలని సీనియర్ న్యాయవాదులకు సూచించారు. న్యాయవాదులు, న్యాయాధికారులు పరస్పరం గౌరవించుకోవడం ద్వారా సమాజానికి మేలు చేయగలమన్నారు. జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ మాట్లాడుతూ జిల్లా కోర్టు భవన సముదాయాలకు రూ.99 కోట్లతో మంజూరైన కొత్త భవనాలను నాణ్యతగా నిరి్మంచేలా బార్ కౌన్సిల్, యంత్రాంగం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా జడ్జి బి.సాయి కళ్యాణచక్రవర్తి, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు తదితరులు పాల్గొన్నారు. -
అధిక వర్షాలతో పత్తికి విపత్తు
సాక్షి, హైదరాబాద్: వారం క్రితం వరకు వర్షాలు లేక ఇబ్బందులు పడగా, ఇప్పుడు ఎడతెరపి లేని వర్షాలతో పంటలను ఎలా కాపాడుకోవాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. అనేక చోట్ల పత్తి పంటకు చేటు కలుగుతోంది. పత్తితోపాటు ఇతర ఆరుతడి పంటలైన సోయాబీన్, మొక్కజొన్న, కంది వంటి పంటలకు కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల విత్తనాలు చల్లినచోట అధిక వర్షాలతో మునిగిపోయి ఆయా విత్తనాలు కుళ్లిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొలక వచ్చినచోట కలుపు సమస్య, వేరుకుళ్లు, కాండం కుళ్లు తెగుళ్లు వస్తున్నాయి. వీటికి తోడు నిరంతర వర్షాల కారణంగా బ్యాక్టీరియా తెగుళ్లు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విత్తనాలు మొలకెత్తని చేలల్లో ఎక్కువ నీరు నిలిచిపోయే పరిస్థితి వస్తే పత్తి, సోయా, కంది వంటివి చేతికి రావనీ, వాటిని మరోసారి విత్తుకోవాల్సి ఉంటుందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా విభాగం మాజీ సంచాలకులు ప్రొఫెసర్ జగదీశ్వర్ అంటున్నారు. 38 లక్షల ఎకరాల్లో పత్తి సాగు... రాష్ట్రంలో వానాకాలం సీజన్లో ఇప్పటివరకు 57.24 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, 46.06 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఇటీవల వర్షాలు పుంజుకోవడంతో వ్యవసాయ పంటల సాగు ఊపు మీద ఉంది. కాగా, పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 37.98 లక్షల ఎకరాల్లో (75.07%) సాగైంది. ఇక వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 7.94 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ఇక పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 9.43 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.04 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.05 లక్షల ఎకరాల్లో (98.21%) సాగైంది. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 7.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3 లక్షల ఎకరాల్లో సాగైంది. వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తుండటంతో ఆయా పంటలను కాపాడుకోవడం ఇప్పుడు రైతులకు కీలకమైన అంశంగా జగదీశ్వర్ చెబుతున్నారు. రైతులు ఏం చేయాలంటే? ఆరుతడి పంటలైన పత్తి, కంది, పెసర, సోయాచిక్కుడు, మొక్కజొన్న పంటల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తమ పొలాల్లో నిలిచిన మురుగునీరు పోయేందుకు కాల్వలు ఏర్పరచాలి. వర్షాలు ఆగిన వెంటనే తమ పొలాల్లో కలుపు ఏమాత్రం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రై తులు పంటల వారీగా కలుపు మందులను ఎంచుకొని సరైన మోతాదులో పిచికారీ చేయాలి. సాధ్యమైనంతవరకు గుంటకతో కానీ, దంతెలతో గానీ కలుపు తీసివేయాలి. పత్తిలో అధిక వర్షాలకు వేరుకుళ్లు, కాండం కుళ్లు, కాయ కుళ్లు ఆశించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్కల మొదళ్లను కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని లేదా కార్బండాజిమ్ ఒక గ్రాము ఒక లీటర్ నీటికి కలుపుకొని మొక్కల అడుగు భాగంలో పిచికారీ చేయాలి. ప్రస్తుతం భూమిలో తేమను ఆధారం చేసుకొని ఆరుతడి పంటల్లో పైపాటుగా ఎరువులను యూరియా 30 కేజీలు, పొటాష్ 15 నుంచి 20 కేజీలు కలుపుతీసిన తర్వాత మొక్కలకు బెత్తెడు దూరంలో మట్టిలో లోతుగా వేయాలి. మే జూన్లలో వేసిన పత్తిలో వర్షాలు ఆగిన వెంటనే పేనుబంక, పచ్చదోమ ఆశించేందుకు అవకాశం ఉంటుంది. దీనికోసం ఎస్పేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి. వర్షాలకు వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు లేదా అగ్గితెగులు సోకేందుకు చాలా అనుకూల వాతావరణం ఉంది. దీంతో వర్షాలు ఆగిన వెంటనే ప్రైసైక్లోజల్ 0.6 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని అగ్గి తెగులు నివారణకు చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం బ్యాక్టీరియా తెగులు గమనించినట్లయితే తాత్కాలికంగా నత్రజని ఎరువులను వేయడం, వారం పది రోజుల వరకు ఆగి ముందస్తు చర్యగా కాపర్ఆజిక్లోరైడ్ 30 గ్రాములు, స్ట్రెప్లోమైసిన్ సల్ఫేట్ రెండు గ్రామలు పది లీటర్ల నీటికి కలుపుకొని ఎకరాకు 200 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలి. వరిలో ప్రస్తుతం వర్షాలను ఉపయోగించుకొని జూలై మాసాంతం వరకు స్వల్పకాలిక రకాలు (125 రోజులు) నారు పోసుకోవడానికి అనుకూలం. ఆ తర్వాత ఆగస్టు 15–20 తేదీల వరకు నాట్లు వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మధ్యకాలిక రకాలు (135 రోజులు) లేదా స్వల్పకాలిక రకాలు కూడా నేరుగా దమ్ము చేసిన పొలంలో డ్రమ్ సీడర్ ద్వారా గానీ, వెదజల్లుకు నే పద్ధతిలో గానీ వరిని విత్తుకున్నట్లయితే దాదా పుగా 15–20 రోజుల సమయం కలిసి వచ్చి మంచి దిగుబడులు రావడానికి అవకాశముంది. వెదజల్లే పద్ధతిలో విత్తుకునేప్పుడు నేల బాగా చదును చేసి ఉండాలి. ఆ తర్వాత వరి విత్తిన మూడు నుంచి ఐదు రోజుల లోపుల సిఫారసు చేసిన కలుపుమందులు తప్పనిసరిగా వాడాలి. -
విశ్వపతి పుస్తకానికి అమెరికా ప్రొఫెసర్ల ప్రశంస...
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత టి.వి.ఆర్.కే.మూర్తి ( విశ్వపతి ) రచించిన ‘శ్రీవారి దర్శన్’ పుస్తకానికి అమెరికా ప్రొఫెసర్ల ప్రశంసలు లభిస్తున్నాయి. ‘శ్రీవారి దర్శన్’ వలన తమకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి ఎన్నో ఆశ్చర్యకర విషయాలు తెలిశాయన్నారు. తమ విద్యార్థులకు ఈ విశేషాలన్నీ ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని విశ్వపతిని ప్రశంసించారు. విశ్వపతిని ప్రశంసించిన వారిలో హార్వర్డ్ యునివర్సిటీ ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ క్లోని, కొలంబియా యునివర్సిటీకి చెందిన జాన్ స్ట్రాటన్ హాలే, యేల్ యూనివర్సిటీ అలెగ్జాండర్ కోస్కోకోవ్ , ఫ్లోరిడా యూనివర్సిటీ ప్రొఫెసర్ మదన్ లాల్ గోయల్, కొలరాడో ప్రొఫెసర్ లోరిలియా బీరేసిం, ప్రొఫెసర్ బ్రియాన్ట్ ఎడ్విన్కి ఉన్నారు. రిఫరెన్స్ పుస్తకాలుగా ఉపయోగిస్తున్నాం.. విశ్వపతి రచించిన శ్రీవారి దర్శన్ , అమృతపథం , సిన్సియర్లీ యువర్స్ పుస్తకాలను ఫిలిప్పీన్స్ విశ్వవిద్యాలయం వారి ప్రధాన లైబ్రరీ లోనూ , వారి ఆసియా కేంద్రం లైబ్రరీ లోనూ ఉంచుతున్నట్లు విశ్వవిద్యాలయ లైబ్రేరియన్ మిసెస్ లాండా నుంచి వర్తమానం వచ్చింది. గతంలోనూ విశ్వపతి పుస్తకాలు హార్వర్డ్ , కార్నెల్ ఆక్స్ఫర్డ్ , కేంబ్రిడ్జి , కొపెన్హెగ్లోని డెన్మార్క్ రాయల్ లైబ్రరీలోనూ ఉంచారు. విశ్వపతి శ్రీ వేంకటేశ్వర స్వామిపై రాసిన పుస్తకాలను ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్టూడెంట్స్ రిఫరెన్స్ పుస్తకాలుగా ఉపయోగిస్తున్నారు. తాను రాసిన పుస్తకాలను ఇంతమందికి చేరడం ఆ శ్రీనివాసుని అనుగ్రహం గా భావిస్తున్నానని విశ్వపతి పేర్కొన్నారు. -
పళని ఉపదేశం
⇒ ఎంపీలతో భేటీ ⇒ తమిళ గళంపై హిత బోధ ⇒ కోవింద్‌కు ఓటు సూచన అన్నాడీఎంకే అమ్మ శిబిరం ఎంపీలతో సీఎం పళని స్వామి భేటీ అయ్యారు. సచివాలయం వేదికగా బుధవారం గంటన్నర పాటుగా ఈ సమావేశం సాగింది. పార్లమెంట్లో తమిళ గళం వినిపించాలని , కోవింద్‌కు మద్దతుగా ఓటు హక్కు వినియోగించుకోవాలని హిత బోధ చేశారు. సాక్షి, చెన్నై : తమిళ ప్రజల సమస్యలపై కేంద్రంలో గళం పెంచాలని ముఖ్యమంత్రి తమ ఎంపీలు, రాజ్యసభ సభ్యులకు సీఎం పళని స్వామి సూచించారు. అన్నాడీఎంకేకి 37 మంది పార్లమెంట్, 13 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఇందులో పన్నెండు మంది మాజీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలోని అన్నాడీఎంకే పురట్చి తలైవి శిబిరానికి మద్దతుగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన 38 మంది అన్నాడీఎంకే అమ్మ శిబిరం వెంట ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఇరు శిబిరాలు బీజేపీ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు తమ మద్దతును వేర్వేరుగా ప్రకటించాయి. ఈ పరిస్థితుల్లో తమ శిబిరం మద్దతు ఎంపీలకు సీఎం పళని స్వామి ఆగమేఘాలపై ఆహ్వానం పంపించారు. కొందరు ఢిల్లీలో ఉండడంతో అందుబాటులో ఉన్న మిగిలిన వారు సీఎం పిలుపుతో బుధవారం మధ్యాహ్నం సచివాలయం వద్ద వాలిపోయారు. ఓటు.. ఆపై ఒత్తిడి గంటన్నర పాటుగా సచివాలయం వేదికగా సీఎంతో సాగిన ఈ భేటీలో పార్లమెంట్లో అన్నాడీఎంకే సీనియర్ ఎంపీగా ఉన్న వేణుగోపాల్, రాజ్యసభలో సీనియర్ ఎంపీగా ఉన్న నవనీతకృష్ణన్తో పాటుగా ఇరవై మంది వరకు పాల్గొన్నారు. ప్రధానంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు జారిపోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు తగ్గ ఉపదేశాన్ని ఇచ్చి ఉన్నారు. అందరి ఓటు కోవింద్‌కు పడే రీతిలో చర్యలు తీసుకోవాలని, ఇందుకు తగ్గ బాధ్యతల్ని వేణుగోపాల్, నవనీతకృష్ణన్లకు పళని స్వామి అప్పగించడం గమనార్హం. ఇక, రాష్ట్రపతి ఎన్నిక తదుపరి సాగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తమిళ గళం మార్మోగే రీతిలో ముందుకు సాగాలని ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నారు. జీఎస్టీలోని కొన్ని అంశాలతో తమిళనాడుకు ఎదురైన సంక్లిష్ట పరిస్థితులు, తమిళ ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు, రాష్ట్రంలో అమల్లో ఉన్న కేంద్ర పథకాలకు నిధుల వ్యవహారం, కొన్ని పథకాల కారణంగా ప్రజల్లో నెలకొన్న ఆందోళన, హైడ్రో కార్బన్ తవ్వకాలు తదితర అంశాలపై చర్చ అనంతరం, ఈ విషయాలన్నింటినీ పార్లమెంట్, రాజ్యసభల దృష్టికి తీసుకెళ్లాలని, తమిళులకు న్యాయం చేకూరే రీతిలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా గళాన్ని వినిపించాలని హితబోధ చేశారు. తమిళ గళం వినిపిస్తాం సీఎంతో భేటీ అనంతరం నవనీతకృష్ణన్ మీడియాతో మాట్లాడారు. జీఎస్టీ, హైడ్రో కార్బన్, నీట్, రాష్ట్రపతి ఎన్నికల విషయంగా చర్చించుకున్నట్టు వివరించారు. జీఎస్టీ రూపంలో తమిళనాడుకు కొన్ని సమస్యలు ఎదురై ఉన్నాయని, వాటన్నింటినీ ఉభయ సభల్లో ప్రస్తావించనున్నామన్నారు. తమిళ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని కేంద్ర పథకాల్ని నిలుపుదల చేయించడం, నీట్ మినహాయింపు తదితర అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తమిళనాడుకు న్యాయం చేకూర్చే విధంగా తమ గళాన్ని పార్లమెంట్లో వినిపిస్తామన్నారు. తమిళులకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. బీజేపి అభ్యర్థికి తాము మద్దతు ఇస్తున్నామని, ఆయనకు మద్దతుగానే తమ వారందరి ఓటు ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకుంటారని స్పష్టం చేశారు.